
ఇవ్వకూడని ఇంజెక్షన్ తో బిడ్డను చంపేసిన క్రేయాన్స్ హాస్పిటల్..!
- Writer Desk

- 4 minutes ago
- 2 min read
నగరంలోని సన్ సిటీ లో దారుణ ఘటన చోటు చేసుకుంది...
వైద్యుల దుర్మార్గపు చర్యకు ఒక పసిగుడ్డు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి..
తల్లి ఒడిలో గిలగిలా కొట్టుకుంటూ బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో.. ఆ తల్లి గుండెలవిసిపోయేలా తల్లడిల్లిపోయింది..
తన బిడ్డ ఇక లేదు అనే నిజాన్ని ఇంకా నమ్మలేని స్థితిలో బాధతో గుండెలు బాదుకుంటోంది..!
ఒక్క క్షణం ఆలోచించి వైద్యులు కావలసిన వైద్యం అందించి ఉంటే బిడ్డడి ప్రాణాలు పోయేవి కాదు...
ఏ స్థాయి పిల్లలకు ఎలాంటి ఇంజెక్షన్లు ఇవ్వాలి.. ఎంత మోతాదు ఇవ్వాలి అనేది హాస్పిటల్ వైద్యులుగా ముందు అవగాహన కలిగి ఉండాలి..! ఎంపిక చేసిన ఔషదం వినియోగించే గడువు ఎంత ఉంది కూడా చూసుకోవాలి.. ఇవి కనీస బాధ్యతలు.. కానీ ఇక్కడ ఈ హాస్పిటల్ వైద్యులు ఈ రెండింటి విషయంలో ఘోరాతి ఘోరమైన తప్పు చేశారు.. నిలువునా బిడ్డ ప్రాణాలు తీశారు..!
నవమాసాలు మోసి.. ఎన్నో ఆశలతో బిడ్డకోసం ప్రసవ వేదనను పంటికింద నొక్కిపట్టి భరించే తల్లి కష్టం విలువ తెలియని నీచ నికృష్టులు వైద్యుల ముసుగులో ఇలా హాస్పిటల్స్ పెట్టి ప్రాణాలు తీస్తుంటే..! ఏం చేయాలి వీళ్ళని..?

జీవితాంతం తల్లిదండ్రులు అనుభవించే బాధను వీళ్ళు తీర్చగలరా..?
చిత్త శుద్ధితో శాయశక్తులా ప్రయత్నించి విఫలమైతే విధిరాత అని సరిపుచ్చుకోవచ్చు..! కానీ నిర్లక్ష్యంతో సరిదిద్దుకోలేని తప్పు చేస్తే దాన్ని ఏమనాలి..! కచ్చితంగా నేరమే..! శిక్షించాల్సిందే..!
శనివారం సాయంత్రం సన్ సిటీలోని బండ్లగూడలో ఉన్న క్రెయిన్స్ హాస్పిటల్ లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది..
స్థానికంగా నివసించే అశ్వినీ, విష్ణువర్ధన్ రెడ్డి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.. ఆరునెలల క్రితం బాబు పుట్టాడు...
రెండు రోజులుగా కాస్త అనారోగ్యంగా జ్వరంతో చిన్నారి బాధపడుతుండడంతో తమకు దగ్గరలో ఉన్న క్రేయాన్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు.. అక్కడ వైద్యం చేసిన వైద్యులు పూర్తిగా నిర్లక్ష్యంగా వివరించారు. ఇవ్వకూడని ఇంజెక్షన్.. అదికూడా నెలరోజుల ముందే గడువు తీరిపోయిన ఇంజెక్షన్ ను చిన్నారికి ఎక్కించడంతో క్షణాల్లోనే బాబు విలవిలలాడుతూ తల్లి ఒడిలోనే ఊపిరి ఒదిలేశాడు..!
హార్ట్ బీట్ ను పునరుద్ధరించడం కోసం ఇచ్చే అధిక ప్రభావిత వాసోకాన్ వన్ ఎంజీ ఇంజెక్షన్ ను చిన్నారికి ఇచ్చేసరికి.. ఆ ప్రభావాన్ని తట్టుకోలేని చిన్ని ప్రాణం క్షణాల్లోనే గాలిలో కలిసింది..

ఆరేళ్ల పిల్లలకు ఇచ్చే ఇంజెక్షన్ ఆరునెలల పసిగుడ్డుకు.. వైద్యుల రాక్షస చర్య..!
సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచనలు ఆదేశాల ప్రకారం ఆరేళ్ల లోపు పిల్లలకు వాసోకాన్ వన్ ఎంజీ ఇంజెక్షన్ ఇవ్వడానికి అనుమతి లేదు..!
ఆరేళ్ల లోపు చిన్నారులకు ఇంజెక్షన్ ప్రభావాన్ని తట్టుకునే శక్తి ఉండదని.. అత్యంత ప్రభావితమైన ఈ ఔషధాన్ని ఇంజెక్షన్ చేయాలంటే నిష్ణాతులైన వైద్యుల సలహాతోనే ఇవ్వాల్సి ఉంటుందని... ఈ నిబంధనలన్నీ కాలరాసిన క్రేయాన్స్ హాస్పిటల్ యాజమాన్యం అత్యంత దారుణంగా వ్యవహరించినట్లుగా స్పష్టమవుతోంది...
ఆరేళ్ల చిన్నారులకు ఇవ్వాల్సిన ఇంజెక్షన్ ఆరు నెలల పసిగుడ్డు కు ఇవ్వడంతో ఆ లేత శరీరం తట్టుకోలేక నరకయాతన అనుభవించినట్లుగా స్పష్టమవుతోంది...

తల్లి ఒడిలో విలవిలలాడుతూ.. గిలాగిలా కొట్టుకుంటూ ప్రాణాలు ఒదిలిన తీరు గుండెను పిండేసిందని ప్రత్యక్ష సాక్ష్యాలు చెప్పారు...
కేవలం వైద్యుల నీతిమాలిన చర్య.. పూర్తిస్థాయి నిర్లక్ష్యం.వల్లే పసిబిడ్డ ప్రాణాలు పోయాయని.. హాస్పిటల్. ను వెంటనే మూసివేసి.. యాజమాన్యాన్ని.. వైద్యులను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు బంధువులు డిమాండ్ చేస్తున్నారు..
ప్రస్తుతం తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు హాస్పిటల్ పై కేసు నమోదు చేసినట్లు సమాచారం..!
•••••••
A Report By
ShyamaSundar Akula
9010746999
7382281818 (WhatsApp)
•••••••









Comments