
కొంపముంచిన పుత్రరత్నం..!
- Writer Desk

- May 10
- 5 min read
శత్రువులు ఎక్కడో ఉండరు..! మన ఇళ్లలోనే కొడుకులు కూతుళ్ళ రూపంలో మనపక్కనే ఉంటారు..!
ఒక సినిమాలో చెప్పిన సమేత ఇపుడు బండి సంజయ్ విషయంలో నిజమని రుజువు అవుతోంది..!
ఎంతో రాజకీయ భవిష్యత్తును ఊహించుకుని కష్టపడి ఎదుగుతున్న సంజయ్ కు కుమారుడి నిర్వాకాలు కోలుకోలేని దెబ్బకొట్టాయి..! సంజయ్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపేలా కుమారుడి వేషాలు ఉన్నాయి..!
ఏ విషయంలో అయినా ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడిన బండికి.. కుమారుడి రూపంలో బుల్లెట్ దిగబడింది..!
వ్యసనాలకు బానిసైన బండి కుమారుడు భగీరథ్ గత మూడు నాలుగేళ్లుగా బండికి ఇబ్బంది కర పరిస్థితులు తెచ్చిపెడుతున్నాడు..! రాజకీయ పలుకుబడితో కేసులలో ఇరుక్కోకుండా మ్యానేజ్ చేసిన బండి.. కుమారుడిని కట్టడి చేయడంలో నిర్లక్షం చూపడం వల్ల తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది..!
ఈసారి ఏకంగా ఓ బాలికను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ఆరేడు నెలలు అన్నివిధాలుగా వాడుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ చివరికి పోక్సో కేసులో ఇరుక్కున్నాడు బండి తనయుడు..! ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా బండి సంజయ్ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించలేదు..! గతంలో జర్నలిస్టుగా ఉండి తర్వాత రాజకీయాల్లో చేరిన సంగప్ప అనే వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టి బాధిత కుటుంబంతో రాజీ ప్రయత్నాలు చేసినప్పటికీ..సంగప్ప చేసిన అతి వల్ల ఆ ప్రయత్నం వికటించినట్లు తెలుస్తోంది..! ఇరువైపుల సామరస్య పూర్వకంగా వ్యవహరించి సమస్యను పరిష్కారం చేయకుండా సంగప్ప బాధిత కుటుంబాన్ని బెదిరించే ప్రయత్నం చేయడం వల్ల మొత్తంగా అది బండి మెడకు చుట్టుకున్నట్టు కనిపిస్తోంది..! తమ మాట వినకపోవడంతో బండి సంజయ్ తన కుమారుడి చేత కరీంనగర్ లో బాలిక.. ఆమె తల్లిదండ్రులపై ఫిర్యాదు చేయించడం.. బాధిత కుటుంబం తాము నివసించే పరిధిలో ఉన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం.. అన్నీ గత శుక్రవారం ఒకేరోజు చకచకా జరిగి పోయాయి..!

రాజకీయ పలుకుబడితో బండి ఎంత ఒత్తిడి చేయించినప్పటికీ...ఆయన కుమారుడి ఉన్మాద చర్యలపై పూర్తి ఆధారాలు బాధిత కుటుంబం పోలీసులకు ఇవ్వడంతో.. బండి బగీరథ్ పై కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి పోలీసులకు ఎదురైంది..! బండి కుమారుడిపై పోక్సో కేసు నమోదు చేశారనే విషయం బయటకు పొక్కగానే.. బండి సంజయ్ తప్పు మీద తప్పు చేశారు.. తన కుమారుడిని హానీ ట్రాప్ చేయించి తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని.. లేదంటే.. ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా మీడియాకు సమాచారం పంపించారు. అంతే కాదు ఈ వ్యవహారంలో వారికి యాబై వేలు కూడా ఇచ్చామని కూడా తెలిపారు..
బాధిత బాలికతో తనయుడి సంబంధాలు రుజువు చేసేలా బండి స్వయంగా సమాచారం ఇవ్వడంతో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది..! బండి సంజయ్ కేంద్ర మంత్రి కావడం.. మరోవైపు హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన..వెరసి జాతీయ మీడియా ఈ వ్యవహారాన్ని ప్రధానంగా ఫోకస్ చేసింది..! మోదీ పర్యటన వేళ బండి ఇలాంటి ఇబ్బందుల్లో కోరుకోవడం కూడా దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది..!
