top of page

అందువల్లే యూట్యూబర్ కోమలి సూసైడ్..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • Feb 25
  • 2 min read

చందువుకుంటూనే తన టాలెంట్ కు పదును పెట్టింది.. తక్కువ సమయంలోనే యూట్యూబ్ వీడియోలతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది..!


ఆమె వీడియో షేర్ చేసిందంటే క్షణాల్లోనే వేలసంఖ్యలో వ్యూస్ వచ్చేవి..!


చదువు పూర్తయ్యాక ఫుల్ టైమ్ యూట్యూబ్ వీడియోలపై దృష్టిపెడుతుంది అనుకున్నారు అంతా.. కానీ అంతలోనే ఊహించని న్యూస్ ఆమె అభిమానులను కాలేజీ ఫ్రెండ్స్ ను షాక్ కు గురిచేసింది..!


ఆమె ఎవరో కాదు.. యూట్యూబర్ కోమలి బాను..!

.................


విశాఖకు చెందిన కోమలి హైదరాబాద్ కు వచ్చి మణికొండలోని చిత్రపురి కాలనీలో తన మామయ్య ఇంట్లో ఉంటూ.. మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతోంది..!


ఒకవైపు చదువుకుంటూనే యూత్ ట్రెండింగ్ అంశాలపై యూట్యూబ్ వీడియోలు చేస్తోంది.! ఆమె వీడియోలు ఆకట్టుకునేలా ఉండడంతో తక్కువ కాలంలోనే ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది..!


ఏదో ఒక యూజ్ ఫుల్ కంటెంట్ తో అర్థవంతంగా ఉండే కోమలి వీడియోలకోసం ఫాలోవర్స్ అంతా ఎదురు చూసేవారు..!


కోమలికి మరో యూట్యూబర్ అఖిల్ తో విశాఖ లో ఉండగానే పరిచయం ఏర్పడింది..! ఇద్దరిమధ్య ఫ్రెండ్ షిప్ ఉంది.. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ అఖిల్ వీలు దొరికినప్పుడల్లా యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాడు. అతని వీడియోలకు కూడా యూత్ లో ఆదరణ ఉంది..!


కోమలి హైదరాబాద్ వచ్చాక కూడా అఖిల్ తో స్నేహం కొనసాగించింది.. ఈ క్రమంలో అఖిల్ పై మనసుపడ్డ కోమలి అతన్ని పెళ్ళిచేసుకోవాలని భావించింది..



ఇదే విషయాన్ని అఖిల్ తో చెప్పింది..! అయితే అప్పటికే వేరే అమ్మాయితో లవ్ లో ఉన్న అఖిల్..కోమలి లవ్ ప్రపోజల్ ను నిరాకరించాడు.. దీంతో డిప్రెషన్ లోకి వెళ్ళిన కోమలి కొన్నాళ్ళ క్రితం కూడా ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు తెలిసింది.! అయితే కోమలి ఆత్మహత్య ప్రయత్నంపై ఆమె తల్లి కారణం అడిగి తెలుసుకుంది..! ఒకసారి అఖిల్ తో మాట్లాడింది.. తన కూతురు ప్రేమని అంగీకరించి పెళ్ళిచేసుకోవాలని కోరింది..! అయితే కోమలి తల్లి ప్రతిపాదనను కూడా అఖిల్ నిరాకరించినట్లు తెలుస్తోంది..!


