top of page

బ్రిలియంట్ దొంగ అతడేనా..?

  • Writer: Writer Desk
    Writer Desk
  • Oct 11, 2025
  • 1 min read

బ్రిలియంట్ కాలేజీలో చోరీ ప్రభాకర్ పనేనా..!

ఒక సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు..!

దృశ్యాలను బట్టి ప్రాథమిక అంచనా..!

ధృవీకరించని పోలీసులు..!

...

హైదరాబాద్ : బత్తుల ప్రభాకర్... ముప్పుతిప్పలు పెడుతున్న ఘరానా దొంగ..!

అలా దొరికితే ఇలా తప్పించుకుంటాడు..!

కస్టడీలో ఉన్నపుడు కళ్లుగప్పి ఉడాయించడంలో ప్రభాకర్ చూపే తెలివి పోలీసు అధికారులను విస్మయ పరుస్తోంది..!

మొన్నటికి మొన్న గత నెల 23 న ఏపీ రాజమండ్రి జైలు నుండి ప్రభాకర్ ను విజయవాడ కోర్టు కు తరలించిన పోలీసులు కోర్టు లో హాజరుపరిచిన తర్వాత తిరుగు ప్రయాణంలో దేవరపల్లి మండలం దుడ్డుకూరు వద్ద ఒక దాబా లో డిన్నర్ చేయడం కోసం ఆగారు. అంతే.. అక్కడ పోలీసులను బురిడీ కొట్టించిన ప్రభాకర్.. తప్పించుకుని పారిపోయాడు..

ఈ ఘటన తర్వాత మళ్లీ పోలీసులకు ప్రభాకర్ చిక్కలేదు.. ఒకవైపు ఏపీ పోలీసుకు తీవ్రంగా ప్రభాకర్ ఆచూకీ కోసం గాలిస్తుంటే.. ఈ దొంగ మాత్రం తాపీగా తన వృత్తి తాను చేసుకుంటున్నాడు..

అబ్దుల్లాపూర్ మేట్ లో ఉన్న బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ లో లాకర్లు పగులగొట్టి కోటి రూపాయల చోరీ చేసింది ప్రభాకరేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ఒక సీసీ కెమెరా ఫుటేజ్ లో నమోదైన దృశ్యాల ఆధారంగా చోరికి పాల్పడింది ఒక్కడేనని నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ఆ ఒక్కడు ప్రభాకరే అనే నిర్ధారణకు కూడా వచ్చినట్లు తెలిసింది.. అయితే ఇంకా రాచకొండ పోలీసు అధికారులు ధృవీకరించాల్సి ఉంది..!

....

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page