
పాత పది రూపాయల నోటుతో నాలుగు కోట్లు..!
- Writer Desk

- 6 days ago
- 1 min read
హైదరాబాద్ : స్మగ్లింగ్.. అక్రమ రవాణాలో వందరూపాయలు.. లేదా పది ఇరవై రూపాయల నోటును సగం చించివేసి కోడ్ గా (చెల్లింపు లేదా అప్పగింత ఆధారం) ఉపయోగించుకోవడం సాధారణ విషయమే!
సరిగ్గా అదే తరహాలో తాజాగా నగరంలోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది..
హవాలా రూపంలో డబ్బును హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో శామీర్ పేట్ ఔటర్ వద్ద పోలీసులు కాపు కాశారు.. అయితే పోలీసులను చూసిన నిందితులు వెంటనే అప్రమత్తమయ్యారు. కారు వేగం పెంచారు.. పోలీసులు కూడా వెంటనే వాహనాల్లో కారు ను అనుసరించారు.. మొత్తానికి కొంత దూరం చేజ్ చేసి కారును పట్టుకున్నారు.. అందులో ఎక్కడ చూసిన డబ్బే..సీట్ల కింద టైర్ల పైన డబ్బును దాచి తరలిస్తున్నట్లు గుర్తించారు..
మొత్తం డబ్బుని లెక్కించగా నాలుగు కోట్ల ఐదు లక్షలుగా లెక్క తేలినట్లు సమాచారం..
ముంబై గుజరాత్ నుండి హైదరాబాద్ కు డబ్బు అక్రమంగా తరలిస్తున్నట్లు తెలుస్తోంది.. ఎవరి నుండి ఎవరికి డబ్బు చేతులు మారుతుందని విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది...!

గతేడాది పట్టుబడిన ముగ్గురు హవాలా నిందితులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారని.. అందులో ఒకతను నిజామాబాద్ నుండి హైదరాబాద్ కు పెద్దమొత్తంలో డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చిందని.. దీంతో పోలీసులు పక్కా సమాచారంతో శామీర్ పేట్ ఔటర్ వద్ద కాపు కాసి పట్టుకున్నారని చెబుతున్నారు..
ఈ డబ్బు తరలింపుకు పాత పది రూపాయల నోట్లు కోడ్ గా వినియోగిస్తున్నట్లు తెలిసింది..!
....









Comments