అయితే బండి చెప్పినట్లు నిజంగానే ఆయన కుమారుడిపై హనీ ట్రాప్ జరిగిందా.. లేక కేసును తప్పుదోవ పట్టిస్తున్నారా..? అనే విషయంపై న్యూ - సెన్స్ చేసిన శోధనలో అనేక విస్తుపోయే విషయాలు తెలిసాయి..! బగీరథ్ ఊహించినదానికంటే ఉన్మాదంగా ప్రవర్తించి బాలికను ఆమె తల్లిదండ్రులను వేధింపులకు భయబ్రాంతులకు గురిచేసినట్లు స్పష్టమైంది..!
°°°°°°°°°
పోలీస్ స్టేషన్ లో బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఇవి..! బాలిక చెప్పిన విషయాల ఆధారంగా గతేడాది జూన్ నుండి ఏం జరిగింది అనేది ఆమె తల్లి ఫిర్యాదులో వివరంగా పేర్కొన్నారు..!
విషయం: నా మైనర్ కుమార్తెపై జరిగిన లైంగిక దోపిడీ, దుర్వినియోగం, బెదిరింపులు, డిజిటల్ వేధింపులు మరియు నేరపూరిత కుట్రకు సంబంధించి, పిల్లలపై లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం, 2012 మరియు బీ ఎన్ ఎస్ ప్రకారం ఫిర్యాదు గురించి..!
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి బగీరథ్.. అతని స్నేహితులతో కలిసి మా కుమార్తెను ట్రాప్ చేశాడు..మానసిక శారీరక వేధింపులకు బగీరథ్ పాల్పడ్డాడు..! పక్కా ప్లాన్ తోనే బగీరథ్ మా కుమార్తెతో పరిచయం పెంచుకుని.. ఇంస్టాగ్రామ్..స్నాప్ చాట్ ద్వారా మానసికంగా పూర్తిగా ఎదగని మా కూతురిని మాయమాటలతో ట్రాప్ చేశాడు..! ఈ క్రమంలో అతని స్నేహితులు బగీరథ్ కు పూర్తిగా సహకరించారు..!
గతేడాది జూన్ లో మొదటి సారి అమ్మాయితో వ్యక్తిగత పరిచయం చేసుకుని..తర్వాత ఇన్‌స్టాగ్రామ్ మరియు స్నాప్‌చాట్‌తో సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అమ్మాయితో క్లోజ్ అయ్యేందుకు ప్రయత్నించాడు..!
బగీరథ్ మా కుమార్తెను పెళ్లి పేరుతో నమ్మించి వశపరుచుకున్నాడు..! వయసురీత్యా మేజర్ అవగానే నిన్ను పెళ్ళిచేసుకుంటానని మోసపూరిత హామీలతో మభ్యపెట్టి.., ఆమె భావోద్వేగ బలహీనతను ఆసరాగా చేసుకుని.. ఉద్దేశపూర్వకంగా సంబంధంలోకి లాగాడు..! అంతేకాకుండా ఆమె చదువుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుపడ్డాడు..! తాను పెళ్లి చేసుకుంటాను కాబట్టి.. భవిష్యత్తుకు సంబంధించి ఏం చేయాలో ఏం చదవాలో తానే నిర్ణయిస్తానని.. తాను చెప్పినట్లు వినకపోతే చచ్చిపోతా అంటూ బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయి భవిష్యత్తుపై దెబ్బకొట్టాలని చూశాడు..! స్నేహితులు ఇతరులతో మాట్లాడకుండా పూర్తిగా తన అధీనంలో ఉంచుకుని స్వేచ్ఛ లేకుండా చేశాడు..!
