top of page

అందం.! ఆనందం..! అంతలోనే విషాదం..!

Writer: Writer Desk
Writer Desk
Jun 16
2 min read

వెండితెర అయినా బుల్లితెర అయినా నటీనటులకు తీవ్ర ఒత్తిడి ఎదురవుతోందా..!


మానసిక ఒత్తిడి ఒకవైపు.. పరిశ్రమ నుండి ఎదురయ్యే సమస్యల ఒత్తిడి మరోవైపు.. భరించలేనంత మనోవేదనతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారా..!


ఆరేళ్ల క్రితం యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానస్పద మృతి..! తాజాగా యువనటి సంచిత ఉగాలే ఆత్మహత ఘటనలను ఎలా చూడాలి..!


చిత్ర పరిశ్రమలో పరిస్థితులే ఇందుకు కారణమనే ఆరోపణలు విమర్శలు బలంగా ఎందుకు వినిపిస్తున్నాయి..!


ఒత్తిడి భరించలేక ఎంతోమంది సినీ మరిశ్రమను వీడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని సినీ కార్మిక సంఘాలు నిలదీస్తున్నా స్పందన ఎందుకు ఉండటంలేదు..!



ఒక్క బాలీవుడ్ మాత్రమే కాదు..! దక్షిణాదిలో టాలీవుడ్ కోలీవుడ్ సహా అంతటా నటులకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి..!


యువ నటులు ఉజ్వల భవిష్యత్తును ఊహించుకుంటూ సినీ పరిశ్రమలో అడుగుపెడుతూ .. అంతలోనే ఇలా మనోవేదనతో ప్రాణాలు తీసుకుంటుంటే పట్టించుకునే వాళ్లే లేరా..!?


సంచిత ఆత్మహత్యతో మరోసారి ఈ ప్రశ్నలు పరిశ్రమకు చెందిన కార్మికులు నటుల నుండి వ్యక్తమవుతున్నాయి..!


బాలీవుడ్ లో సంచలనం రేపుతున్న యువ నటి సంచిత ఉగాలే ఆత్మహత్య ఉదంతం..!


దిల్ వాలే దుల్హానియా లెజాయింగే..! ఛావా..! కుంకుమ భాగ్య హిందీ సీరియల్స్ ఫేమ్.. మరాఠీ చిత్రసీమ యువ నటి సంచిత ఉగాలే అనూహ్యంగా ఆత్మహత్యకు పాల్పడ్డారు..! కెరీర్ లో ప్రతిభ చాటుతూ మంచి భవిష్యత్ ఉందని అందరూ భావిస్తున్న సమయంలో ఆమె మరణం అందరినీ కలిచి వేస్తోంది..!


కుంకుమ భాగ్య' నటి సంచిత ఉగాలే (22) ఆత్మహత్య; మరణానికి కొన్ని గంటల ముందు తన ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు..! ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది..!


వీడియోలో అత్యంత సంతోషంగా పాపులర్ సాంగ్స్ కు ఫేస్ మూమెంట్స్ ఇస్తూ హమ్ చేస్తూ కనిపించారు.. ఆమె ముఖంలో ఎక్కడ టెన్షన్ కానీ.. లోలోపల ఏదో బాధపడుతున్నట్లు ఏ మాత్రం కనిపించలేదు..!


ఆమె ఆత్మహత్యకు గల కరణాలు ఇంకా నిర్ధారణగా తెలియరాలేదు. తల్లిదండ్రులు కూడా ఎవరిపైనా అనుమానాలు వ్యక్తం చేయడం లేదు.!


ఆదివారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ముంబైలోని నలసోపరలో ఉన్న ఆమె నివాసంలోనే ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు తెలిపారు. మరోవైపు వృత్తిపరంగా ఎవరైనా ఇబ్బందులు పెట్టారా.. ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే బంధువులు స్నేహితులు.. వృత్తిపరంగా సహచరులు అందరినీ పోలీసులు విచారిస్తున్నారు..!