అయితే అఖిల్ పై ఉన్న ప్రేమను చంపుకోలేక.. అతను మళ్ళీ మనసు మార్చుకుని తన ప్రేమను అంగీకరిస్తాడేమో అనే ఆశతో ఎదురుచూస్తున్న కోమలి.. చివరి ప్రయత్నంగా అఖిల్ కు ఫోన్ చేసి మాట్లాడేది ఉంది ఇంటికి రావాలని అడిగింది. దీంతో కోమలి ఉంటున్న ఫ్లాట్ కు అఖిల్ వెళ్ళాడు.. అయితే కోమలి మరోసారి అతనిపై తన ప్రేమను వ్యక్తం చేస్తూ పెళ్ళిచేసుకోవాలని కోరింది.. అయితే అఖిల్ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు.. తాను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని మరోసారి స్పష్టంగా చెప్పాడు.! అఖిల్ కోమలి ఇంటికి వెళ్ళి కలిసి ఇంట్లో నుండి బయటకు వస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.. ఆ వీడియోలో కోమలి డోర్ వద్ద నిలబడి అఖిల్ ను ఇంట్లోకి రావాలని కోరుతున్నట్లుగా కనిపిస్తోంది..!


అఖిల్ మరోసారి ప్రేమను నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కోమలి సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్ కి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది..!


కోమలి మృతి వార్త ఆమె స్నేహితులను.. లక్షల సంఖ్యలో ఉన్న ఆమె అభిమానులను షాక్ కు గురిచేసింది.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న కోమలి కేవలం 21 ఏళ్ల వయసులోనే ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచి వేస్తోంది..



డైరీలో సూసైడ్ నోట్..!


కోమలి తన డైరీలో ఆత్మహత్యకు గల కారణాలను వివరించినట్లు రాయదుర్గం ఇన్స్ పెక్టర్ వెంకన్న మీడియాకు తెలిపారు..


సూసైడ్ నోట్ లో ఇలా ఉంది..

................

"నేను జీవితంలో ముందుకు సాగడానికి భయపడుతున్నా.. అతడు తిరిగి వస్తే? వదిలేయాలని నాకు తెలుసు. అతను నా వాడు కాదనీ తెలుసు. అతను నాతో ఉండటానికి కూడా ప్రయత్నించడం లేదు. కానీ నా హృదయం అతని కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది.. ఇంకా ఆశిస్తూనే ఉంది. ఏదో ఒకరోజు అతను నన్నే ఎంచుకుంటాడని నా మనసు చెబుతోంది. అందుకే ముందుకు సాగడం అసాధ్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే నేను చివరికి వెనక్కి తిరిగి నడిచివెళ్లిన క్షణంలో.. అతను తిరిగొచ్చి నన్ను వెతికితే..." అని ముగించింది..!

.................

ఈ నోట్ చూసాక అతనిపై ఆమెకు ఎంతటి ప్రేమ ఉందో అర్థమవుతోందని.. టాలెంట్ ఉన్న అమ్మాయి.. ప్రేమకోసం పరితపించి చివరికి ప్రేమికుడిని శ్వాసిస్తూనే ఊపిరి తీసుకుందని ఆమె స్నేహితులు కన్నీళ్ళపర్యంతమయ్యారు.!


అఖిల్ తప్పుందా..!


మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడిన కోమలి విషయంలో అఖిల్ తప్పు ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.. ప్రత్యక్షంగా కోమలి ఆత్మహత్యకు అఖిల్ కు సంబంధం లేకపోయినా.. పరోక్షంగా అతను కారణమయ్యాడనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.. అయితే కోమలి విషయంలో గతంలో ఆమెలో ప్రేమ మొలకెత్తేవిధంగా అఖిల్ ఏమైనా ఆశలు కల్పించాడా అనేదే ఇక్కడ ప్రధాన అంశంగా మారింది..


కోమలి సూసైడ్ నోట్ లో ఎక్కడా అలా లేదు కాబట్టి అఖిల్ పాత్రపై ఒక స్పష్టత కోసం.పోలీసులు విచారణ చేస్తున్నారు..


అఖిల్ విషయంలో కోమలి కుటుంబ సభ్యులు.. పోలీసులు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనే విషయం ఆసక్తికరంగా మారింది..!

...........

A Report By

ShyamaSundar Akula

9010746999

7382281818 (WhatsApp)

...........

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page