top of page

అమ్మాయిని ట్రాప్ చేశాడు.. ఆమె ఫ్రెండ్స్ కూ వల విసిరాడు!

  • Writer: Writer Desk
    Writer Desk
  • 17 minutes ago
  • 2 min read

Rega Kantha Rao - BRS


  • మాజీ ఎమ్మెల్యే 'కాంతా'రావు మహా నాటు వేషాలు..!

  • యూట్యూబ్ ఛానెల్ పెట్టిస్తానంటూ యువతికి వల..!

  • ఏకాంతంగా ఉన్న వీడియోలు ఫోటోలు రహస్యంగా తీసి బెదిరింపులు..!

  • ఆమె ఫ్రెండ్స్ కు వలవేసే ప్రయత్నం..!

  • బాధితురాలి ఫ్రెండ్ మహిళతో ఫ్రెండ్ షిప్..!



ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగ కంతారావుపై హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు..!


తనను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని వంచించి సహజీవనం చేశాడని ఓ యువతి కాంతారావుపై ఫిర్యాదు చేసింది..!


బాధిత యువతి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే..!

°°°°°°°°°

యువతి ఫిర్యాదు ప్రకారం..!


2022 లో హైదరాబాద్ కు వచ్చిన యువతి స్నేహితుల సహకారంతో ఓ మీడియా సంస్థలో ఉద్యోగం చేరింది! ఈ క్రమంలో స్నేహితుల రిఫరెన్స్ ద్వారా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రేగ కాంతారావు ను కలిసింది! తొలి పరిచయంలోనే అమ్మాయిపై కన్నేసిన కాంతారావు... ఒక మంచి యూట్యూబ్ ఛానెల్ పెడదామని.. ఆ ఛానెల్ నిర్వహణ చూసుకునే బాధ్యత నీకే ఇస్తానని నమ్మబలికాడు! తర్వాత యువతితో ప్రేమించానని పెళ్లిచేసుకుంటానని చెప్పాడు! అయితే 45 ఏళ్లు ఉన్న వ్యక్తి.. అప్పటికే పెళ్లైన వ్యక్తి తనని ఎలా పెళ్లి చేసుకుంటాడని సంశయించిన యువతి అదే విషయాన్ని అడిగింది! అయితే తన భార్యతో విబేధాలు వివాదాల వల్ల దూరంగా ఉంటున్నామని కాంతారావు నమ్మబలికాడు! కాంతారావు మాటలు నమ్మశక్యంగా కనిపించడంతో ఆమె సాన్నిహిత్యం పెంచుకుంది..! అమీర్ పేట్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్న యువతి కాంతారావు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఓ సినిమా నటుడికి చెందిన ఫ్లాట్ లో వీరు ఏకాంతంగా కలిసేవారు!


కొన్నాళ్ల తర్వాత యువతి పెళ్లి విషయంలో ఒత్తిడి చేయడంతో కాంతారావు తన అసలు నైజం చూపించడం మొదలు పెట్టాడు! ఇప్పటికిప్పుడు కుదరదని దాటవేస్తూ వచ్చాడు..! అతని వైఖరిని అనుమానించిన యువతి అతన్ని దూరం పెట్టడం చేసింది. దీంతో కాంతారావు ఆమెను బెదిరించడం బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు! తాను పిలిచినప్పుడు రాకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడమే కాకుండా.. తాము ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా తీసిన వీడియోలు.. ఫోటోలు బయటపెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు.! గతేడాది జూన్ వరకు ఇలాగే వీరి వ్యవహారం కొనసాగింది..!


అదే సమయంలో కాంతారావు యువతి వద్ద నుండి రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లో భారీ లాభాలు వస్తాయని నమ్మించి నాలుగు లక్షలు తీసుకున్నాడు! ఈ డబ్బుల విషయంలో కూడా ఇద్దరిమధ్య విబేధాలు మొదలయ్యాయి! యువతితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా ఆమె ఫోన్ లో ఉన్న ఆమె ఫ్రెండ్స్ నంబర్లను తీసుకున్న కాంతారావు.. అందులో ఓ మహిళతో ఎక్కువగా మాట్లాడుతూ ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు! అంతే కాదు..మరో ఇద్దరితో కూడా మాట్లాడేందుకు ప్రయత్నించాడు!



ఒక వైపు ఏకాంతంగా ఉన్న ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం.. మరోవైపు తన ఫోన్ నుండి తన ఫ్రెండ్స్ నంబర్లను తీసుకుని వారిని కూడా తనను చేసినట్లే ట్రాప్ చేసేందుకు యత్నించడం.. ఇంకోవైపు డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం చేస్తున్న కాంతారావుపై యువతి ముందుగా షీ-టీమ్స్ పోలీసులకు ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేసింది!


ఇదిలా ఉండగా అనారోగ్యానికి గురైన యువతి ఆర్థిక ఇబ్బందులు కూడా మొదలయ్యాయి.! ఈ నేపథ్యంలో యువతి తన దగ్గరి బంధువైన ఓ మహిళకు జరిగింది వివరించింది.. కాంతారావు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పడంతో.. ఆమె తనకు తెలిసిన స్నేహితుల ద్వారా కాంతారావు సోషల్ మీడియా నిర్వాహకుడు గుంతక ప్రవీణ్ ను సంప్రదించింది.. జరిగింది మొత్తం వివరించి కాంతారావు యువతికి ఇవ్వాల్సిన నాలుగు లక్షలు వెంటనే ఇచ్చేయాలని కోరింది..! అయితే మొదట తాను కాంతారావును కలిసేందుకు మీటింగ్ ఏర్పాటు చేస్తానని డబ్బులు అతన్ని మీరే అడగండి అంటూ మహిళకు చెప్పిన ప్రవీణ్ .. తర్వాత మాట మార్చాడు..! కాంతారావు తో కల్పించడం కుదరదని.. అయితే కాంతారావు స్నేహితుడైన బడా కాంట్రాక్టర్ నూకరపు రమేష్ మీకు డబ్బులు పంపిస్తాడని.. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలని అడిగాడు.! ప్రవీణ్ చెప్పినట్లుగానే నూకారపు రమేష్ రూ.5లక్షలు బాధిత యువతి బ్యాంక్ అకౌంట్ కి పంపించాడు..!


కాంతారావు పై ఫిర్యాదు రావడంతో అతన్ని షీ టీమ్స్ పోలీసులు సంప్రదించగా.. యువతి డబ్బులకోసం బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.. కాంట్రాక్టర్ రమేష్ ద్వారా యువతికి పంపించిన డబ్బులకు సంబంధించి బ్యాంకు అకౌంట్ స్టేట్మెంట్ పోలీసులకు పంపించాడు..!


అయితే అన్ని విధాల తనను వాడుకుని మోసం చేయడమే కాకుండా పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్న కాంతారావుకి తగిన బుద్ధి చెప్పాలని భావించిన బాధిత యువతి తాజాగా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది..!


కేసు నమోదు చేసిన పోలీసుకు దర్యాప్తు చేస్తున్నారు.!

...........

A Report by

ShyamaSundar Akula

9010746999

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page