
చంపేసిన సరదా..!
- Writer Desk

- Mar 3
- 2 min read
ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు..! చదువుకోవడానికే టైమ్ సరిపోవట్లేదు..! అయినా సరే బైక్ రైడ్ చేయాలనే బలమైన కోరిక మైండ్ ను డైవర్ట్ చేసింది..! చివరికి ప్రాణాలనే తీసింది..!
ముగ్గురు స్నేహితులు కలిసి సోమవారం పరీక్ష ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లి తర్వాత బైక్ రైడింగ్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు.. అనుకున్నట్లుగా ఒక స్నేహితుడు స్పోర్ట్స్ బైక్ ను అద్దెకు తీసుకుని వచ్చాడు.. ముగ్గురు కలిసి నగర శివార్లలో వాహనాల రద్దీలేని చోటికి వెళ్లారు.. ! అక్కడ బైక్ పై స్టైల్ గా పోజులు ఇస్తూ వీడియోలు తీసుకున్నారు.. ఫోటోలు దిగారు వాటిని రీల్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టుకోవాలనుకున్నారు.. ! తర్వాత ఒక్కొకరు అలా రెండు మూడు కిలోమీటర్లు బైక్ రైడ్ చేయాలనుకున్నారు.. ఒక స్నేహితుడిని అక్కడే నిలబడమని చెప్పి ఇద్దరు స్నేహితులు బైక్ నడుపుకుంటూ వెళ్ళారు.. అదే వారికి విషాద యాత్రలా మారింది... అది స్పోర్ట్స్ బైక్ కావడంతో దాని స్పీడ్ ను అంచనవేయలేకపోయారు.. వేగం వల్ల బైక్ పై పట్టు తప్పింది.. బ్రేకులు వేసి అదుపుచేసేలోగానే రోడ్డు మధ్యల డివైడర్ ను బలంగా ఢీకొట్టింది.. దీంతో ఇద్దరూ బలంగా నేలపై పడ్డారు. ప్రమాదంలో బైక్ నడిపే బాలుడు తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోగా.. మరో బాలుడు కాలు చెయ్యి విరిగిపోయి తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు...

నాగోలు ఇన్స్ పెక్టర్ మక్బూల్ జానీ ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు..!
నాగోలు సమీపంలోని రాజ్యలక్ష్మికాలనీలో నివసించే విష్ణువర్ధన్(16), వనస్థలిపురంలోని ద్వారకానగర్ కు చెందిన ఉషాకిరణ్(16), హయత్ నగర్ నివాసి మణిదీప్(16) కొత్తపేటలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. ముగ్గురికీ వేర్వేరు కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. సోమవారం మ్యాథ్స్ ఎగ్జామ్ రాశాక ముగ్గురూ కలవాలనుకున్నారు. బైక్ రైడింగ్ కు వెళ్లాలనుకున్నారు.. అనుకున్నట్లుగానే ఉషాకిరణ్ తన ఇంటిదగ్గర ఎన్జీవోస్ కాలనీలోని ఒక షాప్ నుండి
కేటీఎం స్పోర్ట్స్ బైక్ ను అద్దెకు తీసుకున్నాడు. హయత్ నగర్ వెళ్ళి మ ణిదీప్ ను పిక్ అప్ చేసుకోగా.. ఇద్దరు కలిసి విష్ణు ఉండే నాగోల్ కి వచ్చారు.. అక్కడినుండి ముగ్గురు ఒకే బైక్ పై బయలుదేరారు. నాగోలు శివారులోని ఫత్తుల్లాగూడ హండ్రెడ్ ఫీట్ రోడ్ కు చేరుకున్న తర్వాత కాసేపు

