top of page

కోర్టు ఆదేశించినా భూమిలోకి రానివ్వని అన్నదమ్ములు..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • Feb 25
  • 2 min read

వారసత్వ భూమిపై ఆధిపత్యం..!

సోదరులకు వాటా ఇవ్వని అన్న..!

మూడు దశాబ్దాలుగా వివాదం..!

వారసులందరికీ హక్కు ఉంటుందని కోర్టు తీర్పు..!

కోర్టు తీర్పుతో స్థలంలో కి వెళ్ళిన సోదరుల కుటుంబాలు..!

రెండు వర్గాల మధ్య గొడవ..!

అత్తాపూర్ లో సంచలనం..!

•••••••••

దశాబ్దాలుగా అన్నదమ్ముల మధ్య భూవివాదం కొత్త వివాదానికి దారి తీసింది..!


ఖరీదైన ప్రాంతంలో భూమి ఉండడంతో కోర్టు విచారణను కాదని బౌన్సర్లు ప్రైవేట్ సైన్యాన్ని మోహరించి గొడవలు పడుతున్నారు...


తాజాగా చోటుచేసుకున్న వివాదం పోలీస్ స్టేషన్ కు చేరింది.. తప్పు మీదంటే మీదంటూ అన్నదమ్ముల కుమారులు రెండువైపుల కుటుంబ సభ్యులు గొడవకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో పోలీసులకు ఇరువర్గాలను కట్టడిచేసి ఫిర్యాదులు తీసుకుని కేసు నమోదు చేశారు..


కాంగ్రెస్ నాయకుడు కాంతారెడ్డి.. అతని ముగ్గురు సోదరులు మనోహర్ రెడ్డి, రామ్ రెడ్డి, కృష్ణారెడ్డిలకు కలిపి వారసత్వంగా వచ్చిన భూమి ఉంది.. అత్తాపూర్ లోని సర్వే నెంబర్ 401 - 402 లో మొత్తం ఆరున్నర ఎకరాల భూమి ఉంది..



నగర విస్తరణ.. అత్తాపూర్ లో భూముల రెట్లు అమాంతం పెరిగిపోవడంతో ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఈ భూమిలో వాటాల సమస్య వచ్చింది.. రాజకీయంగా పరపతి ఉన్న కాంతారెడ్డి మొత్తం భూమిని తన అధీనంలోనే గత నలభై ఏళ్ళుగా ఉంచుకున్నారు..! సోదరులకు పంచి ఇవ్వడానికి ఆయన అంగీకరించలేదు.. దీంతో ముప్పై ఏళ్ల క్రితం సోదరులు భూమిపై తమ హక్కు కోసం కోర్టుకు వెళ్లారు. అప్పటినుండి వివాదం కోర్టు విచారణలో కొనసాగింది..! ఈ లోగా కాంతారెడ్డి, సోదరుడు మనోహర్ రెడ్డి కూడా చనిపోయారు..!


ప్రస్తుతం భూమి మొత్తం కాంతారెడ్డి కుమారులు రవీందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల అధీనంలోనే ఉంది.!



సుదీర్ఘ విచారణ తర్వాత ఉమ్మడి ఆస్తిగా ఉన్న భూమిని భాగాలుగా చేసి వారసులందరూ సమంగా పంచుకోవాలని ఆదేశిస్తూ ఈ మధ్య కోర్టు తీర్పు వెలువరించింది..!


కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రావడంతో కాంతారెడ్డి ముగ్గురు సోదరులకు చెందిన కుటుంబ సభ్యులు తాజాగా ఒక యభైమందికి పైగా ప్రైవేట్ వ్యక్తులతో కలిసి కాంతారెడ్డి కుటుంబ సభ్యుల అధీనంలో ఉన్న భూమిలోకి ప్రవేశించి ఆరున్నర ఎకరాలలో తమకు హక్కుగా రావాల్సిన స్థలాన్ని అక్రమించుకోవడనికి ప్రయత్నించారు.. ప్రైవేట్ వ్యక్తులతో పాటు జేసిబీలను కూడా వెంట తెచ్చి రేకులను తొలగించే ప్రయత్నం చేశారు


అయితే కోర్టు నుండి ఆదేశాలు రాకముందే ఎలా భూమిలోకి వచ్చి దౌర్జన్యం చేస్తారంటూ కాంతారెడ్డి కుమారులు రవీందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లు వారితో గొడవకు దిగారు..!


దీంతో గొడవ పెద్దదైంది.. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను శాంతింప చేశారు..!



ప్రైవేట్ సైన్యాన్ని వేసుకుని వచ్చి భూమిలోకి చొరబడి గొడవ చేయడానికి ప్రయత్నించిన విక్రమ్ రెడ్డి రాజేందర్ రెడ్డి ఇతర కుటుంబ సభ్యులు.. వారితో వచ్చిన ప్రైవేట్ వ్యక్తులపై పోలీసుకు ట్రెస్ పాస్ కేసు నమోదు చేశారు..!


కోర్టు తీర్పు వచ్చాకే మేము మాకు చెందిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి వెళ్లామని.. నలభై ఏళ్ళుగా భూమిని ప్రైవేట్ వ్యక్తులకు.. సంస్థలకు అద్దెకు ఇచ్చి కోట్లాది రూపాయలు లబ్ధి పొందుతూ తమకు అన్యాయం చేయడమే కాకుండా.. ఇప్పడు కోర్టు తీర్పును అతిక్రమించి దౌర్జన్యం చేస్తున్నారని.. తమపై ట్రెస్పాస్ కేసు పెట్టే హక్కు వారికి లేదని.. మాభూమిని మేము స్వాధీనం చేసుకుని తీరుతామని.. పెదనాన్న ఎంత అన్యాయం చేశాడో.. ఆయన కుమారులు అంతకంటే అన్యాయంగా వ్యవహరిస్తున్నారని విక్రమ్ రెడ్డి, రాజేందర్ రెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు..


ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా వాతావరణం ఉందని..ఇరువర్గాల వ్యూహ ప్రతివ్యూహాలతో ఎప్పుడు ఏంజరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోందని.. అన్నదమ్ముల కుటుంబాల మధ్య వివాదం వల్ల ఇలా వందలమంది వచ్చి హల్ చల్ చేయడం.. భయానక వాతావరణాన్ని సృష్టించడంపై స్థానికులు మండిపడుతున్నారు..!


••••••

A Report By

ShyamaSundar Akula

9010746999

7382281818

••••••

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page