
విజయ్... విజిల్...!

విజయ్ కు విజిల్ వచ్చింది..!
అదేనండీ మన తమిళ హీరో విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీకి విజిల్ గుర్తును కేటాయిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది..
ఇక్కడ విజయ్ కు విజిల్ రావడం కాస్త ఆసక్తికరమైన పాయింట్..!
అట్లీ దర్శకత్వంలో తమిళంలో బిగిల్ పేరుతో ఒక సినిమా.వచ్చింది...
తెలుగులో విజిల్ పేరుతో విడుదల చేశారు...
విజిల్ ను తమిళంలో బిగిల్ అంటారు.. ఆ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో కొనసాగుతుంది.. తమిళంలోనూ తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణ పొందింది ఈ సినిమా..!

ఇపుడు రాజకీయ క్రీడలోకి ప్రవేశించిన విజయ్ కి సింబల్ గా విజిల్ రావడం ఒకవిధంగా ఆయనకు శుభసూచకమే అని చెప్పవచ్చు..!
విజిల్ ఊదే సందర్భం అప్రమత్తతను సూచిస్తుంది..
స్కూల్లో పీఈటీ టీచర్ విజిల్ లేకుండా ఆటలు ఆడించలేరు.. రైల్వేల్లో గతంలో ట్రైన్ ఆగడానికి బయలుదేరడానికి విజిల్ ఉదడం ఇప్పటికీ పలుచోట్ల కొనసాగుతోంది...
మెట్రో రైలు స్టేషన్ల వద్ద సెక్యూరిటీ సిబ్బంది విజిల్ ఊదుతూ జాగ్రత్తలు సూచిస్తూ అప్రమత్తం చేస్తుంటారు..

ఎవరైనా విజిల్ ఉదితే ఎంత పరధ్యానం లో ఉన్నవారైనా వెంటనే ఒక్క క్షణం ఉలిక్కి పడతారు...
ఇపుడు విజిల్ తో తమిళ ప్రజలను విజయ్ ఎంతవరకు అప్రమత్తం చేస్తాడు.. ఎంతవరకు విజిల్ ద్వారా రాజకీయాల్లో రాణిస్తాడనేది మరి కొద్ది నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు తేల్చబోతున్నాయి..!
విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్ సంక్రాంతికి ముందే విడుదలవాల్సి ఉండగా కోర్టు కేసులో చిక్కుకుని ఇప్పటికీ బయటపడటం లేదు...
సినిమా విడుదల ఆలస్యం వల్ల డిసప్పాయింట్మెంట్ లో ఉన్న విజయ్ కు ఆయన ఫ్యాన్స్ కు ఎన్నికల.కమిషన్ గుర్తు కేటాయిస్తూ అందించిన తీపి కబురు కొంత ఉపశమనం ఇచ్చినట్లయిందని విజయ్ అభిమాన తమిళ తంబీలు చెబుతున్నారు...!
.....




Comments