బైకును హుషారుగా నడిపారు. పలు ప్రదేశాల్లో ఫొటోలు దిగారు. ఒకరి తర్వాత ఒకరు బైక్ రైడింగ్ చేయాలని అనుకున్నారు.. ఒకరు నడుపుతుంటే ఇంకొకరు వెనుక కూర్చోవాలని అనుకున్నారు.. ముందుగా
మణిదీప్ అక్కడే ఆగిపోగా విష్ణువర్ధన్ బైకుపై ఉషాకిరణ్ ను వెనుక కూర్చోబెట్టుకుని
బయల్దేరాడు. స్పీడ్ గా వెళ్ళాలనే సరదాతో విష్ణు బైక్ రేసర్ ను అమాంతం పెంచాడు.. దీంతో కొంత దూరం వెళ్ళిన తర్వాత బైక్ అదుపుతప్పింది.. నియంత్రణ కోల్పోయిన విష్ణు సడన్ గా బ్రేకులు వేశాడు.. అయినప్పటికీ అది అప్పటికే బలంగా రోడ్డు మద్యలో డివైడర్ ను బలంగా ఢీకొట్టింది.. దీంతో ఇద్దరూ అమాంతం ఎగిరి బలంగా నేలపై పడ్డారు..! తలకి బలమైన గాయం కావడంతో విష్ణువర్ధన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఉషాకిరణ్ కు కాలు, చేయి విరిగింది..! స్నేహితులు ఎంతకీ వెనక్కి రాకపోవడంతో మణిదీప్ ఫోన్ చేయగా.. ప్రమాద స్థలంలో ఉన్న ఇతర వాహనదారులు విషయాన్ని మణిదీప్ కు చెప్పారు.. దీంతో అతను అక్కడికి చేరుకుని ఇద్దరి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి. విషయాన్ని చెప్పాడు.. సమాచారం అందుకున్న పోలీసులు ఉషా కిరణ్ ను హాస్పిటల్ కు తరలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..!

మైనర్ కు బైక్ ఎలా అద్దెకు ఇచ్చారు..!?
బైక్ అద్దెకు తీసుకున్న ఉషాకిరణ్ మైనర్ అని తెలిసినప్పటికీ ఎలా బైక్ రెంటల్స్ నిర్వాహకులు అతనికి బైక్ ఇచ్చారు అనే విషయం తెలియాల్సి ఉంది.. నిబంధనల ప్రకారం బైక్ రెంట్ కు ఇవ్వాలంటే కచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ పరిశీలించాల్సి ఉంటుంది.. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవాళ్ళకు మాత్రమే బైక్ ను అద్దెకు ఇవ్వాల్సి ఉంటుంది.. మైనర్లకు బైక్ ఇవ్వకూడదు..! కానీ ఇక్కడ రెంటల్స్ నిర్వాహకులు ఈ రెండు నిబంధనలు తుంగలో తొక్కినట్లు కనిపిస్తోంది..!

ఒకడి తప్పు వల్ల రెండు కుటుంబాల్లో విషాదం!
లక్షల్లో ఫీజులు కట్టి కార్పొరేట్ కాలేజీల్లో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఈ దుర్ఘటనతో తల్లడిల్లిపోతున్నారు.. బిడ్డను కోల్పోయిన దుఃఖంలో విష్ణు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.. ఉషాకిరణ్ కుటుంబ సభ్యులది కూడా ఇదే పరిస్థితి.. పరీక్షలు రాస్తున్న సమయంలో కాలు చెయ్యి విరిగిపోయి తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చేరిన బిడ్డ పరిస్థితి చూసి తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.. నిజానికి బైక్ ను రెంటల్స్ నిర్వాహకుడు నిబంధనలకు విరుద్ధంగా అద్దెకు ఇచ్చి ఉండకపోతే ఈ ఘాతుకం జరిగేది కాదని.. పిల్లలకు బైక్ అద్దెకు ఇచ్చిన రెంటల్స్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. ఒక్కడి తప్పువల్ల ఒక కుటుంబం చెట్టంత ఎదిగిన కొడుకుని కోల్పోగా.. మరో కుటుంబం విషాదంలో మునిగి పోయిందని స్థానికులు ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
••••••••••••
A Report By
ShyamaSundar Akula
9010746999




Comments