top of page

నగరంలో హవాలా దందా..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • 2 days ago
  • 2 min read

నగరంలో హవాలా మనీ రాకెట్ యదేచ్ఛగా కొనసాగుతుందా..!?

సగం కట్ చేసిన కరెన్సీ తో  డబ్బు చేతులు మార్పిడీ..!

ఈరోజు బయటపడ్డ ఓ వ్యవహారం..!

గోషామహల్ లో దెబ్బెయేడు లక్షలతో పట్టుబడిన ముగ్గురు యువకులు..!

సగం కట్ చేసిన నోట్లు.. భారీగా నగదు పట్టుబడడంతో హవాలా డబ్బుగా భావిస్తున్న పోలీసులు..!

డబ్బుపై లెక్కలు చెప్పలేకపోయిన యువకులు..!

డబ్బు స్వాధీనం చేసుకుని ఐటీ శాఖ అధికారులకు అప్పగించిన పోలీసులు..!

••••••


మంగళవారం ఉదయం గోషామహల్,గ్యాన్ బాగ్ కాలనీలోని గోకుల్ గోల్డ్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ షాప్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురు యువకులను పోలీసులు తనిఖీ చేశారు. వారివద్ద ఉన్న సంచులలో డెబ్బై ఏడు లక్షల నగదు బయటపడింది..!అంతే కాదు వారివద్ద సగం చించి వేసిన ఒక పది రూపాయల నోటు.. మరో ఇరవై రూపాయల నోటు కనిపించింది.! డబ్బుపై ఆరా తీయగా వారు పొంతనలేని సమాధానం చెప్పడంతో పాటు భయం భయంగా తడబడుతున్న వారి తీరు చూసి పోలీసులు మరింత అనుమానించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు.. మరోవైపు స్వాధీనం.చేసుకున్న డబ్బును ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు పంపించారు.



హవాలా దందా అడ్డాలుగా హోల్ సేల్ మార్కెట్లు..!

తెలంగాణలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ బేగం బజార్...


ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కూడా ఇక్కడ దశాబ్దాలుగా హోల్ సేల్ బిజినెస్ చేస్తున్నారు.. గోషామహల్ కు మినీ ఇండియాగా పేరుంది.. హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాలలో హోల్ సేల్ మార్కెట్లు ఉన్నచోట హవాలా బ్లాక్ మనీ దందా కొనసాగుతున్నట్లుగా అందరికీ తెలుసు.. కానీ దందా నడిపేవాళ్లని పెట్టుకోవడం మాత్రం కష్టమే..!

హోల్ సేల్ మార్కెట్లలో వాహనాల్లో.పెద్దమొత్తాల్లో సరుకులు రవాణా చేస్తుంటారు కాబట్టి ఏ వాహనంలో ఏ సరుకు సంచులలో డబ్బు ఉందో..పక్కా సమాచారం ఉంటే తప్ప బయటకి తెలియడం కష్టం..!


లారీలు ట్రక్కుల్లో రాత్రిపూట ఎక్కువగా సరుకును తరలిస్తుంటారు కాబట్టి పోలీసులు వాటిని తనిఖీ చేయడం దాదాపు అసాధ్యమైన పని..! అందువల్లే ఏదో ఒక సోర్స్ నుండి సమాచారం తెలిస్తే తప్పా పోలీసులు హవాలా మనీని పట్టుకోవడం చేయలేకపోతున్నారు..! హైదరాబాద్ తో పాటు అన్ని ప్రధాన నగరాల్లోయిడ్ పరిస్థితి ఉండటంతో.. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసిన హవాలా రాకెట్ కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు..



అనుమానితుల వివరాలు


  • గజరామ్ అధికారి జోటార్మ్,

  • బెహ్రామ్ అధికారి గణపతి రామ్

  • రాకేష్ దేవాసి అధికారి మసురా రామ్


కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. ప్రస్తుతానికి అది హవాలా నగదుగానే భావిస్తున్నామని..


ఎవరికి ఇచ్చేందుకు డబ్బు తీసుకెళ్తున్నారు.. ఎక్కడికి పంపిస్తున్నారు.. ఇక్కడ హవాలా మనీ రాకెట్ నడుపుతున్నది ఎవరు తదితర అంశాలపై దర్యాప్తుచేస్తున్నామని సిఐ బి. శ్రవణ్ కుమార్ తెలిపారు


.....


Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page