top of page

ముప్పై ఐదు కోట్లు ఇప్పించడానికి ఐదు కోట్ల లంచం. !

  • Writer: Writer Desk
    Writer Desk
  • Aug 8, 2025
  • 1 min read

ముప్పై ఐదు కోట్లు ఇప్పించడానికి ఐదు కోట్ల లంచం. !


ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఈ ఎన్ సీ అవినీతి వ్యవహారం..!


ప్రభుత్వం నుండి రావాల్సిన డబ్బులు తాను ఇప్పిస్తానని ఐదు కోట్లు కమిషన్ ఇవ్వడానికి ఒప్పుకుంటేనే పని చేసి పెడతానంటూ ఓ కాంట్రాక్ట్ సంస్థ యజమాని తో బేరం సాగించిన లంచగొండి అధికారి అబ్బవరపు శ్రీనివాస్..!


తనతో కాకుండా వేరెవరితో పైరవీ చేసినా.. డబ్బులు రాకుండా చేస్తానని హెచ్చరిక..!


ఐదు కోట్లు అంటే మరీ ఎక్కువ అని.. అంత ఇచ్చుకోలేమని.. తగ్గించుకోవాలని కోరిన కాంట్రాక్టర్ సాయి నిర్మాణ సంస్థ అధినేత కృష్ణంరాజు.!


అయితే ఈ నెలాఖరులోనే రిటైర్మెంట్ ఉండటం వల్ల ఆలస్యమైతే మొత్తంగా నష్టపోతానని భావించిన అధికారి శ్రీనివాస్..!

రూ.యాబై లక్షల కమిషన్ పై డబ్బులు ఇప్పించేందుకు అంగీకారం!

ఒక వైపు లంచాధికారితో బేరం సాగిస్తూనే.. మరోవైపు

ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చిన కాంట్రాక్టర్..!


ఒప్పందం ప్రకారం అధికారికి అడ్వాన్స్ మొత్తం రూ.25 లక్షలు ఇచ్చిన కాంట్రాక్టర్..!


డబ్బులు ఇస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు..

విజయవాడ గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఈ ఎన్ సీ శ్రీనివాస్..!


ఇదే శాఖకు సంబంధించిన పనులు చేస్తున్న కాంట్రాక్టర్..!


అధికార హోదాలో మరో ఇరవై రోజులలో గౌరవంగా పదవీ విరమణ చేయాల్సిన సమయంలో పైసల కోసం కక్కుర్తి పడి జైలు పాలైన అధికారి శ్రీనివాస్..!


...

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page