top of page

కాల్చి పారేయండి..నేను చూసుకుంటా...!

  • Writer: Writer Desk
    Writer Desk
  • Mar 16
  • 3 min read

తెలుగు రాష్ట్రాలతో తీవ్ర రాజకీయ ప్రకంపనలు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫామ్ హౌజ్ డ్రగ్స్ పార్టీకి సంబంధించి అసలు విషయాలను రిమాండ్ రిపోర్ట్ బయటపెట్టింది..!


పక్కా ప్లాన్ చేసి వీకెండ్ పొలిటికల్ డ్రగ్స్ పార్టీ నిర్వహించారని.. అయితే వారి ప్లాన్ బెడిసికొట్టి పోలీసులకు దొరికిపోయినట్లుగా స్పష్టమైంది..!


డ్రగ్స్ పార్టీలో దొరికిపోయి స్టేషన్ బెయిల్ ద్వారా బయటకు వచ్చిన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తనకేమీ తెలియదన్నట్లుగా చెప్పిన విషయమంతా తప్పే అని తేలిపోయింది..!


నిన్న సాయంత్రం ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సెల్ఫ్ వీడియో విడుదల చేశారు.. తాను ఏదో పనిమీద వెళ్లానని. డ్రగ్స్ గురించితెలియదని.. బయట జరుగుతున్న ప్రచారం అంతా తప్పు.. తాను అస్సలే అబద్ధం చెప్పననీ.. ఏలూరు నియోజక వర్గం ప్రజలు అర్థం చేసుకోవాలంటూ వీడియోలో సెలవిచ్చారు.. కానీ నిన్న పోలీసులు కోర్టు కు అందచేసిన రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం పైలెట్ రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌజ్ లో

డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశానని ముందుగానే అందరికీ సమాచారమిచ్చి రమ్మని ఆహ్వానించాడని స్పష్టంగా పేర్కొన్నారు... అంటే ఎంపీ మహేష్ కు అక్కడ డ్రగ్స్ ఉన్నట్లు ముందుగానే తెలిసే.. అక్కడికి వెళ్లినట్లు అర్థం చేసుకోవచ్చు..!!

••••••••



ప్లాన్ చేసుకునే డ్రగ్స్ పార్టీ..!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫామ్ హౌజ్ లో

జరిగిన ఈ పార్టీ ముందుగానే ప్లాన్ చేసినట్లు తెలిపారు. పార్టీలో ఉన్నవాళ్లు లిక్కర్ తో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నారని అన్నారు. మరోసారి ఎర్రగడ్డ ఆస్పత్రిలో అందరికీ రక్తనమునాలతో పరీక్షలు నిర్వహించామని చెప్పారు. రెండోసారి పరీక్షలు చేసిన సమయంలో ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ కు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని అన్నారు. నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో బయటపడిందని చెప్పారు. పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలు కొకైన్ తీసుకున్నట్లుగా రిపోర్టులో వచ్చిందని వెల్లడించారు. ఫామ్ హౌజ్ డ్రగ్స్ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు పేర్కొన్నారు..!


నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, పుట్టా మహేశ్ కుమార్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవిలకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు వివరించారు. ఈ పార్టీలో మద్యంలో కొకైన్ కలుపుకొని తాగారని పేర్కొన్నారు. పైలట్ రోహిత్ రెడ్డినే వీరందరికి వీకెండ్ డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారని తెలిపారు.



లోపలినుండి చూసి ఫైరింగ్ ఓపెన్ చేశారు..!

ఫామ్ హౌజ్ ప్రాంగణంలోకి వెళ్లగానే మొదటగా లోపలినుండి తుపాకీ కాల్పుల సౌండ్ వినబడిందని పోలీసులు తెలిపారు. 'తుపాకీ కాల్పుల శబ్దాలు విని వెంటనే మేమంతా అప్రమత్తమయ్యాం... కాల్పులు జరపవ ద్దని, ఎలాంటి చర్యలు తీసుకోమని మేము గట్టిగా అరిచాం. మేము చెబుతున్నప్పటికీ వినకుండా మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు..! లోపల ఉన్న ఒక వ్యక్తి కాల్పులు జరిపేవాళ్లని ఉద్దేశించి...మీరు కాల్పులు జరపండి.. నేను మొత్తం చూసుకుంటాను.. ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ అరవడం మాకు స్పష్టంగా వినిపించింది. మేమంతా గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్దాలు నిలిచిపోయాయి. మేము

