top of page

ప్లాట్ రెగ్యులరైజ్ చేయడానికి పది లక్షలు..! ఏసీబీకి చిక్కిన అధికారి..!

Writer: Writer Desk
Writer Desk
Sep 9, 2025
1 min read

హైదరాబాద్ :ఉద్యోగ అవకాశాలను అందిపుచుకోవడంలో మగవాళ్ళతో పోటీ పడుతున్న మహిళలు అవినీతిలో కూడా పోటీ పడుతున్నట్లు ఇటీవల ఏసీబీ కి పట్టుబడుతున్న అవినీతి అధికారుల జాబితాను చూస్తే అర్థం అవుతోంది..


ఇటీవలి కాలంలో రెండు నెలల వ్యవధిలోనే పదికి పైగా మహిళా ఉద్యోగులు అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూఏసీబీకి పట్టుబడ్డారు.


ఇదే కోవలో తాజాగా నార్సింగ్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న మహిళ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు..


స్థానిక మంచిరేవుల పరిధిలో నివసించే వినోద్ అనే వ్యక్తి తన ఇంటి స్థలాన్ని రెగ్యులరైజ్ (ఎల్ ఆర్ ఎస్)

చేసుకోవడానికి మున్సిపాలిటీలో దరఖాస్తు చేశాడు. అయితే పదిలక్షల రూపాయలు ఇస్తేనే రెగ్యులరైజ్ చేస్తానని టౌన్ ప్లానింగ్ అధికారి మణిహారిక తేల్చి చెప్పారు. అంత డబ్బు ఇచ్చుకోలేనని, లీగల్ గా అన్ని డాక్యుమెంట్లు కరెక్ట్ గానే ఉన్నాయని, అన్ని డబ్బులు ఎందుకు అడుగుతున్నారంటూ వినోద్ అధికారిని ప్రశ్నించాడు. అయితే తాను అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే ఏదో ఒక కారణం చూపి దరఖాస్తు ను పెండింగ్ లో పెడతానని ఆమె ఖరాఖండిగా చెప్పడంతో వినోద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

మంగళవారం ఉదయం కార్యాలయంలో అధికారి మణిహారిక కు వినోద్ నాలుగు లక్షలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.


ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో మణిహారిక కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు..!





Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page