
ప్రియుడి భార్యకు వైరస్ ఎక్కించిన ప్రియురాలు..!
- Writer Desk

- Jan 25
- 2 min read
క్రైమ్ సినిమా రియాలిటీ..!
రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహా ఘటన ఏపీలోనూ చోటుచేసుకుంది..
సినిమాలో కూతురికి రహస్యంగా తండ్రి హెచ్ ఐ వి ఇంజెక్షన్ చేయిస్తాడు...
రియాలిటీలో ప్రియుడి భార్యకు వైరస్ ఇంజెక్షన్ చేయించింది ప్రియురాలు..!
ఒక యువతి తన మాజీ ప్రియుడిపై పగ పెంచుకొని అతని భార్యకు ప్రాణాంతకమైన వైరస్‌ను ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన వైనం వెలుగులోకి వచ్చింది. ఈ నీచ చర్యకు పాల్పడిన వసుంధర అనే యువతితో పాటు ఆమెకు సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
సినిమాలలో క్రైమ్ నిజజీవితంలో ఎలా ప్రభావితం చూపుతుందో స్పష్టం చేసే క్రైమ్ స్టోరీ ఇది..!
కర్నూలుకు చెందిన డాక్టర్ కరుణ్ కుమార్ అనే వ్యక్తికి వసుంధరతో గతంలో పరిచయం ఉంది. అంతకు మించిన సాన్నిహిత్యం ఉంది..అయితే కొన్ని కారణాల వల్ల వారి బంధం తెగిపోవడంతో కరుణ్ కుమార్... శ్రావణి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. తన ప్రియుడు మరొకరిని పెళ్లి చేసుకోవడాన్ని సహించలేకపోయిన వసుంధర.. కోపంతో ఆక్రోశంతో రగిలిపోయింది...
ఎలాగైనా వారి వివాహ బంధాన్ని విచ్చిన్నం చేయాలని కంకణం కట్టుకుంది.. !

అనుకున్నదే తడవుగా క్రైమ్ యాంగిల్ స్కెచ్ ప్లాన్ చేసింది..!
శ్రావణిని అడ్డుతొలగించుకుంటే తన ప్రియుడు తనకు దక్కుతాడని భావించిన వసుంధర.. అదే ఆలోచనతో ఆమెను అడ్డుతొలగించే ప్లాన్ తో టాస్క్ రూపొందించింది..
నలుగురు కిరాయి వ్యక్తులకు డబ్బులు ఇచ్చి తను చెప్పినట్లు చేయమని ఆదేశించింది..!
అనుకున్న ప్రకారం కిరాయి వ్యక్తులు టాస్క్ అమలు చేశారు.! అయితే అనుకున్నట్లుగా కాకుండా ప్లాన్ కాస్త బెడిసి కొట్టింది..!
శ్రావణి స్కూటీపై వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యేలా ప్లాన్ వేసింది వసుంధర. రోడ్డుపై ఆమె స్కూటర్ కు ఎదురుగా అడ్డువచ్చిన కిరాయి వ్యక్తి.. అదుపుతప్పేలా చేశాడు.. దీంతో శ్రావణి స్కూటర్ తో సహా కిందపడిపోయింది.. అదే అదునుగా వెంటనే అక్కడికి వచ్చిన వసుంధర.. శ్రావణిని పైకి లేపింది..గాయాలయ్యాయి కదా హాస్పిటల్ కు వెళ్దామని చెప్పి... వెంటనే మిగతా ముగ్గురు కిరాయి వ్యక్తులతో కలిసి శ్రావణిని అప్పటికే సిద్ధం చేసిన ఆటోలో ఎక్కించింది.. శ్రావణి వద్దని వారిస్తున్నా వినకుండా ఆటోలో తీసుకెళ్లే ప్రయత్నం చేసింది వసుంధర..! ఆమె పక్కనే కూర్చుని తన హ్యాండ్ బ్యాగ్ లో వైరస్ ద్రవం ఎక్కించి సిద్ధం చేసిన సిరంజీని తీసి రెప్పపాటులో శ్రావణి భుజంపై ఇంజెక్షన్ చేసే ప్రయత్నం చేసింది.. హఠాత్పరిణమంతో బిత్తరపోయిన శ్రావణి వెంటనే తేరుకుని ఎదురు తిరిగింది.. వసుందర చేతిలోని ఇంజెక్షన్ లాగడానికి ప్రయత్నిస్తూ బిగ్గరగా అరవడం చేసింది.. దీంతో చుట్టుపక్కలవాళ్లు ఆటో వద్దకు చేరుకోగానే.. భయంతో వసుంధర.. ఆమె మనుషులు పారిపోయారు...

శ్రావణిని వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స అందించడంతో ఆమెకు ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న శ్రావణి భర్త కరుణ్ కుమార్.. వసుంధరపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరా పుటేజి ఆధారంగా.. వసుంధరతో పాటుగా మరో ముగ్గురిని అరెస్టు చేశారు.
.....









Comments