
డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్..! అభిషేక్..రాజేష్ వర్మ..!
- Writer Desk

- 7 minutes ago
- 3 min read
దేశవ్యాప్తంగా రాజకీయ సంచలన సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌజ్ డ్రగ్స్ కేసు రోజుకోరకంగా మలుపులుతీసుకుంటోంది..
కొత్త వ్యక్తుల ప్రమేయం బయటపడుతోంది..!
డ్రగ్స్ కేసులో ఏకంగా ఒక ఎంపీ దొరికిపోవడం.. పోలీసులపై నిందితులు కాల్పులు జరపడం సంచలనం సృష్టించిన నేపథ్యంలో పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకున్నారు..
ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విషయం తేల్చాలని స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు ప్రత్యేక పర్యవేక్షణలో చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు..
సొంత ఫామ్ హౌజ్ లో డ్రగ్స్ ఏర్పాటు చేసిన కీలక సూత్రదారి..మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా అతని సోదరుడు పంజుగుల రితేష్ రెడ్డి, పోలీసులపై కాల్పులకు తెగబడిన డిల్లీ వ్యాపారి నమిత్ శర్మ లను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.. మార్చి 14 న రాత్రి డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా ఈగల్ ఫోర్స్ టీమ్ పక్కా సమాచారంతో దాడి చేసింది.. మొత్తం పదకొండు మంది పట్టుబడగా డ్రగ్స్ టెస్ట్ లో అరుగురికి పాజిటివ్ వచ్చింది.. ఈ కేసులో పట్టుబడిన ఏపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు ర్యాపిడ్ టెస్ట్ లో నెగెటివ్ వచ్చినప్పటికీ హాస్పిటల్ లో నిర్వహించిన టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది.. దీంతో ఆయనకు స్టేషన్ బెయిల్.ఇచ్చారు పోలీసులు..! పార్లమెంట్ సమావేశాల తర్వాత ఆయన విచారణకు అందుబాటులో ఉంటానని ఇప్పటికే సిట్ పోలీసులకు సమాచారమిచ్చాడు..!