బండి బగీరథ్ ఒక మానసిక ఉన్మాదిలా తన కూతురును వేధించడమే కాకుండా... తప్పు చేయడం..తాను తప్పు చేశానని అందుకు తీవ్రంగా బాధపడుతున్నానంటూ.. ఏడుస్తూ అమ్మాయితో మాట్లాడటం.. స్ప్లిట్ పర్సనాలిటీ మాదిరిగా బగీరథ్ ప్రవర్తించాడు..! అమ్మాయిపై పదే పదే దాడికి పాల్పడటం.. శారీరకంగా గాయపరచడం.. ఉన్మాదం చూపడం..అవెంటనే..మళ్ళీ అమ్మాయి ఎక్కడ ఎదురు తిరుగుతుందో అనే భయంతో తప్పు చేశానని.. తనను క్షమించాలని..ఇంకోసారి అలా చేయను అంటూ వింత వింతగా ప్రవర్తించేవాడు..! ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్స్ రికార్డులు చాటింగ్ వివరాలు ఆధారాలుగా సమర్పిస్తున్నాం..! మా కుమార్తెకు కలిగిన శారీరక మరియు మానసిక క్షోభ అందులో స్పష్టంగా కనిపిస్తోంది..! నా కుమార్తె ను సర్వీస్ అపార్ట్‌మెంట్‌లకు రావాలని అతను పట్టుబట్టిన సందర్భాలు, మరియు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెపై ఒత్తిడి తెచ్చిన ఉదంతాలు కూడా ఆధారాల్లో ఉన్నాయి.
గతేడాది అక్టోబర్.. నవంబర్ నెలల మధ్య పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మా సొంత అపార్ట్‌మెంట్ కు వచ్చిన బగీరథ్ అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి మరియు అనుచితంగా తాకడానికి ప్రయత్నించాడని..ఈ విషయం మా కుమార్తె చెప్పింది..! ఆ తర్వాత 2025 అక్టోబర్ 25వ తేదీన అర్ధరాత్రి, అతను తన ఇద్దరు స్నేహితులు కార్తికేయ మరియు మోక్షలతో కలిసి నానక్‌రామ్‌గూడలో ఉన్న గోల్ఫ్ వ్యూ అపార్ట్‌మెంట్స్‌కు నా కుమార్తెను తీసుకువెళ్ళాడు! అక్కడ బండి బాగీరథ్ నా కుమార్తెను రెండు మూడు రోజులు ఉండమని బలవంతంచేసి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు! నా కూతురు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ బలప్రయోగం చేసి సహకరించాలని.. అవసరాలు తీర్చమని అడిగి...రాత్రికి అక్కడే ఉండమని బలవంతం చేశాడు! 13 నవంబర్ 2025 రోజున మోయినాబాద్‌లోని లక్స్ చరణ్ ఫార్మ్ స్టేలో కూడా మా కుమార్తెకు ఇదే అనుభవం ఎదురైంది..!
గతేడాది డిసెంబర్ లో నా కుమార్తెను తనకు చెందిన నివాసాలకు..ఫామ్‌హౌస్‌లకు తీసుకువెళ్లాడు..! అలాగే కొన్ని ప్రైవేట్ ప్రదేశాలకు తీసుకు వెళ్లాడు..! న్యూ ఇయర్ వేడుకల పేరు చెప్పి 2025 డిసెంబర్ 31న మొయినాబాద్ లోని అనన్య ఫామ్స్ కు తీసుకువెళ్లాడు.. మరుసటి రోజు అర్ధరాత్రి వరకు అక్కడే ఉంచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు! 31 డిసెంబర్ 2025 రాత్రి నుండి 1 జనవరి 2026 తెల్లవారుజాము వరకు మా కుమార్తె బగీరథ్ మరియు అతని స్నేహితులతో కలిసి ఉంది. గౌరవ్, విశాల్, స్నేహ మరియు శ్రేయ.. సుమారు ఐదుగురు అబ్బాయిలు మరియు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మా కుమార్తె ప్రతిఘటించినప్పటికీ అందరూ కలిసి.. ఆమెపై మద్యం (బ్రీజర్) సేవించమని ఒత్తిడి చేశారు. ఆ తర్వాత..బగీరథ్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు..!
ఈ సంఘటనతో మా కుమార్తె తీవ్ర భయకంపితురాలైంది... బగీరథ్ ఉన్మాద ప్రవర్తన చూసి తీవ్రమైన మనో వేదనకు గురైంది..! పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇతరులపై ఆధారపడే స్థితికి వెళ్ళింది..!
