
భైంసా బిడ్డ.. సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది.. అంతలోనే...
- Writer Desk

- Feb 3
- 2 min read
ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఉండే ఆదిలాబాద్ భైంసాలో పుట్టిన అమ్మాయి.. ఆత్మస్థైర్యంతో చదువులో రాణించింది.. అనుకున్నది సాధించింది.! చిన్న వయసులోనే నెలకు లక్ష రూపాయల జీతం సాధించే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని అందిపుచ్చుకుంది..!
అనారోగ్యంతో ఉన్న అమ్మపై బెంగ..! తాను పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే అమ్మ ఆలనాపాలనా ఎవరు చూసుకుంటారు..? హాస్పిటల్ కు ఎవరు తీసుకువెళతారు..? అనే ఆందోళన ఆ బిడ్డ మనసును తొలిచేసింది.. రోజులు గడుస్తున్నా కొద్ది ఆలోచన పెద్దదిగా మారింది.. చివరికి బిడ్డ ప్రాణాలనే బలితీసుకుంది..
తాను పెళ్ళిచేసుకుని వెళ్ళిపోతే అమ్మ ఒంటరై పోతుందనే బెంగతో మదనపడిన అమ్మాయి.. శాశ్వతంగా తన తల్లిని ఒంటరిని చేస్తున్నాననే ఆలోచన చేయలేకపోయింది..!
అలా చేసి ఉంటే.. ఆత్మహత్యకు పాల్పడి ఉండేది కాదు..! తల్లికి తీరని వేదన మిగిల్చేది కాదు..!
అమ్మపై ఆలోచన ఆమెను మానసికంగా కుంగదీసింది.. ప్రాణాలనే తీసింది..! ఒక బలహీన పరిస్థితుల్లో ఆవేశపూరితంగా తీసుకున్న నిర్ణయం జీవితాన్నే ముగించేసింది..! కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది..!
ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో ఉండే ఆదిలాబాద్ భైంసాలో పుట్టిన అమ్మాయి.. ఆత్మస్థైర్యంతో చదువుకో రాణించింది.. అనుకున్నది సాధించింది.! చిన్న వయసులోనే నెలకు లక్ష రూపాయల జీతం సాధించే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని అందిపుచ్చుకుంది..!
అనుకోని రీతిలో ట్యాంక్ బండ్ లో దూకి తనువు చాలించింది.!

లేక్ పోలీస్ స్టేషన్ సిఐ ఆర్.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం..జనవరి 31న ఆదివారం రాత్రి పొద్దుపోయాక ఒక యువతి మృతదేహం లుంబినీ పార్కు వైపు హుస్సేన్ సాగర్ లో తెలియాడుతున్నట్లు గుర్తించాం.. మృతదేహాన్ని బయటకి తీసి పరిశీలించగా ఆమె పద్దెనిమిది నుండి ఇరవై ఐదులోపు వయసు ఉన్నట్లుగా అనిపించింది.. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి పంపించి దర్యాప్తు చేయపట్టాం..ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించాం.

దర్యాప్తులో భాగంగా మిగతా మూడు కమిషనరేట్లకు సమాచారం అందించి.. మిస్సింగ్ కేసులపై అరాతీసాం..ఈక్రమంలో కూకట్ పల్లి పీఎస్ లో యువతి మిస్సింగ్ కేసు నమోదైనట్లు గుర్తించడం జరిగింది.. ఫోటోలు ఇతర వివరాలు పోల్చిచూసి మృతిచెందిన యువతి ఆమెనే అని నిర్ధారించుకున్నాం..
మోతీనగర్ లో నివసించే యువతి విజయలక్ష్మి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుని వచ్చి హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించమని సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు..!
తల్లి కోసం తల్లడిలి..
సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న 26 ఏళ్ల విజయలక్ష్మి మోతీనగర్ లో తన తల్లితో పాటు ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది.. తండ్రి చనిపోవడంతో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని తనతోపాటే ఉంచుకుని..ఆమె బాగోగులు చూసుకుంటోంది..
తల్లిదండ్రులకు విజయలక్మి ఒక్కతే సంతానం కావడంతో అన్ని బాధ్యతలు తానే మోస్తోంది..
ఈ క్రమంలో ఆమె పెదనాన్న కుమారులు కూడా చెల్లి విజయలక్ష్మికి కాస్త బాసటగా ఉంటున్నారు.. సోదరికి పెళ్లి చేయాలనే ఆలోచనతో వాళ్లు విజయలక్ష్మి తల్లితో చర్చించారు.. ఆమె పెళ్లి చేయడానికి సమ్మతించడంతో సంబంధాలు కూడా వెదుకుతున్నారు.. ఈ విషయం తెలిసినప్పటినుండి విజయలక్ష్మి లో ఆందోళన మొదలైంది.. తాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అమ్మ బాగోగులు ఎవరు చూస్తారు.. తాను ఒంటరైపోతుంది కదా అనే బెంగ పట్టుకుంది.. అదే ఆలోచనతో మధనపడి పోయి.. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది..
ఆ ఒత్తిడి ఆమెను ఆలోచించకుండా చేసింది.. భరించలేని మానసిక ఒత్తిడితో తీవ్ర మనో వేదనకు గురైన విజయలక్ష్మి..చివరికితన చావుతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించింది.. వెంటనే ఎలా చనిపోవాలి.. ఆత్మహత్య చేసుకునే మార్గాలపై తన ల్యాప్ టాప్ ఓపెన్ చేసి గూగుల్ లో సెర్చ్ చేసింది..

ఆ వెంటనే.. ఆదివారం మధ్యాహ్నం పన్నెండున్నర సమయంలో ట్యాంక్ బండ్ పైకి ర్యాపిడో బుక్ చేసుకుని వచ్చిన విజయలక్ష్మి.. అన్నమయ్య విగ్రహం ఎదురుగా ఉన్న రైలింగ్ పైనుండి హుస్సేన్ సాగర్ లో దూకింది..!
••••••••
A Report By
Bestha Upender
Senior Journalist




Comments