top of page

అల్వాల్ టెలికాం కాలనీలో విషాదం..! కరెంట్ షాక్ తగిలి తండ్రి కూతురు మృతి..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • 12 minutes ago
  • 1 min read

విధీ రాత వక్రించినపుడు ప్రకృతి చర్య కూడా మృత్యువు రూపంలో కబళిస్తుంది..!


అప్పటిదాక ఇంట్లో సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటున్న కుటుంబసభ్యులు..!


అంతలోనే అంతులేని విషాదాన్ని నింపేసింది..!


తనతో పాటు ఉన్న భర్త... బిడ్డ కళ్ళముందే క్షణాల్లోనే కన్నుమూసిన వైనం చూసి ఆ మహిళ తీవ్రంగా చలించిపోయింది.. ప్రమాదం భారిన పడిన వారిద్దరినీ కాపాడే క్రమంలో ఆమె కూడా తీవ్ర గాయాలపాలైంది..!


ఇపుడు ఆమె హాస్పిటల్ లో... భర్త బిడ్డ తిరిగిరాని లోకాలకు..!


పది నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది..!


నిన్న రాత్రి వర్షం కురిసింది.. గాలి దుమారం వల్ల ఇంటిపక్కన ఉన్న చెట్టుకూలింది..! అది పార్క్ చేసి ఉన్న వారి కారుపై పడింది.. ఈ క్రమంలో చెట్టుకొమ్మలు తొలగించి కారు అక్కడినుండి పక్కకి తీయాలని తండ్రి బిడ్డలు భావించారు.. అయితే చెట్లు కూలడంతో వాటికి అనుసంధానం చేసి ఉన్న విద్యుత్ కేబుల్ వైర్లు కూడా తెంచుకుని పడ్డాయి.. అప్పటికే చెట్టుకొమ్మలు తడిసి ఉండడం.. బైర్లు తెగి పడినప్పటికీ.. విద్యుత్ సరఫరా కొనసాగుతున్న పరిస్థితిలో చెట్టుకొమ్మలు పట్టుకోగానే విద్యుదాఘాతానికి గురయ్యారు.. తండ్రి బిడ్డ మృత్యువాత పడ్డారు..!



హైదరాబాద్ : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలికాం కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై చుట్టుకొమ్మలు విరిగి పడటంతో వాటిని తొలగించే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి తండ్రి సందీప్ (45) కూతురు రితిక (16) మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కారుపై పడిన చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా వాటికి సమీపంలోని విద్యుత్ తీగలు తగిలి ఉండటంతో ఒక్కసారిగా కరెంట్ ప్రవహించి రితిక విద్యుత్ షాక్ కు గురికాగా ఆమెను రక్షించే క్రమంలో తండ్రి సందీప్ కు కూడా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో సహాయం చేసేందుకు వెళ్లిన సందీప్ భార్య శ్వేత (40) కూడా విద్యుత్ షాక్ తగలడంతో తీవ్రంగా గాయపడింది.ఆమెను కుటుంబ సభ్యులు స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు..!



•••••••••••

A Report By

Praveen Uppal

94418 18191

•••••••••••

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page