ఈ ఫిర్యాదుతో పాటు నేను చాట్ హిస్టరీ స్క్రీన్‌షాట్‌లను సమర్పిస్తున్నాను.
మొయినాబాద్ ఘటన తర్వాత జనవరి 7 వ తేదీ రోజున భగీరథ అకస్మాత్తుగా ఫోన్ చేసి తాను కుమార్తెతో ఉన్న సంబంధాలను తెంచుకుంటున్నానని.. జరిగినవన్నీ మెరిచిపోవాలని చెప్పాడు..! తన వ్యవహారాలకు ఉన్మాద చర్యలకు బాధ్యత వహించడానికి నిరాకరించాడు. ఆ తర్వాత, 13 జనవరిన.. బండి బగీరథ్ తీవ్ర భయాందోళనతో నాకు మెసేజ్ చేశాడు.. ఆ తర్వాత కాల్ చేసి మా కుమార్తె పరిస్థితి బాలేదని.. తను మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతోందని.. ఎలాగైనా ఆమెకు సర్దిచెప్పాలని ప్రాధేయ పడ్డాడు..! మానసిక ఉన్మాదిలా మారి ప్రేమ పెళ్లి పేరుతో మా కుమార్తెను మభ్యపెట్టి వశపరుచున్న బగీరథ్..ఆమె జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా..పచ్చి మోసం చేయడానికి.. వదిలించుకోవడానికి కుట్రలు మొదలు పెట్టాడు..!
బగీరథ్ తనను వాడుకుని.. శారీరకంగా మానసికంగా వేధించి..చివరికి బ్రేక్ అప్ చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో.. పూర్తిగా మానసికంగా కుంగిపోయి క్షోభకు గురైన మా కుమార్తె..! అదే డిప్రెషన్ లో 19 జనవరి రోజు.. తర్వాత 26 జనవరి రోజు ఆత్మహత్యాయత్నం చేసింది..! మేము సకాలంలో అడ్డుకోవడం వల్ల మా కుమార్తె మాకు దక్కింది..!
అయితే చేసిన మోసంపై మా కుమార్తె బగీరథ్ నిలదీసే సరికి అతను నీచమైన చర్యలకు ఒడిగట్టినట్లు తెలిసింది..! మా కుమార్తె యొక్క వ్యక్తిగత మరియు గోప్యమైన సమాచారం..ఫోటోలను సోషల్ మీడియాలో చట్ట విరుద్ధంగా అప్ లోడ్ చేసి..అమ్మాయి పరువును బజారున పెట్టే ప్రయత్నం చేసినట్లు తెలిసింది..!
మేము గత మార్చి నెలలో మాకు జరిగిన అన్యాయంపై న్యాయపరంగా వెళ్ళడానికి ప్రయత్నించాం..విషయం తెలిసి మాపై ఒత్తిడి చేయించే ప్రయత్నం చేసింది బండి కుటుంబం..! పదే పదే ఫోన్ కాల్స్ చేస్తూ ఒత్తిడి చేసారు..! ఏప్రిల్ 21న..మా కుమార్తెకు తెలిసిన వ్యక్తి.. బగీరథ్ కు కూడా పరిచయం ఉన్న శ్రీరామ్ అనే వ్యక్తి చేత నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో ఒక తప్పుడు మరియు దురుద్దేశపూర్వక ఫిర్యాదును దాఖలు చేయించింది బండి కుటుంబం..! సదరు వ్యక్తిని నా కుమార్తె బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోందని సదరు ఫిర్యాదులో తప్పుడు ఆరోపణలు చేశారు..!