మార్చి 14 న నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ. డ్రగ్స్ టెస్టుల అనంతరం 15 వ తేదీ ఆదివారం రాత్రి ఉప్పరపల్లి కోర్టు మేజిస్ట్రేట్ ముందు ముగ్గురు నిందితులను ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు..
కొనసాగుతున్న కస్టడీ విచారణ..!
అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను కస్టడీలోకి ఇవ్వాలని సిట్ అధికారులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే పదిరోజులపాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా.. మూడు రోజులపాటు విచారణకు అనుమతిస్తూ కోర్టు సోమవారం ఆదేశాలిచ్చింది.. దీంతో చంచల్ గూడ జైలు నుండి కస్టడీకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు..!
ప్రధాన సూత్రధారి రోహిత్ రెడ్డి, కల్పులకోసం తన లైసెన్స్ కలిగిఉన్న తుపాకీని మరో నిందితుడు నమిత్ శర్మకు ఇచ్చినందుకు గాను రితేష్ రెడ్డిని.. కాల్పులకు తెగబడిన నమిత్ శర్మ లను పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు.. ఇందులో రోహిత్ రెడ్డి గుట్టు విప్పితే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశముంది..
డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసి అందరినీ పిలిపించి పైలెట్ రోహిత్ రెడ్డి.. పోలీసుల దాడి సమయంలో వాళ్లపై కాల్పులు జరపమని నమిత్ శర్మ ను ప్రేరేపించినట్లుగా ఇప్పటిక3 పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు.. ఇపుడు నమిత్ శర్మ విచారణలో చెప్పేదాన్ని బట్టి కేసు తీవ్రత ఉండబోతోంది..! పార్టీ కోసం రోహిత్ రెడ్డి ఎక్కడినుండి డ్రగ్స్ తెప్పించాడు అనే విషయం కూడా అత్యంత కీలకమైనది..!
అభిషేక్.. రాజేష్..!
నగరంలో డ్రగ్స్ సరఫరాలో రెండు పేర్లు పాపులర్ అయ్యాయి.. అందులో ఒకటి అభిషేక్ సింగ్ కాగా.. మరొకరు రాజేష్ వర్మ..! అభిషేక్ సింగ్ కంటే రాజేష్ వర్మకు అంతర్జాతీయ నెట్ వర్క్ ఉన్నట్లుగా పోలీసుల వద్ద సమాచారం ఉంది.. వివిధ మార్గాల్లో డ్రగ్స్ తెప్పించి అభిషేక్ సింగ్ లాంటి కీలకమైన డ్రగ్ పెడ్లర్స్ కి అందిస్తుంటాడని.. వాటిని విక్రయించిన తర్వాత వచ్చే డబ్బులో రాజేష్ అభిషేక్ లాభం పంచుకుంటారనే సమాచారం ఉంది..! మొత్త. మీద హైదరాబాద్ లో అభిషేక్ సింగ్ ప్రధానమైన డ్రగ్స్ విక్రేతగా పేరుంది..!
గుట్టు విప్పిన రోహిత్ డ్రైవర్..!
డ్రగ్స్ పార్టీ రోజు పోలీసుల విచారణలో పార్టీలో పాల్గొన్న బెంగళూరు వ్యాపారి కౌశిక్ రవి తానే పార్టీ కోసం డ్రగ్స్ తెచ్చినట్లు చెప్పాడు.. బిజినెస్ టూర్ పై హిమాచల్ ప్రదేశ్ సిమ్లా వెళ్లినపుడు అక్కడ వేరే వ్యక్తుల ద్వారా కొకైన్ తెప్పించి తీసుకువచ్చానని.. రోహిత్ కోరడంతో రెండు గ్రాముల డ్రగ్స్.. పార్టీ కోసం తెచ్చానని చెప్పాడు.. కానీ రోహిత్ డ్రైవర్ శరత్ మాత్రం అభిషేక్ సింగ్ నుండి తానే డ్రగ్స్ తెచ్చినట్లు చెప్పాడు..గతంలో కూడా అభిషేక్ నుండి రోహిత్ డ్రగ్స్ తెప్పించినట్లుగా కూడా శరత్ చెప్పినట్లు సమాచారం దీంతో శరత్ చెప్పిన వివరాలు నిజమే అని నిర్ధారించుకున్న పోలీసులు అభిషేక్ కోసం వెతుకుతున్నారు..అభిషేక్ ఆచూకీ తెలిసినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ అది నిజం కాదనితెలుస్తోంది.!
నా కుమారుడు కనిపించడం లేదు..!
డ్రగ్స్ పార్టీ కేసుకు సంబంధించి అభిషేక్ సింగ్ కీలకంగా మారడంతో అతనికోసం పోలీసులు తీవ్రంగా వెదుకుతున్నారు.. ఇదిలా ఉండగా గత 16 వ తేదీ నుండి తన కుమారుడు కనిపించకుండా పోయాడని అభిషేక్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.. డ్రగ్స్ పార్టీ వ్యవహారం గత 14వ తేదీన రాత్రి పొద్దుపోయాక బయటపడింది.. 15 న నిందితుల అరెస్ట్ విచారణలు కొనసాగాయి..! 15న రాత్రి రోహిత్ సహా ముగ్గురి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.. బహుశా తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అని భావించే అభిషేక్ అదృశ్యమైనట్లు తెలుస్తోంది..! మరోవైపు డ్రగ్స్ కేసులో ఇంకో పేరు కూడతెరపైకి వచ్చింది.. అభిషేక్ కు డ్రగ్స్ సరఫరా చేసే రాజేష్ వర్మ గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.. నిందితుల విచారణలో రాజేష్ ప్రస్తావన కూడా రావడంతో రోహిత్ రెడ్డికి రాజేష్ వర్మతో కూడా సంబంధాలు ఉన్నట్లుగా సిట్ అనుమానిస్తోంది.. ఈ నేపథ్యంలోనే రాజేష్ వర్మతో సంబంధాలపై కస్టడీ విచారణలో రోహిత్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం..!
....
A Report By
ShyamaSundar Akula
9010746999
.....
......




Comments