
కూతురిని ప్రేమించాడని ఇంటికి పిలిచి నరాలు తెంపి చంపేసింది..!
- Writer Desk

- 21 minutes ago
- 2 min read
పరువు పేరుతో పాశవిక హత్య..!
బీటెక్ స్టూడెంట్ ను హతమార్చిన యువతి తల్లి..!
హైదరాబాద్: ప్రేమించిన పాపానికి యువకుడిని ఇంటికి పిలిపించి అత్యంత దారుణంగా చంపేసింది యువతి తల్లి..!
మానవత్వం లేని మహిళ ఘాతుకానికి బీటెక్ చదువుకున్న యువకుడు బలయ్యాడు..
సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ లక్ష్మీనగర్ లో ఘటన చోటుచేసుకుంది.. యువకుడి స్నేహితులు కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్న శ్రవణ్ సాయి తన స్నేహితురాలైన శ్రీజను ప్రేమిస్తున్నాడు.. పడవ తరగతి నుండే వాళ్ళు ప్రేమించుకున్నట్లు తెలుస్తోంది. శ్రీజ ప్రస్తుతం బీబీఏ చదువుతోంది. వీళ్ల ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసిపోవడంతో యువతి మేనమామ ఒకసారి శ్రవణ్ ను అతని స్నేహితులను తీవ్రంగా కట్టుకు చూపెట్టి మరీ చంపుతానని బెదిరించాడు. అయితే వీరి మధ్య ప్రేమ వ్యవహారం అలాగే కొనసాగుతుండటంతో నాలుగు రోజుల క్రితం శ్రీజ చేత శ్రవణ్ కు ఫోన్ చేయించిన ఆమె తల్లి.. పెళ్లి విషయం మాట్లాడుదాం అంటూ రమ్మని చెప్పించింది. యువతి ఇంట్లో తమ ప్రేమకు అంగీకారం వచ్చిందనే ఉత్సాహంలో శ్రవణ్ వెళ్లడానికి సిద్ధమయ్యాడు. రాత్రి పొద్దుపోయిన ఇంటికి రావాలని మరోసారి యువతి తల్లి చెప్పడంతో శ్రవణ్ నిన్న రాత్రి శ్రీజ ఇంటికి వెళ్ళాడు. తెల్లవారుజామున శ్రవణ్ ను శ్రీజను యువతి తల్లి హాస్పిటల్ కు తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఈరోజు ఉదయం శ్రవణ్ మరణించాడని సమాచారం అందడంతో శ్రవణ్ కుటుంబ సభ్యులు వెళ్ళారు. అప్పటికే పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు శ్రీజ తల్లిని అదుపులోకి తీసుకుని విచారించారు.

కూతురిపై దాడి చేస్తుంటే అడ్డొచ్చాడు..!
విచారణలో తాను తన కూతురిపై కోపంతో క్రికెట్ బ్యాట్ తో దాడి చేసే క్రమంలో అడ్డువచ్చిన శ్రవణ్ కి తీవ్రగాయాలయ్యాయని నిందితురాలు శ్రీజ తల్లి చెప్పినట్లు తెలిసింది. అయితే ఇదంతా అబద్ధమని పోస్ట్ మార్టం నివేదికలో స్పష్టంగా బయటపడింది..

పోస్టుమార్టం రిపోర్ట్ లో తేలింది ఇదే..!
శ్రవణ్ సాయి శరీరంపై బ్లేడ్ తో కట్ చేసి నరాలు బయటకు లాగి కట్ చేశారని.. అలాగే రాడ్లు ఇతర మారణాయుధాలతో కుళ్ళబొడిచి చంపేశారని క్రికెట్ బ్యాట్ తో దాడి చేస్తే అలాంటి గాయాలు కావని.. ఐరన్ రాడ్లతో దాడి చేసినట్లుగా శరీరంపై ఆనవాళ్లు ఉన్నాయని పోస్ట్ మార్టం రిపోర్ట్ లో స్పష్టంగా బయటపడినట్లు హాస్పిటల్ లో కాసేపటి క్రితం రిపోర్ట్ ను చదివిన శ్రవణ్ స్నేహితులు.. అతని పెదనాన్న మీడియాకు తెలిపారు..!
ఆమె రౌడీలా మాట్లాడుతుంది..!
యువతి కుటుంబ సభ్యుల వ్యవహారం తెలిసే ఇలాంటివి మానేయాలని తాను కూడా శ్రవణ్ ను పలుమార్లు హెచ్చరించానని.. పెద్దలకు చెప్పి ఏదైనా సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలి తప్ప ఇలా ఇంటికి పిలిపించి మరీ అత్యంత పాశవికంగా హత్య చేయడమేంటని ఆయన కన్నీళ్లపర్యంతమయ్యాడు..
నిందితురాలు ముమ్మాటికి శ్రీజ తల్లే అని.. తల్లి ఆమె సోదరుడు ఇద్దరూ రౌడీల మాదిరిగా బెదిరింపులకు పాల్పడే తత్వం ఉన్నవాళ్ళని శ్రవణ్ స్నేహితులు చెబుతున్నారు.. పూర్తిగా దర్యాప్తు పారదర్శకంగా చేసి హంతకులకు కఠిన శిక్ష పడేలా చూడాలని వారు పోలీసులను కోరారు..
పోస్ట్ మార్టం అనంతరం శ్రవణ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతని స్వస్థలం విజయవాడకు తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్నేహితులు తెలిపారు.
......









Comments