top of page

తీన్మార్ కొత్త పార్టీ..! అదిరిపోయే రేట్ కు పాత పార్టీ హస్తగతం..!

Writer: Writer Desk
Writer Desk
Sep 12, 2025
1 min read

తెలంగాణ రాజకీయాల్లో తీన్మార్..!

కొత్త పార్టీని ఏర్పాటుచేస్తున్న మల్లన్న..!

భారీ మొత్తానికి పాత పార్టీని కొనుగోలు చేసినట్లు ప్రచారం..!

. హైదరాబాద్: తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తీన్మార్ మల్లన్న..!


రెండు దశాబ్దాల క్రితం బీసీ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో బీసీ సీనియర్ నాయకుడు పాలూరు రామకృష్ణయ్య ఏర్పాటు చేసిన పార్టీని తీన్మార్ కొనుగోలు చేసినట్లుగా సమాచారం..!

ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన పార్టీకి రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ నిజానికి ఎన్నికల కమిషన్ వద్ద గుర్తింపులేదు..


రిజిస్టర్డ్ నాన్ రికాగ్నైజ్డ్ పార్టీగానే ఎన్నికల కమిషన్ కు పార్టీ అధ్యక్షుడి హోదాలో రామకృష్ణయ్య ఆస్తులు లెక్కల వివరాలు నిబంధనల ప్రకారం సమర్పిస్తున్నారు..!


ప్రస్తుతం పార్టీని హస్తగతం చేసుకున్న తీన్మార్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పరిమితమయ్యే పార్టీగా సవరణలు చేయిస్తారా..! లేక రెండు రాష్ట్రాల్లో కొనసాగే విధంగా అలాగే ఏపీ పేరుపైనే కొనసాగిస్తారా తెలియాల్సి ఉంది..!

పార్టీకి కొనుగోలుకు సంబంధించి పెద్ద మొత్తంలోనే ఒప్పందం కుదిరినట్లుగా సమాచారం వస్తోంది..


ఒప్పందంపై బీసీ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది..!


నిజంగానే తీన్మార్ ఆర్థికంగా అంత ఎదిగాడా..? ఈ వార్త నిజమేనా..? ఎందుకు అంత పెద్దమొత్తానికి తీసుకుంటున్నారు..? కనీసం ఎన్నికల సంఘం గుర్తింపు కూడా లేని పార్టీకి అంత ఇస్తున్నారా.. అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు..!

ఇందులో వాస్తవాలు ఎలా ఉన్నా.. పాత పార్టీనే తీసుకుని కొత్తగా తీన్మార్ ఏర్పాటు చేస్తున్న విషయమైతే సుస్పష్టం..!


ఒక వైపు కొత్త పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత సన్నాహాలు చేస్తున్న సమయంలో తీన్మార్ పార్టీ ఏర్పాటుకు సిద్ధమై తేదీని కూడా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది..

మొత్తం మీద మరో రెండు రాజకీయ పార్టీలు తెలంగాణ పెద్ద పండుగ దసరా ముందు పురుడుపోసుకుంటున్న నేపథ్యంలో రాజకీయంగా భవిష్యత్తులో ఎలాంటి మార్పులు సంభవిస్తాయో చూడాలి..!


......

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page