top of page

ప్రియుడి కోసం కన్నవాళ్ళనే కడతేర్చింది..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • 7 days ago
  • 2 min read

మృగత్వం..నచ్చకపోతే చంపేయడమే..!


భర్త భార్య కొడుకు కూతురు తల్లి తండ్రి అనే తేడాలేదు..!


ఎవరు తమ ఇష్టాలకు అడ్డుగా కనిపిస్తే వారిని చంపేయడమే! మనవరూపాల్లో ఉన్న రాక్షసులు కన్నవాళ్ళని కడతేరుస్తున్నారు.! ఆడ మగ తేడాలేదు.. అందరిలోనూ రాక్షస లక్షణాలు పెరిగిపోతున్న పరిస్థితి దాపురించింది..!


ఇంటర్ నెట్ యూట్యూబ్ రీల్స్ టీవీ సీరియల్స్.. ఎక్కడ చూసినా క్రైమ్ కథా కుటుంబ చిత్రాలే...

వాటిని చూసి ప్రభావితం అవుతున్నారని నిపుణులు చెబుతున్నా... ఈ మధ్య కాలంలో మగవాళ్ళను మించి అన్నట్లుగా ఆడవాళ్లు నేరాలకు హత్యలకు తెగబడుతున్నారు..!

........



తాజాగా ఒక యువతి ముక్కూ మొఖం తెలియని వాన్ని ప్రేమించి.. అడ్డు చెబుతున్నారని కన్నవాళ్ళనే దారుణంగా కడతేర్చింది..!


కనీస ఙ్ఞానం.. ఆలోచన లేని యువతి ఉన్మాద చర్యకు సొంత తల్లిదండ్రులు బలైపోయారు... అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తున్న తల్లిదండ్రులు.. తమ కన్నా పేగు.. ఇలా కత్తి దూస్తుందని.. ఉసురు తీస్తుందని ఊహించకపోవచ్చు..!


కంటికి రెప్పలా చూసిన పిల్లలు కాలనాగులై కాటేసి చంపేసే దుర్మార్గపు ఉదంతాలు అనేకం.చోటు చేసుకుంటున్నాయి..

.......


వికారాబాద్ జిల్లాలో స్వంత తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య చేసింది ఓ ఉన్మాద కూతురు..!


ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైన ఓ యువకుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన యువతి అతన్నే పెళ్ళిచేసుకుంటానంటూ పట్టుబట్టింది..ఒప్పుకోలేదని తల్లిదండ్రులను మట్టుబెట్టింది..


బంటారం మండలం యాచారం గ్రామంలో ఉంటూ నర్సింగ్ హోంలో నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న యువతి నక్క సురేఖకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. అది ఇద్దరిమధ్య ప్రేమకు దారితీసింది. రెండేళ్లుగా వారు ప్రేమలో ఉన్నారు. ఇటీవల తల్లిదండ్రులకు విషయం చెప్పిన సురేఖ అతనితో తనకు పెళ్లిచేయాలని కోరింది.. అయితే వేరువేరు కులాలు కావడం.. ఇతరత్రా కారణాల వల్ల అతనితో వివాహానికి సురేఖ తల్లిదండ్రులు అంగీకరించలేదు.!



దీంతో తల్లిదండ్రులను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని కుట్ర చేసిన సురేఖ పక్కా ప్లాన్ తో వారిని మట్టుబెట్టింది..


తాను పనిచేస్తున్న నర్సింగ్ హోమ్ నుండి అనస్థీషియా (మత్తుమందు) ఇంటికి తీసుకువచ్చింది. ఒళ్లు నొప్పులకు మందు తీసుకువచ్చాను.. ఇంజెక్షన్ చేస్తే తగ్గిపోతుందని తల్లిదండ్రులను మభ్యపెట్టింది..బిడ్డ తమ ఒళ్లు నొప్పులు తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని చూసి మురిసిపోయిన తల్లిదండ్రులు ఇంజెక్షన్ తీసుకునేందుకు సంతోషంగా ఒప్పుకున్నారు. అనుకున్న ప్రకారం ఎక్కువ మోతాదు ఉన్న మత్తుమందును ఇంజెక్షన్ ద్వారా వారి శరీరంలోకి6 ఎక్కించడంతో వారు నిద్రమత్తులోకి వెళ్లి.. అలాగే తుది శ్వాస విడిచారు..!



వారు చనిపోయిన విషయం నిర్ధారించుకున్న సురేఖ.. ప్లాన్ ప్రకారం డ్రామా మొదలు పెట్టింది.. గుండెపోటు తో తల్లిదండ్రులు మరణించారని ముందుగా తన సోదరుడికి ఫోన్ చేసి ఏడుస్తూ చెప్పింది.! బంధువులు చుట్టుపక్కలవాళ్లు అందరూ వచ్చిన తర్వాతా అందరిలోనూ కొత్త అనుమానాలు మొదలయ్యాయి.. ఇద్దరు ఒకేసారి గుండెనొప్పితో మరణించడం ఎలా సాధ్యమనే అనుమానాలు వ్యక్తం.చేసారు..


దీంతో సోదరుడు తల్లిదండ్రుల మరణంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు..


కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ఘటనా స్థలంలో పడేసి ఉన్న వాడిపడేసిన సిరెంజీలు లభించాయి.. వెంటనే సురేఖను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు ఘాతుకం బయటపడింది...


తల్లిదండ్రులను తానే మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చిహత్య చేశానని.. ప్రియుడితో పెళ్ళికి అంగీకరించకపోవడంతో ఈ దారుణానికి పాల్పడ్డానని చెప్పింది..


దీంతో నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు..!


.......

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page