top of page

కోడికత్తితో కోసేశాడు..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • Jan 25
  • 1 min read

ప్రియురాలిపై కోపంతో ఆమె ముక్కును కోసేశాడు...

అంతేకాదు.. ముక్కు ముక్కను తనతో పాటు తీసుకుని వెళ్ళిపోయాడు..! పల్నాడు జిల్లాలో ఓ ఉన్మాద ప్రియుడి నిర్వాకం ఇది..!

.........


పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మదర్ థెరిస్సా కాలనీకి చెందిన మరియమ్మ కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తోంది.. భర్తతో విభేదాలు రావడంతో అతనితో కొన్నేళ్లుగా దూరంగా ఉంటోంది.. మరియమ్మకు ఇద్దరూ పిల్లలున్నారు. కొంతకాలం క్రితం మరియమ్మకు పిడుగురాళ్ల మున్సిపాలిటీలో పని చేసే వెంకట్రావుతో పరిచయం ఏర్పడింది.. అది ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని సహజీవనానికి దారితీసింది. కొన్ని నెలలపాటు ఇద్దరు సఖ్యతాగానే జీవనం కొనసాగించారు. తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో వెంకట్రావు కు దూరమైన మరియమ్మ వేరేచోట ఇల్లు తీసుకుని పిల్లలతో కలిసి ఉంటోంది.. వెంకట్రావును ఇంటికి రానీయకపోవడం, బయట కనపడినా కూడా మాట్లాడకపోవడంతో మరియమ్మ పై అతడు కోపం పెంచుకున్నాడు. దీనికి తోడు మరియమ్మ వేరేవాళ్ళకు దగ్గరవుతున్న అనుమానాలు కూడా వెంకట్రావులో మొదలయ్యాయి..



ఎలాగైనా మరియమ్మకు గట్టిగా బుద్ది చెప్పాలనుకున్నాడు...!


ఈ క్రమంలోనే తన స్నేహితుడైన రాజశేఖర్‌తో కలిసి గత గురువారం మరియమ్మ ఇంటి వద్దకు వెళ్ళాడు.. బయటకి పిలిపించి మాట్లాడాలని అనుకున్నాడు. అయితే మరియమ్మ ఒక్కతే ఇంట్లో ఉన్న విషయాన్ని గమనించి ఇంట్లోకి నేరుగావెళ్ళారు. ఆమెతో మాటామాటా పెరగడంతో పెరిగి ఇద్దరిమధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా తన చొక్కలోపల దాచి ఉంచిన కోడి కత్తిని బయటికి తీసి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆమె ముక్కును పై నుండి కిందవరకు మొత్తం తెగ్గోసాడు. ఆ ముక్కను తన వంత తీసుకుని పరుగున అక్కడినుండి ఉడాయించాడు.హఠాత్పరిణమంతో మరియమ్మ తీవ్ర భయంతో వనికిపోయింది.. మరోవైపు ముక్కు మొత్తం కోసేయడంతో తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది.. వెంకట్రావు వెంట వచ్చిన స్నేహితుడు కూడా జరిగిన పరిణామంతో ఒక్కసారిగా అక్కడినుండి పరుగులు పెట్టాడు.!



తీవ్రంగా గాయపడిన మరియమ్మను స్థానికులు పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి నర్సరావుపేట హాస్పిటల్ కు.. ఆ తర్వాత గుంటూరు జిజిహెచ్ కు ఆమెను తీసుకెళ్లారు.


ప్రస్తుతం గుంటూరు జిజిహెచ్ లో ఆమెకు చికిత్స అందిస్తున్నారు..!


.....

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page