top of page

కుమార్తె అక్రమ బంధం..ప్రోత్సహించిన ఆమె తల్లిదండ్రులు..! ప్రాణాలు తీసుకున్న అల్లుడు..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • 2 days ago
  • 2 min read

పిల్లలను పాడు చేసేది పెద్దవాళ్ళే అన్నట్లుగా పాపపు పనులు చేశారు..!


కన్న కూతురి అక్రమసంబంధాన్ని సమర్థించి..సొంత అల్లుడికి నరకం చూపించారు...!


పరువు కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు కూతురు నీచపు వేషాలను సమర్ధించి తలదించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు..!


భార్య అక్రమసంబంధం.. అత్త మామ వేధింపులు.. కనీసం తన సొంత పిల్లలను చూడకుండా దారుణంగా అవమానించడంతో.. అవమాన భారంతో కుమిలిపోయాడు..! తీవ్ర మనోవేదనతో పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు..!



కన్నబిడ్డ దారితప్పి కట్టుకున్న వాడిని పక్కనబెట్టి వేరే వాడితో అక్రమసంబంధం పెట్టుకుని ఊరేగుతుంటే.. కట్టడి చేయాల్సిన తల్లిదండ్రులు బిడ్డకు బుద్ధిచెప్పాల్సింది పోయి.. కూతురి అక్రమ సంబంధానికి అల్లుడు అడ్డుగా ఉన్నాడని.. అతన్ని వదిలించుకుంటే.. తమ బిడ్డ అక్రమ వేషాలకు ఇబ్బంది ఉండదనే నీచ నికృష్టమైన ఆలోచన చేశారు.. బంధువులు స్నేహితులు బలగాన్ని పిలిచి ఘనంగా పెళ్లిచేసిన తల్లిదండ్రులు.. చెడు ఆలోచనతో చేసిన కుట్ర ఇప్పుడు వికృత ఫలితాన్ని చూపిస్తోంది..!


అల్లుడు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యమనే పాపం ఒకవైపు.. కూతురి జీవితం తమవళ్లే నాశనమైందనే ఆవేదన మరోవైపు.. స్నేహితులు బంధువర్గం ముందు దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి ఇంకో వైపు.. సర్వబ్రష్టంగా మారిపోయింది కుటుంబం పరిస్థితి...! కనీసం కుమార్తె పిల్లలను చూసి కూడా పద్ధతి మార్చుకోలేదు.. అలా ఆలోచన చేసి ఉంటే.. ఈ రోజు ఈ దారుణమైన పరిస్థితి ఉండేది. కాదు..! ఆదర్శంగా ఉండాల్సిన తాత అమ్మమ్మ నీచమైన పనులు చేసిన దోషులుగా పిల్లల ముందు నిలబడాల్సి రావడం నిజంగా.. దారుణమైన స్థితి..!


అభం శుభం తెలియని పిల్లలు ఇపుడు మంచి భవిష్యత్ ను కోల్పోవాల్సి వచ్చింది.. నాన్న పోయాడు.. అమ్మ పరిస్థితి ఏంటో తెలియదు..!




  • నల్గొండ జిల్లాలోఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన!


  • అత్త మామ భార్య బాధలు భరించలేక ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య..!


  • చండూర్ పోలీస్ స్టేషన్ పరిధి పుల్లెమ్లా గ్రామంలో ఘటన


  • సొంత మామ కూతురుని పెళ్లి చేసుకున్నప్పటికీ గత తొమ్మిది సంవత్సరాలుగా అక్రమ సంబంధం పెట్టుకుని హయత్ నగర్ పుట్టిఇంట్లోనే ఇద్దరి పిల్లలతో ఉంటున్న భార్య కల్పన!


భార్య కల్పన విషయం తెలిసి పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినప్పటికీ అత్తమామలు వారి కుటుంబం పై దాడి చేసి చిత్రహింసలు గురి చేశారు. సొంత మేనమామ శ్రీనివాస్ మరియు అతని భార్య రాజేశ్వరి తన పిల్లలను సైతం చూడనీయకపోవడంతో మృతుడి మల్లేష్ మనస్థాపానికి చెంది మద్యానికి బానిస అయ్యాడు.!

ఈనెల 1 న మరోసారి తన పిల్లలను చూడడానికి వెళ్తే మామ శ్రీనివాస్ మల్లేష్ పై దాడి చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన మల్లేష్ తన సొంత ఊరు పుల్లెమ్లా వ్యవసాయ పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.!


సొంత అల్లుడు మల్లేష్ మరణానికి కారణమైన మామ శ్రీనివాస్ మరియు భార్య కల్పనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని మృతుని తల్లిదండ్రులు మరియు పుల్లెమ్లా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు!కట్టుకున్న భర్త ఉన్నప్పటికీ అక్రమ సంబంధం పెట్టుకుని భర్తతో ఉండకపోవడమే కాకుండా భర్తని పిల్లలను కూడా చూడకుండా చిత్రహింసలు పెడుతూ అతని మరణానికి భార్య కల్పన మరియు ఆమె తండ్రి శ్రీనివాస్ కారణమయ్యారని వాపోతున్న మృతుని తల్లిదండ్రులు.! మామ శ్రీనివాస్ అతని భార్య రాజేశ్వరి మరియు మృతుని భార్య కల్పనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చండూర్ పోలీసులు..!


••••••••

ShyamaSundar Akula

9010746999

••••••••

 
 
 

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page