top of page

ఎంపీకి స్టేషన్ బెయిల్..!చంద్రబాబు సీరియస్..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • Mar 15
  • 1 min read

డ్రగ్స్ కేసులో పార్టీ ఎంపీ పట్టుబడటంపై టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం..!


వెంటనే ఆయన నుండి వివరణ తీసుకోవాలని పార్టీ ఏపీ అధ్యక్షుడికి ఆదేశాలు..!


పార్టీ కార్యక్రమాలకు మహేష్ కుమార్ యాదవ్ ను దూరంగా ఉంచాలని చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం..!


పార్టీ పరంగా ఇలాంటి వ్యవహారాలపై కఠినంగా వ్యవహరిస్తామని గతంలోనే హెచ్చరించిన చంద్రబాబు..!


మహేష్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ ప్రస్తుతం మైదుకూరు నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.. గతంలో ఆయన టీటీడీ ఛైర్మన్ గా కూడా కొనసాగారు.. సుధాకర్ యాదవ్ అభ్యర్థనతోనే ఆయన కుమారుడు మహేష్ కు ఏలూరు ఎంపీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు.. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సుధాకర్ యాదవ్ చంద్రబాబు ను కలిసి వివరణ ఇచ్చే అవకాశం ఉంది.. అయితే చంద్రబాబు నమ్మకాన్ని వమ్ము చేసేవిధంగా కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో సుధాకర్ కూడా తీవ్ర షాక్ కు గురైనట్లు తెలుస్తోంది..! ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న కుమారుడు ఇలా ఎంపీగా ఎన్నికైన రెండేళ్లలోనే డ్రగ్స్ కేసులో పట్టుబడి మచ్చ తెచ్చుకోవడంపై ఆయన ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది..!



మహేష్ కు స్టేషన్ బెయిల్..!

మరోవైపు తెలంగాణలో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కి చెందిన మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడిన కేసులో పుట్టా మహేష్ కుమార్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చిన పోలీసులు..!


అందుబాటులో ఉండాలని.. పిలిచినపుడు విచారణకు హాజరవ్వాలని ఆదేశించిన పోలీసులు..!


డ్రగ్స్ కేసులో పట్టుబడిన మొత్తం పదకొండు మందిలో ఎనమిది మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు..!


కాల్పులకు పాల్పడిన వ్యాపారి నితిన్ శర్మ సహా మాజీ ఎమ్మెల్యే.. ఫామ్ హౌజ్ యజమాని పైలట్ రోహిత్ రెడ్డి, అతని సోదరుడు నితిన్ రెడ్డిని ఉప్పరపల్లి కోర్టు లో హాజరు పరిచి రిమాండ్ కు తరలించనున్న పోలీసులు..!


పట్టుబడిన పదకొండు మందిలో ఆరుగురికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది..!


డ్రగ్స్ పాజిటివ్ వచ్చినప్పటికీ పార్లమెంట్ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో మహేష్ కు స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. మరోవైపు


ఫిల్మ్ నగర్ కు చెందిన శ్రీధర్ రెడ్డి భార్య ప్రియాంక రెడ్డికి కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చారు..!


...........

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page