
అరెస్టా... లొంగిపోయాడా..వామ్మో పాలిటిక్స్..!!
- Writer Desk

- 10 hours ago
- 1 min read
బండి భగీరథ్ ఆచూకీ దొరికింది...
తామే సరెండర్ చేశామని స్వయంగా ఆయన తండ్రి బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు...
అయితే పోలీసులు మాత్రం తామే పోలీస్ అకాడమీ వద్ద అరెస్ట్ చేశామని చెబుతున్నారు... సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి స్వయంగా భగీరథ్ అకాడమీ వద్ద అరెస్ట్ చేసినట్లు మీడియాకు తెలిపారు..
దీంతో భగీరథ్ న్యాయవాదులతో కలిసొచ్చి లొంగిపోయాడా.. లేక పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారా అనే విషయంలో సందిగ్ధం నెలకొంది..!
మీడియాపై ఒకవైపు పోలీసు అధికారులనుండి.. మరోవైపు బండి సంజయ్ కార్యాలయం నుండి ఒత్తిడి కొనసాగుతోంది..!
లొంగిపోయాడని స్క్రోలింగ్ వేయాలని.. వార్త కూడా తాము ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇవ్వాలని బండి సంజయ్ ఒత్తిడి చేయిస్తున్నారు.. మరోవైపు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సహా ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు అతన్ని అరెస్ట్ చేశామని వార్త వేయాలని.. స్క్రోలింగ్ కూడా అలానే వేయాలని ఒత్తిడి చేస్తున్నారు...
మొత్తానికి అటు ప్రభుత్వం.. ఇటు బండి సంజయ్ ఆడుతున్న క్రెడిట్ గేమ్ మీడియాకు ఇబ్బందిగా పరిణమిస్తోంది...!
ప్రస్తుతం అతన్ని పేట్ బషీరాబాద్ పీఎస్ కు తీసుకువచ్చి విచారిస్తున్నారు..
మరోవైపు ఈ రాత్రి అతన్ని మేజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తారా.. లేక సమయం ఉంది కాబటి రేపు మధ్యాహ్నం వరకు ఈ ప్రక్రియ వాయిదా వేస్తారా స్పష్టత లేదు..
ప్రస్తుతం సిట్ అధికారులు ఆయనను విచారిస్తున్నారు...

ఇదే రోజు రాత్రి ఆయనను అరెస్ట్ చేయాలంటే.. వైద్య పరీక్షలు చేయించడం.. మేజిస్ట్రేట్ వద్ద హాజరుపరచడం.. తర్వాత రిమాండ్ కు చంచల్ గూడ జైలుకు తరలించడం వంటి ప్రక్రియ చేయాల్సి ఉంటుంది.. అంతే కాదు విచారణ స్టేట్మెంట్ రికార్డు ఆధారంగా రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేయాల్సి ఉంటుంది.. మేజిస్ట్రేట్ ముందు హాజరు సమయంలో రిమాండ్ రిపోర్ట్ అందాచేయాల్సి ఉంటుంది.. కాబట్టి ఇవన్నీ కాస్త సమయం తీసుకుని.. ఎక్కడ ఎలాంటి పొరపాటు లేకుండా ప్రక్రియ కొనసాగించడం కాస్త ఇబ్బందే..!

ఇప్పటికే రాత్రి పది కావొస్తోంది కాబట్టి పోలీసులు ఏంచేయబోతున్నారు అనే విషయంలో కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది..
......
ShyamaSundar Akula
9010746999




Comments