top of page

వివాదానికి అధిష్టానం ఎండ్ కార్డ్..!

Writer: Writer Desk
Writer Desk
Oct 17, 2025
2 min read

హైదరాబాద్: కొండా సురేఖ వివాదానికి ప్రస్తుతం తాత్కాలికంగా తెర వేసినట్లు కనిపిస్తోంది..!నిన్న రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పిలుపుతో ఆమెను వెళ్లి కలిసిన సురేఖ, ఆమె తనయ సుష్మిత పటేల్ దాదాపు మూడుగంటల పాటు చర్చించారు..! ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు..!

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు.. జూబ్లీహిల్స్ ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం ఒక బీసీ వర్గానికి చెందిన సురేఖపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హెచ్చరించి వదిలేయాలని రాష్ట్ర నాయకులకు సూచించినట్లు తెలిసింది.. సురేఖతో మాట్లాడి సమస్యలు వివాదాలు పరిష్కారం అయ్యేవిదంగా చూడాలని మీనాక్షి ని ఆదేశించిందని, ఈ నేపథ్యంలోనే మీనాక్షి నిన్న పిసిసి అధ్యక్షుడి సమక్షంలోనే అన్ని అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది..!


మరోవైపు పొంగులేటి తదితర మంత్రుల వ్యవహారంపై కూడా అధిష్టానం తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సురేఖ విషయంలో వ్యవహరించిన తీరుపై కూడా అధిష్టానం పెద్దలు అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం..! సురేఖను టార్గెట్ చేసినట్లుగా కొందరు మంత్రులు వ్యవహరించడంపై పలువురు సీనియర్ బీసీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది..


ఒకరకమైన వివక్ష చూపినట్లుగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్ళాయని.. రెండు వైపుల తప్పులు జరిగినప్పటికీ.. ఒకరిన్నె టార్గెట్ చేసి వేధించినట్లుగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారం పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఉందని.. అధిష్టానానికి సమాచారం అందినట్లుగా పార్టీ ముఖ్యులు ఒకరు చెప్పారు..!

ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని.. సమస్యలపై వివాదాలపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ ఎవరు తెచ్చేలా వ్యవహరిస్తే ఒక ముందు ఉపేక్షించబోమని అధిష్టానం పెద్దలు కాస్త గట్టిగానే హెచ్చరికలు పంపినట్లు తెలుస్తోంది..!


మొత్తం మీద కొండా సురేఖ ను ఎలాగైనా మంత్రివర్గం నుండి సాగనంపాలని కొందరు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లేనని పార్టీకి చెందిన పలువురు బీసీ నేతలు అభిప్రాయపడుతున్నారు.!

••••

ఆత్మరక్షణలో పడేసిన సుష్మిత ఆరోపణలు...


మొన్న రాత్రి నుండి నిన్న రోజంతా కొనసాగిన పరిణామాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆసక్తిగా గమనించారు.. మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లడం.. రాత్రిపూట ఇంటికి వెళ్ళి హంగామా చేయడం.. మఫ్టీలో ఎందుకు వచ్చారు అంటూ సుస్మిత పటేల్ నిలదీయడం.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సుష్మిత ప్రభుత్వ పెద్దలపై తీవ్ర ఆరోపణలు చేయడం.. బీసీలపై వివక్ష చూపుతున్నారు అనే విధంగా ఆమె చేసిన కామెంట్స్ అధికార పార్టీని ఆత్మరక్షణలో పడేసినట్లు తెలిసింది..

ఒక క్యాబినెట్ మంత్రి ఇంటికి రాత్రిపూట పోలీసులను పాపించడమే తప్పిదంగా పార్టీ నేతలు సహా మెజారిటీ ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమైంది.. ఈ వ్యవహారమంతా పార్టీకి ప్రభుత్వానికి చేటు చేసేలా పరిణమించడంతో అధిష్టానం పెద్దలు వెంటనే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది..


ఒక మంత్రిని..అందులోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను బయటకు పంపించేందుకు ఇలా వ్యవహరిస్తారా..! అనే విధంగా తీవ్ర చర్చ జరగడంతో ఒకవిధమైన ఆందోళనకు అధిష్టానం పెద్దలు గురైనట్లు తెలుస్తోంది..!


మొత్తంగా సుస్మితా పటేల్ చేసిన వ్యాఖ్యలు మొత్తం వ్యవహారాన్ని మలుపుతిప్పినట్లుగా రాజకీయ వర్గాల్లో అభిప్రాయం.వ్యక్తం అవుతోంది..!

.......

A Report by

NEW SENSE

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page