
విడుదల ఎప్పుడు..?
- Writer Desk

- Dec 5, 2025
- 2 min read
• పరువు తీసింది..చేతులెత్తేసింది..!
• సమస్య పరిష్కారం కాలేదంటూ రాత్రి పొద్దుపోయాక ప్రకటన..!
• అఖండ2 విడుదలపై సందిగ్ధం..!
• 14 రీల్స్ ప్లస్ నిర్వకంపై అభిమానుల మండిపాటు..!
........
బాలయ్య ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా అఖండ2..!
తొలిసారి పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్న సినిమా..!
ఎంతో హైప్ వచ్చిన సినిమాకు... సినిమా కష్టాలు తప్పట్లేదు..
ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల నిలిచిపోయింది..
తమ వల్ల కావడం లేదని.. ఇంకా సినిమా విడుదలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోలేదంటూ సినిమా నిర్మాణ సంస్థ ప్రకటించడంతో.. సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయంపై సందిగ్ధత నెలకొంది.. రేపటిలోగా అయినా సమస్యలు పరిష్కారం అవుతాయా..? రేపైన సినిమా విడుదలకు నోచుకుంటుందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి..!

ఇంత పెద్ద సమస్యను ముందు పెట్టుకుని 14 రీల్స్ ప్లస్ సంస్థ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవరించిందనేది ఇపుడు ఎవరికీ అంతుబట్టడం లేదు..
పేరున్న నిర్మాతలు.. గతంలో భారీ చిత్రాలు నిర్మించిన సంస్థ ఇలా చేతులెత్తేయడం.. నిర్లక్ష్యంగా వ్యవహరించడం సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు సాధారణ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది..!
ఈ మధ్య కాలంలో ఇంత హైప్ వచ్చిన సినిమా ఏదీ లేదని.. విడుదలలో జాప్యం కావడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందనే ఆందోళన ఎగ్జిబిటర్లలో వ్యక్తం అవుతోంది..! శుక్రవారం పోయింది.. శని ఆదివారాలు వీకెండ్ బిజినెస్ కోల్పోతే పెద్ద దెబ్బ పడుతుందనే ఆందోళనలో థియేటర్ల యాజమాన్యాలు ఉన్నాయి...
బాలకృష్ణకు సంబంధించి మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ ఇలా సకాలంలో విడుదలకు నోచుకొని పక్షంలో ఇతర రాష్ట్రాల్లో నెగెటివ్ ఇంప్రెషన్ పడిపోతుందని.. భవిష్యత్తులో బాలకృష్ణ సినిమాలకు ప్రతిబంధకంగా మారుతుందని ఆందోళన అభిమానుల్లో వ్యక్తం అవుతోంది..!

అసలు వివాదం ఇదే..!
అఖండ 2' విడుదలపై తమిళనాడులో మద్రాస్ హై కోర్టు స్టే ఇచ్చిందని 'మనీ కంట్రోల్' వెబ్ సైట్ పేర్కొంది. చెన్నై వర్గాలు సైతం ఆ స్టే నిజమేనని పేర్కొన్నాయి. డిసెంబర్ 4న పెయిడ్ ప్రీమియర్ షోలతో 'అఖండ 2' విడుదలకు రెడీ అయిన నిర్మాతలకు డిసెంబర్ 3వ తేదీ రాత్రి ఈ తీర్పు రావడం నిర్మాతలను ఆందోళనలో పడేసింది..!
అఖండ 2'ను 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించలేదు. 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. అయితే... 14 రీల్స్‌లో రామ్ ఆచంట, గోపి ఆచంట సైతం భాగస్వామ్యులు. 14 రీల్స్ నుంచి వచ్చి 14 రీల్స్ ప్లస్ స్టార్ట్ చేసి 'అఖండ 2' చేశారని, అందువల్ల వాళ్ళు తమకు డబ్బులు ఇవ్వాలని పేర్కొంది. పిటిషనర్ల వాదనతో కోర్టు ఏకీభవించింది..! దీంతో విడుదలపై స్టే ఆదేశాలు వచ్చాయి..

మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే', 'ఆగడు' సినిమాలకు 14 రీల్స్, ఎరోస్ సంస్థలు కలిసి పని చేశాయి. ఆ సినిమాల సమయంలో జరిగిన ఒప్పందాలు - అప్పుడు వచ్చిన నష్టాలను ఇప్పుడు భర్తీ చేయాలని ఎరోస్ కోర్టుకు వెళ్ళింది.
సరిగ్గా అఖండ 2 విడుదలకు ముందు ఎరోస్ సంస్థ కోర్టుకు వెళ్ళడమే అఖండ సినిమాకు పెద్ద శాపంగా మారింది..
దశాబ్దం క్రితం ఆర్థిక లావాదేవీలపై ఇప్పుడు వాళ్ళు కోర్టు మెట్లెక్కి సినిమా విడుదలను అడ్డుకున్నారు..

•••••••









Comments