top of page

నకిలీగాడి ఆటకట్టించిన పోలీసులు..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • Nov 26, 2025
  • 1 min read

హైదరాబాద్ :ఘరానా మోసగాడు ఐఏఎస్.. ఐపీఎస్ అవతారమెత్తాడు.. ఎదుటివాళ్లని బురిడీ కొట్టించడానికి ఐడి కార్డులు విజిటింగ్ కార్డులు నకిలీ హోదా పత్రాలు..సృష్టించాడు చివరికి తన కారుకు కూడా వాకీటాకీలు సైరన్లు కూడా ఆమర్చుకున్నాడు.


ప్రభుత్వం నుండి కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి పెద్దమొత్తంలో వసూళ్లు చేశాడు..


సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, చివరకు ఎన్ఐఏ అధికారిగా నటిస్తూ బాగా డబ్బులున్నవాళ్లను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఫిల్మ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.


హైదరాబాద్ వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) సిహెచ్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు..

షేక్‌పేటలోని అపర్ణ ఆరా అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్న బత్తిని శశికాంత్‌(39) కొన్నేళ్లుగా నకిలీ ప్రభుత్వ పత్రాలను ఉపయోగించి, తనను తాను ఉన్నత స్థాయి అధికారిగా నమ్మిస్తూ మోసాలు చేస్తున్నాడు. ఇదే కోవలో గోల్డ్ జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ నుండి రూ.పదిన్నర లక్షలకు పైగా మోసం చేశాడని డీసీపీ తెలిపారు.నవంబర్ 25న అరెస్టు చేసి, భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్)లోని మోసం, ఫోర్జరీ, క్రిమినల్ బెదిరింపు మరియు వంచన వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు.


శశికాంత్ రెండేళ్లకు పైగా తనను తాను గనుల శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా, కొన్నిసార్లు ఐపీఎస్, ఎన్‌ఐఏ అధికారిగా చూపించుకుని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడని తెలిపారు.


నకిలీ ఐఏఎస్, ఐపీఎస్ ఎన్ఐఏ ఐడీ కార్డులు సృష్టించిన నిందితుడు అందుకు తగినట్లుగా విజిటింగ్ కార్డులు కూడా కొట్టించాడు. తాను ప్రభుత్వ ఉన్నతాధికారినని నమ్మించడానికి నకిలీ అధికార పత్రాలు కూడా సృష్టించాడని డీసీపీ తెలిపారు. నిందితుడి వద్ద పోలీసు సైరన్లు, వాకీ టాకీలు అమర్చిన ప్రైవేట్ కారు ఉందని చెప్పారు.

ముందుగానే ప్లాన్ చేసుకుని అందుకు తగినట్లుగా అధికార దర్పం ఉట్టిపడేలా తయారై వెళ్ళిపోవడం.. పోలీస్ అధికారిగా వెళ్తే.. ఒక స్థాయిలో హడావుడి చేయడం చేసేవాడని.. నిందితుడి మాటలతీరును చూసి కూడా ఎదుటివాళ్లు బుట్టలో పడిపోయేవారని తెలుస్తోంది.!


నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతనివద్ద నకిలీ పత్రాలు కార్డులు కారు ఇతరత్రా ఆధారాలు అతనివద్దనుండి స్వాధీనం చేసుకున్నారు..!


••••••

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page