అయితే మేము వారి బెదిరింపులకు తప్పుడు ఫిర్యాదులకు లొంగకలోవడం.. న్యాయపరంగా అన్యాయాన్ని ఎదురించాలని ముందుకు వెళ్లడంతో రాజీ యత్నాలు చేశారు బండి సంజయ్.. ఆయన తనయుడు..! 2026 ఏప్రిల్ 22న, పలుకుబడిగల వ్యక్తులతో సంబంధాలున్నాయని చెప్పుకుంటున్న సంగప్ప అనే వ్యక్తి మా నివాసానికి వచ్చి, 2026 ఏప్రిల్ 23న బండి సంజయ్ కుమార్‌తో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయించాడు. అయితే జరిగిన అన్యాయంపై మాట్లాడకుండా సంగప్ప మమ్మల్ని రాజీపడమని.. లేదంటే నిర్మల్ కేసు ఆధారంగా మీరు జైలుకు వెళ్లాల్సి వస్తుందని బెదిరింపులకు దిగాడు.. సంగప్ప బెదిరింపులు ఒత్తిడి సరికాదని భావించి తాము వెనక్కి వచ్చామని.. చర్చల పేరుతో తమను బండి సంజయ్.. సంగప్ప తీవ్ర భయాందోళనకు గురిచేశారని.. వారికి ఉన్నత స్థాయిలో రాజకీయ పలుకుబడి ఉంది కాబట్టి కాస్త భయపడినప్పటికీ.. ఇక వెనకడుగు వేయొద్దని గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చేసాం..! న్యాయపోరాటంతో పాటు చట్టపరంగా ముందుకు వెళ్లాలని భావించాము..
అయితే తాము లొంగలేదనే కోపంతో బండి సంజయ్ కరీంనగర్ లో తమ కూతురిపై తమపై లేనిపోని నిందారోపణలు చేస్తూ తన కుమారుడిచేత తప్పుడు ఫిర్యాదు చేయించాడు..!
జరిగిన సంఘటనల క్రమం మొత్తం, చట్ట ప్రకారం మైనర్ సమ్మతికి ప్రాధాన్యత లేని 'లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, 2012' కింద నేరాలను, అలాగే దాడి, నేరపూరిత బెదిరింపు, పరువు నష్టం, మరియు కుట్ర వంటి బీ ఎన్ ఎస్ చట్టాల ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతున్నాయి..
మైనర్‌తో లైంగిక సంబంధం, అది సంబంధం లేదా వివాహ వాగ్దానం ముసుగులో ఉన్నప్పటికీ, తీవ్రమైన మరియు శిక్షార్హమైన నేరమని, మరియు భావోద్వేగపరమైన వేధింపులు, బలవంతం వంటివి అటువంటి చర్యల తీవ్రతను మరింత పెంచుతాయని గౌరవనీయ సుప్రీం కోర్టు స్థిరంగా పేర్కొంటూ వస్తోంది.
పై విషయాలను దృష్టిలో ఉంచుకుని, నా కుమార్తెపై తదనంతరం తప్పుడు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించిన బండి బగీరథ్ మరియు శ్రీరామ్‌లపై తక్షణ చర్యలు ప్రారంభించాలని, మరియు న్యాయం జరిగేలా భవిష్యత్తులో ఎలాంటి ప్రాణహాని కలగకుండా నా కుమార్తెకు, మా కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని మీ అధికార యంత్రాంగానికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
పై వాస్తవాలు నాకు తెలిసినంతవరకు మరియు నేను నమ్మినంతవరకు నిజమని తెలియజేస్తున్నాను, మరియు నా మైనర్ కుమార్తెకు న్యాయం జరిగేలా చూడటానికి తక్షణ న్యాయ జోక్యం చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను.
మొత్తంగా ఇదీ ఫిర్యాదులో ఉన్న సారాంశం అంశాల వారిగా యధాతథంగా చెప్పే ప్రయత్నం..!
పోక్సో కేసు నమోదైంది కాబట్టి బండి బగీరథ్ ను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి..! అయితే అతను అందుబాటులో లేడని.. ఫోన్లు ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళాడని తెలుస్తోంది.. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించలేదు..!
మరోవైపు బండి సంజయ్ కుమారుడిని అరెస్ట్ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో మహిళలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం ఆందోళన నిర్వహించారు.. ప్లకార్డులు బ్యానర్లతో రెండు గంటలపాటు వారు ధర్మానిర్వహించారు..!
చూడాలి ముందు ముందు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో..!
•••••••••••
A Report By
ShyamaSundar Akula
9010746999




Comments