
నగరంలో మళ్లీ ఫైరింగ్..!
- Writer Desk

- 4 days ago
- 1 min read
హైదరాబాద్ : నగరంలో మళ్లీ తుపాకి గర్జించింది.! దోపిడికి వచ్చిన దొంగలు బ్యాంక్ ఏటీఎం వద్ద కాపు కాసి.. డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తిపై కాల్పులు జరిపి మొత్తం ఆరు లక్షలు ఎత్తుకెళ్లారు..!
కోఠి ఎస్బిఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది..

కోఠి ప్రధాన రహదారిలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం.. మొత్తం తెలంగాణ రాష్ట్రానికే ప్రధాన కార్యాలయం.. ఇక్కడ ఏటీఎం మెషీన్లలో ప్రాంగణంలో పెద్దమొత్తంలో డబ్బులు డిపాజిట్ చేస్తుంటారు..
బేగం బజార్.. పాతబస్తీ వ్యాపార కేంద్రాలు.. సుల్తాన్ బజార్ కోఠి వంటి వాణిజ్య వ్యాపార కేంద్రాలకు అనువుగా ఉంటుంది కాబట్టి రోజువారీగా డిపాజిట్లు ఎక్కువగా జరుగుతుంటాయి ఇక్కడ..!

ఈ విషయంపై పూర్తిగా అవగాహన ఉన్న దొంగలు పక్కా ప్లాన్ తోనే తెల్లవారు జాము నుండే అక్కడ కాపు కాసి డిపాజిట్ చేయడానికి వచ్చేవారిని గమనిస్తున్నట్లు తెలుస్తోంది..

రిషద్ అనే వ్యక్తి పెద్దమొత్తంలో నగదు సంచితో రావడంతో దొంగలు పసిగట్టినట్టు తెలిసింది.. అతనిపై
గన్ తో కాల్పులు జరిపి అతని వద్ద ఉన్న మొత్తం రూ.ఆరు లక్షలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.! కాల్పుల వల్ల బుల్లెట్ రిషద్ కలుపైకి దూసుకెళ్లింది.. అతను వెంటనే కిందపడిపోయినట్లు తెలిసింది..

బ్యాంక్ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో. వారు ఎక్కడికి చేరుకుని రిషద్ ను హాస్పిటల్ కు తరలించారు..
క్లూస్ టీమ్ ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు...
బ్యాంక్ ప్రాంగణంలో చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ను ప్రస్తుతం పోలీసులు పరిశీలిస్తున్నారు..
వాళ్ళు నిజంగా దొంగలా.. లేదంటే రిషద్ కు తెలిసిన వాళ్ళా అనే విషయం తెలియాల్సి ఉంది!
••••••









Comments