top of page

వ్యూహం చిత్ర నిర్మాత దాసరి కిరణ్ మోసం..!

Writer: Writer Desk
Writer Desk
Aug 20, 2025
1 min read

• డబ్బులు తీసుకొని మోసం..!


• అడిగితే దాడి..!


• నిర్మాత దాసరి కిరణ్ నిర్వాకం..!


• ఫిర్యాదు చేసిన బాధితులు..


• హైదరాబాద్ లో అరెస్ట్ చెందిన విజయవాడ పటమట పోలీసులు..!


ఆర్జీవీ డైరెక్ట్ చేసిన వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఆయన్ను విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. దాసరి కిరణ్‌ కు దగ్గరి రిలేటివ్ అయిన గాజుల మహేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేశారు. తన వద్ద కిరణ్‌ రెండేళ్ల క్రితం అప్పుడు కింద రూ.4.5 కోట్లు తీసుకున్నాడని.. అప్పటి నుంచి అడుగుతున్నా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని మహేశ్ తెలిపారు. ఈ నెల 18న విజయవాడలోని కిరణ్ ఆఫీసుకు మహేశ్ తన భార్యను తీసుకుని అప్పు అడిగేందుకు వెళ్లారు.


ఆ సమయంలో కిరణ్ తో పాటు అతని అనుచరులు 15 మంది తమపై దాడి చేశారని మహేశ్ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మహేశ్ కు ట్రావెల్ ఏజెన్సీ ఉంది. దాసరి కిరణ్ కుమార్ గతంలో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన వ్యూహం సినిమాకు నిర్మాతగా వ్యవహరించి పాపులర్ అయ్యారు. ఆ సినిమా అప్పట్లో ఓ సెన్సేషనల్ గా నిలిచింది.

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page