top of page

కన్ను మూస్తూ..చిన్నారులకు ప్రాణం పోసిన పసిబిడ్డ..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • 2 days ago
  • 2 min read

కారులో తల్లి ఆడిస్తుంటే గలగలా నవ్వుతూ కేరింతలు కొడుతున్న పదినెలల చిన్నారి చేతులు ఒక్కసారిగా కదిలించడం ఆపేశాయి..

గొంతు మూగబోయింది..

చిన్నారి శరీరం నుండి అక్కడక్కడ గాయలవల్ల బయటకి ఉబికి వస్తున్న నెత్తుటి దారలు...


చిన్నారి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.. అందులో ఉన్న పాపతో సహా తల్లిదండ్రులు తాతయ్య కూడా తీవ్రంగా గాయపడ్డారు..


అయితే చిన్నారికి మాత్రం తల్లి ఒడిలో అదే చివరి ప్రయాణమైంది...

పదినెలలకే ఆ పసిగుడ్డు అనుకోని రీతిలో అమ్మ ఒడిని వీడి మృత్యువు చెంత చేరిపోయింది...


కేరళ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన అందరినీ కలిచి వేసింది..


అయితే ఆ పసిమొగ్గ తమ నుండి వెళ్ళిపోతుందన్న జీర్ణించుకోలేని నిజం ఒక వైపు గుండెను పిండేస్తున్నా.. తల్లిదండ్రులు పరిణతితో ఆలోచించారు...


తమ చిన్నారి అవయవాలను వేరేవాళ్ళకు దానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వేరే పిల్లల జీవితాలను కాపాడిన వాళ్ళం అవుతామని భావించారు.. అంతే కాదు అవయవ దానం ద్వారా తమ బిడ్డ బ్రతికే ఉందనే కాస్తంత ఊరట కలుగుతుందని కూడా భావించారు..



వారి ఆలోచన వెంటనే ఆచరణలోకి వచ్చింది.. పాపను చికిత్స కోసం తీసుకెళ్లిన హాస్పిటల్ ద్వారా మరో అయిదుగురు చిన్నారులకు కావలసిన అవయవాలు అందించడం ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపగలిగారు..!


పది నెలల చిన్నారి అలిన్ షెరిన్ అబ్రహం అతి చిన్న వయసులోనే అవయవదానం చేసిన చిన్నారిగా ఘనత సాధించింది..!


కేరళ రాష్ట్రం పతనంతిట్టలోని మల్లపల్లికి చెందిన అలిన్ షెరిన్ అబ్రహం అనే శిశువు కేరళలో అతి పిన్న వయసులో అవయవ దాతగా అవతరించింది. చిన్నారి అవయవాలు మరో శిశువుతో సహా ఐదుగురికి కొత్త జీవితాన్ని జీవితాన్ని ఇచ్చాయి..


ఆరోజు ఎంజరిగిందంటే..


ఫిబ్రవరి ఐదవ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు కొట్టాయం నుండి తిరువల్లకు ఎం.సి.రోడ్డు మీదుగా ప్రయాణిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అలిన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురుగా వస్తున్న కారు ఒక జంక్షన్ సమీపంలో వీరు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఆ చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెతో పాటు ఉన్న ఆమె తల్లి, తాతయ్య మామయ్యలు కూడా తీవ్రంగా గాయపడ్డారు.


పాపను మొదట చంగనస్సేరి హాస్పిటల్ కి.. తర్వాత తిరువల్ల హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అయితే అక్కడకూడా డాక్టర్లు చేతులెత్తేయడంతో ఫిబ్రవరి 7న కొచ్చిలోని అమృత హాస్పిటల్ కు తరలించారు. అయితే చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు దాదాపు ఆరు రోజులపాటు శ్రమించిన వైద్యులు చివరికి ఫిబ్రవరి 13న బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రకటించారు.!


పాప కోలుకుంటుందేమో అని ఎదురుచూసిన కుటుంబ సభ్యులు ఆ వార్త వినగానే ఒక్కసారిగా గుండెలవిసిపోయేలా రోదించారు..!


అయితే కొంత సమయం తర్వాత చిన్నారి తల్లిదండ్రులు తేరుకున్నారు.. ఇద్దరు కలిసి చర్చించి ఒక గొప్ప నిర్ణయం దిశగా అడుగులు వేశారు...!


ఇతర చిన్నారుల రూపంలో తమ బిడ్డ బ్రతికి ఉందని తృప్తి పడదాం అంటూ చిన్నారి అవయవాలు దానం.చేయడానికి సిద్ధపడ్డారు..


ఆవిధంగా చిన్నారి అవయవాలు దానం చేసే ప్రక్రియకు కార్యాచరణ రూపొందించబడింది...


కాలేయం, మూత్రపిండాలు, గుండె కవాటం, కళ్ళు వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న చిన్నారులకు అందించేలా నిర్ణయించారు..


తిరువనంతపురంలోని కిమ్స్ హాస్పిటల్ లో ఆరునెలల పసిబిడ్డకు కాలేయ సమస్య ఉండడంతో ఆ చిన్నారికి అలిన్ కాలేయాన్ని మార్పిడి చేసారు...


కేవలం ఆరునెలల పసిబిడ్డకు కాలేయ మార్పిడి కూడా మొదటిసారి జరిగినట్లుగా చెబుతున్నారు..


చిన్నారి అలిన్ అవయవదానం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది...!


చిన్నారి తల్లిదండ్రులు అరుణ్ అబ్రహం, తల్లి షెరిన్ ఆన్ జాన్ లు గొప్ప మనసు చేసుకున్నారని.. తమ బిడ్డ అవయవాల ద్వారా మిగతా పసి మొగ్గలకు ప్రాణం పోయాలనే ఆలోచన చేసిన వాళ్లు ప్రాణదాతలని.. దేవుడు వాళ్ళకి గొప్ప హృదయాన్నించాడంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది...


•••••••

A Report By

ShyamaSundar Akula

9010746999

•••••••






వారి దుఃఖం మధ్య, ఆమె ఆమె అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు.

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page