స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకున్నామని పోలీసులు రిపోర్టులో వివరించారు.. డ్రగ్స్ పార్టీపై విశ్వసనీయ సమాచారం రావడంతో మేము ముందుగానే సెర్చ్ వారెంట్ కూడా తీసుకెళ్లామని..! కాల్పులు ఆగిపోయి..మేము లోపలికి ఎంటర్ అవ్వగానే ముందుగా సెర్చ్ వారెంట్ ను రోహిత్ రెడ్డి చేతిలో పెట్టామని.. అప్పటికే నమిత్ శర్మ చేతిలో తుపాకీ గుర్తించామని.. లోపల ఉన్న వాష్ రూమ్ వద్ద ఆయన తుపాకీతో నిలబడి ఉన్నాడని.. ఆయన చేతిలోని తుపాకీ ని స్వాధీనం చేసుకున్నామని పోలీసుకు పేర్కొన్నారు. బుల్లెట్ షెల్స్ పట్టుకుని ఉన్న మరో వ్యక్తి నుండి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.. ఒక మహిళతో పాటు పదిమందిని అదుపులోకి తీసుకున్నాం. జర్మన్ మేడ్ రివాల్వర్ పాయింట్ 32ని స్వాధీనం పరుచుకున్నాం. పదకొండు మందిని విడివిడిగా విచారించాం. ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ లభించిన ఆధారాలతో గట్టిగా అడిగేసరికి ముందుగా సిల్వర్ శరత్ కుమార్.. తర్వాత కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఒప్పుకున్నారు' అని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో వెల్లడించారు.



సిమ్లా నుంచి డ్రగ్స్ తెచ్చిన కౌశిక్..!

బిజినెస్ టూర్ పై హిమాచల్ ప్రదేశ్ సిమ్లా వెళ్ళామని.. అక్కడ డ్రగ్స్ లభిస్తున్నాయి తెలియడంతో కొందరు వ్యక్తుల ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కౌశిక్ విచారణలో చెప్పినట్లు తెలిసింది..! రోహిత్ రెడ్డితో పాటు ఆయన డ్రైవర్ ను ఇతర అనుచరులను పోలీసులు విచారించగా కౌశిక్ డ్రగ్స్ తెప్పించిన విషయం బయటపడిందని తెలిసింది. దీంతో డ్రగ్స్ ఎక్కడనుండి తెప్పించిన విషయంపై ఆరా తీయగా సిమ్లా నుండి తెప్పించినట్లుగా కౌశిక్ చెప్పినట్లు తెలిసింది..! డ్రగ్స్ పార్టీ కోసం రోహిత్ రెడ్డి కోరడంతోనే తాను డ్రగ్స్ తెచ్చినట్లు కౌశిక్ పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది.. సిమ్లా లో గ్రామ్ కొకైన్ కు పదిహేను వేలు తీసుకుంటున్నారని.. రెండు గ్రాముల కొకైన్ పార్టీ కోసం తెచ్చినట్లు కౌశిక్ వెల్లడించినట్లు సమాచారం..! పదకొండు మందికి డ్రగ్ లైవ్ కిట్స్ ద్వారా టెస్టులు చేశాం. అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మ, రోహిత్ రెడ్డిలకు డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చింది... కాల్పులు జరిపిన నమిత్ శర్మని అరెస్ట్ చేశాం. ఈ కాల్పులు జరిపిన తుపాకీ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా గుర్తించాం. లైసెన్సు రివాల్వర్ నితీశ్ వద్ద ఉంది.. అదే తుపాకీతో నమిత్ శర్మ కాల్పులు జరిపాడు..! ఫామ్ హౌజ్ లోకి వస్తున్న పోలీసులు భయభ్రాంతులకు గురిచేయడానికే కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ చెప్పినట్లు తెలిసింది..! మొత్తంగా డ్రగ్స్ పార్టీ విషయం పోలీసులకు తెలిసిపోవడంతో... కాల్పులు జరిపి పోలీసులు లోనికి రాకుండా అడ్డుకుని.. వెనుకవైపు నుండి పారిపోవాలని చూసినట్లుగా రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అంశాలను బట్టి తెలుస్తోంది.... అప్పటికే డ్రగ్స్ మద్యం మత్తులో ఉన్న వాళ్లు హఠాత్తుగా పోలీసులు వచ్చిన విషయం తెలిసి ఆందోళనకు గురై ఏదోవిధంగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకోవాలని చూసినట్లు కనిపిస్తోంది.. అయితే కాల్చి పారేయండి ... ఏదైనా నేను చూసుకుంటా అని అరిచింది ఎవరు అనే విషయంలో స్పష్టత రాలేదు.. ఎంపీ మహేష్ అరిచాడని కొంతమంది.. లేదు.. రోహిత్ అరిచాడని ఇంకొంతమంది చెబుతున్నప్పటికీ స్పష్టత మాత్రం రాలేదు..


••••••••••••

A Report By

ShyamaSundar Akula

9010746999

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page