
చార్మినార్ లో షాపింగ్ చేయించి.. చెంగిచెర్లలో రేప్ చేసారు..!
- Writer Desk

- 13 hours ago
- 2 min read
రంజాన్ మాసం ప్రారంభం రోజునే ఒక ముస్లిం కుటుంబంలో అత్యంత విషాదం చోటుచేసుకుంది..
కుటుంబంలోని తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను మాయమాటలతో నమ్మించి తనతో పాటు తీసుకెళ్లిన ముగ్గురు దొంగలు..(ఈ ముగ్గురిలో ఇద్దరు కూడా మైనర్లు..!) షాపింగ్ చేయించి బిర్యానీ తినిపించిన తర్వాత వేరే చోటికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరుగా అత్యాచారం చేసారని తెలుస్తోంది..!
బిర్యానీ లో గంజాయి లాంటి మత్తు పదార్థం కలిపి.. ఆ మత్తులో ఉండగానే బాలికపై అత్యాచారానికి తెగబడినట్లుగా తెలుస్తోంది..
అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం నార్సింగ్ లో ఒక వాచ్ మెన్ కుటుంబం నివసిస్తోంది..

కుటుంబానికి చెందిన బాలిక స్థానికంగా ఉన్న స్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతోంది.. రెండు రోజుల క్రితం బాలిక కనిపించకుండా పోవడంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు అసలు విషయం గుర్తించార...
ముగ్గురు తనకు తెలిసిన యువకులతో అమ్మాయి వెళ్ళిపోయిందని.. ఆమెను ముందుగా చార్మినార్ ప్రాంతానికి తీసుకువెళ్లిన యువకులు.. అక్కడ రెండు గంటల పాటు షాపింగ్ చేశారని.. బాలిక కోసం కొన్ని వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది..!
షాపింగ్ తర్వాత నలుగురు కలిసి ఓ హోటల్ కి వెళ్ళి బిర్యానీ తిన్నారని.. అదే సమయంలో ముందస్తు ప్లాన్ లోబాగంగా బాలిక తినే బిర్యానీలో గంజాయి లాంటి మత్తుమందు కలిపినట్లు తెలిసింది..
ఆ తర్వాత ఆమెను బోడుప్పల్ పరిధిలోని చెంగిచెర్ల ప్రాంతానికి తీసుకువెళ్లి అక్కడ ఓ నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసినట్లు తెలిసింది..
అయితే అప్పటికే మిస్సింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేసి అక్కడికి వెళ్లారు.. బాలికతో పాటు ఇద్దరు నిందితులు పట్టుబడగా మరో నిందితుడు పోలీసులను ముందుగానే గమనించి పరారైనట్లు తెలుస్తోంది..
బాలికను వెంటనే హాస్పిటల్ కు తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు.. పట్టుబడిన ఇద్దరు నిందితులను విచారిస్తున్నట్లు సమాచారం..!
తనపై జరిగిన అఘాయిత్యంపై బాలిక పోలీసులకు వివరించగా నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది..

నిందితులు ముగ్గురు పాత నేరస్తులని చోరీలు చేస్తూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు..
వీరి ముగ్గురిపై పాతబస్తీ భవానీ నగర్ పీఎస్ లో చోరీ కేసు నమోదు అయి ఉన్నట్లు తెలిసింది..!
బాలికతో నిందితులు ఎలా పరిచయం పెంచుకున్నారు.. వాళ్ళతో వెళ్ళేంత క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఎలా ఏర్పడింది తెలియాల్సి ఉంది..!
నిందితులలో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది..!
ముగ్గురు నిందితులు కూడా పాతబస్తీ వాసులే అని తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ఇప్పటికీ మైనర్లు అని సమాచారం..!
సంచలనంగా మారిన ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
మిస్సింగ్ కేసు ఒక చోట.. అత్యాచారం ఘటన జరిగింది మరోచోట కాబట్టి కేసు ఎక్కడ నమోదు చేశారు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు..!
........
A Report By
ShyamaSundar Akula
9010746999
........









Comments