మోసాల రూపం..!
- Writer Desk

- 10 minutes ago
- 2 min read
Cheating politician RoopaReddy
నైస్ గా మాట్లాడి నమ్మించి మోసాలకు పాల్పడుతుంది..!
రాజకీయ పలుకుబడి అండతో బాధితులు తనను ఏమీ చేయకుండా తప్పించుకుని తిరుగుతోంది..!
రాజేంద్ర నగర్ మణికొండ నార్సింగ్ ప్రాంతాల్లో పట్లోళ్ళ రూపారెడ్డి అంటే తెలియని వారు ఉండరు..!
°°°°°°
తాండూరు కు చెందిన రూపారెడ్డి నార్సింగ్ పీఎస్ పరిధిలోని తిరుమల హిల్స్ లో నివసిస్తూ గులాబీ పార్టీ నేతగా స్థానికంగా రాజకీయాలు చేస్తోంది..! ఆ మధ్య మణికొండ మున్సిపాలిటీ కౌన్సిలర్ గా కూడా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలైంది..!
సరే రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా.. వాటిని అడ్డుపెట్టుకుని ఆమె చేస్తున్న మోసాలు ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారాయి..!
ఇల్లు ఇప్పిస్తానని.. ఇంటి స్థలాలు కారు చౌకగా ఇప్పిస్తానని.. డబ్బులు ఇస్తే తాను నిర్వహించే వ్యాపారాల వల్ల వచ్చే లాభంతో అదిక వడ్డీ చెల్లిస్తానంటూ.. వ్యక్తులు వారి ఆలోచనలు బట్టి తెలివిగా నమ్మిస్తుంది..!
ఒక్కసారి ఆమె చేతిలో మన డబ్బులు పడ్డాయా..! ఇక అంతే సంగతులు..!
ఇప్పుడూ అప్పుడూ అంటూ సంవత్సరాల తరబడి దాటవేస్తూనే ఉంటుంది..!
గట్టిగా అడిగితే చెక్కులు ప్రామిసరీ నోట్లు.. అన్ని ఇచ్చేస్తుంది.. కానీ అవన్నీ నిరుపయోగం అని డబ్బులు ఇచ్చినవాళ్ళకి తొందరగానే అర్థం అవుతుంది..!
మాజీ మంత్రులు కేటీఆర్ సబితా ఇంద్రారెడ్డి రెడ్డి సహా ఇతర గులాబీ పార్టీ ముఖ్యులతో ఫోటోలు దిగుతూ అవి చూపించి తనకు ఎంతో పలుకుబడి ఉందని స్థానికులను నమ్మించే ప్రయత్నం చేస్తుంది..!
ఆ మధ్య ఓ ఎమ్మెల్యే కుమారుడితో ఈమె కుమార్తె ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని కూడా ఘనంగానే నిర్వహించారు..!

డబ్బులిచ్చిన వాళ్ళకి తిరిగి ఇవ్వాలంటే.. రూపాయి కూడా తనవద్ద లేదని డ్రామా చేసే మహిళ.. ఎన్నికలలో పోటీ చేయడానికి.. శుభకార్యాలకు మాత్రం భారీగానే ఖర్చుచేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు.! రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టిన సొమ్ము.. లాభాల ఆశపడి ఆమె చేతిలో పెట్టామని.. ఇంత అడ్డంగా మోసం చేస్తుందని ఊహించలేదని పలువురు బాధిత మహిళలు వాపోయారు.!
నిన్న కొందరు మహిళా బాధితులు ఆమె ఇంటికి వెళ్లి నిలదీయగా.. పోలీసులను పిలిపించుకుని అడ్డుకోవడమే కాకుండా తన అనుచరుల చేత దాడి చేయించే ప్రయత్నం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు.. ఓ మహిళ స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది.! కనీస మానవత్వం లేకుండా.. దోపిడి దొంగలకంటే దారుణంగా తమ డబ్బులు కాజేసిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తమ డబ్బులు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు..!
డబ్బులు ఇవ్వాలని అడగడానికి ఇంటికి వెళితే తనపై రూపారెడ్డి తన కుటుంబ సభ్యులు అనుచరుల చేత దాడి చేయించే ప్రయత్నం చేశారని..ఇంట్లో నుండి బయటకు తోయించిందని.. మళ్ళీ ఇంటివైపు వస్తె నిన్నూ నీ వాళ్ళను చంపేస్తామని రూపారెడ్డి మనుషులు తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారని.. నార్సింగ్ పీఎస్ లో ఓ బాధిత మహిళ ఫిర్యాదు చేసింది..! తాను 2021 లో తొమ్మిది లక్షలు రూపా రెడ్డికి ఇచ్చానని.. ఇప్పటివరకు పైసా డబ్బు తిరిగి ఇవ్వకపోగా.. చెక్కులు బౌన్స్ చేయించిందని ఆమె వాపోయింది.. ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వెళ్ళి డబ్బులు అడగాలని చూస్తే దాడి చేయించి బెదిరిస్తోందని ఆమె కన్నీళ్ల పర్యంతమైంది..!

రూపారెడ్డి బాధితులలో పొలిటీషియన్లు జర్నలిస్టులు..!
పరిచయమైన వెంటనే తన మాటలతో ఇంప్రెస్ చేసి తానో పెద్ద పలుకుబడి కలిగిన రాజకీయ నాయకురాలిని అని ఎదుటివాళ్లని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా తాను ఎంత చెప్తే అంతా అన్నట్లుగా ఏ పని అయినా చేసిపెడతానంటూ నమ్మిస్తుంది.. ఇలా ఆమెను నమ్మి ఎంతో మంది రాజకీయ నాయకులు.. స్థానిక జర్నలిస్టులు.. వ్యాపారులు రూ. లక్షలు ఇచ్చి మోసపోయినట్లు తెలుస్తోంది.. ! తాను కూడా ఏళ్ల క్రితం రూ.లక్షలు ఇచ్చానని.. ఇంటి స్థలం తక్కువ ధరకు వస్తుందని నమ్మించిందని.. ఇప్పటికీ పైసా ఇవ్వకపోగా చెక్కులు ప్రామిసరీ నోట్లు ఇచ్చిందని..! వాటివల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని.. ఆమె బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉంచకుండా మోసపూరితంగా వ్యవహారిస్తోందని ఓ సీనియర్ జర్నలిస్ట్ తన ఆవేదనను వ్యక్తపరిచాడు..,!
••••••••
A Report by
ShyamaSundar Akula
9010746999
•••••••••




Comments