ఆమె ఆత్మహత్యపై హైలెవల్ దర్యాప్తు చేయించాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి..!

ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ శ్యామ్ లాల్ గుప్తా మాట్లాడుతూ ఆమె.కేవలం 22 ఏళ్లకే ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమైన విషయమని అన్నారు పరిశ్రమలో పరిస్థితులపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సంచిత ఉగాలే మృతిపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేసి వాస్తవాలు వెలికితీయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాశామని తెలిపారు..!


బాలీవుడ్ చిత్రపరిశ్రమలో సంచిత ఆత్మహత్య ఉదంతం సంచలనం రేపుతోంది..!

తోటి నటులతో ఎంతో కలివిడిగా ఆప్యాయతగా ఉండే సంచిత తమ.మధ్య లేదు అనే నిజం జీర్ణించుకోలేకపోతున్నామని ఆమెతో కలిసి పనిచేసిన సహా నటులు కన్నీటి పర్యంతమవుతున్నారు..! సెట్ లో ఉన్నంతసేపు నవ్వుతూ నవ్విస్తూ ఉండేదని.. ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించే సంచిత ఏదో బలమైన కారణం.లేకుండా ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదని.. ఆమెను అంతలా ప్రభావితం చేసిన విషయం ఏంటో బయటకు తెలియాల్సిన అవసరముందని.. పోలీసుల దర్యాప్తు సజావుగా సాగుతుందనే నమ్మకంఠమకి ఉందని సహ నటులు అభిప్రాయపడ్డారు..!


ఆసక్తికర విషయాలు చెప్పిన స్నేహితురాలు..!

సంచిత సహా నటి, క్లోజ్ ఫ్రెండ్ మేఘాశర్మ కొత్త విషయాలు బయటపెట్టారు..! సంచిత ఈ ఏడాది నుండి వ్యక్తిగత సమస్యలకు సంబంధించి మనోవేదనకు గురవుతోందని చెప్పారు.. ఆమె తరచూ డిప్రెషన్ లోకి వెళ్తున్నట్లు తనతో చెప్పేదని.. అయితే ఈ విషయాలు ఎవరికీ తెలియవద్దని తను కోరుకుందని చెప్పారు..డిప్రెషన్ కు సంబంధించి సంచిత చికిత్స కూడా తీసుకుంటున్నారని చెప్పారు..!కానీ సంచిత ఏనాడు తన మనోభావాలను బయటకు కనిపించకుండా సంతోషంగా ఉంటూ ఇతరులను కూడా సంతోషంగా ఉండేలా చేస్తుండేదని.. అదే ఆమెలో గొప్పతనమని చెబుతూ స్నేహితురాలిని గుర్తుచేసుకుని మేఘాశర్మ బోరున విలపించారు..!



సుశాంత్ సింగ్ మాదిరిగానే నా సోదరి ఒత్తిడికి గురయ్యారు - సంచిత సోదరుడు ఆకాష్ సతీష్ ఉగాలే!

సంచిత ఆత్మహత్యపై ఆమె సోదరుడు ఆకాష్ సతీష్ ఉగాలే చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి..! ఆరేళ్ల క్రితం సరిగ్గా జూన్ 14 న సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడ్డారు.. అదే జూన్ 14 న నా సోదరి ఆత్మహత్య చేసుకుంది..! పరిశ్రమలో నటీనటులపై ఎంతటి ఒత్తిడి ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటూ ఆకాష్ కామెంట్స్ చేశాడు. తన సోదరి ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటలముందు తన సోషల్.మీడియా అకౌంట్ లో సుశాంత్ సింగ్ కు నివాళి అర్పించారని ఆకాష్ చెప్పాడు..! ముమ్మాటికీ తన సోదరి ఆత్మహత్యకు సినీ మరిశ్రమనే కారణం అన్నట్లుగా ఆకాష్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి..!


•••••••••

A Report By

ShyamaSundar Akula

9010746999

•••••••••


Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page