top of page

ఫిర్యాదు ఎక్కడ మంగ్లీ..!?

Writer: Writer Desk
Writer Desk
Apr 16
1 min read

మంగ్లీ మీడియాను తప్పుదోవ పట్టించారా...!?

ఆరోపణలకు కేంద్రబిందువుగా ఉన్న మైక్రో ఫైనాన్స్ స్కామ్ ప్రధాన నిందితుడు మధు రమావత్ పై ఫిర్యాదు చేయలేదా..!?

నిన్న డీజీపీ ఆఫీస్ కు వెళ్ళి అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ కు ఫిర్యాదు చేసిన అనంతరం.. మీడియాతో మాట్లాడిన మంగ్లీ మొత్తం వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని.. రమావత్ మధు, హేమకాంత్ రెడ్డి, సింగపోగు సుబ్బారావు(న్యాయవాది) తదితరులపై ఫిర్యాదు చేసినట్లు పేర్లతో సహా స్పష్టంగా చెప్పారు..! కానీ అసలు ఫిర్యాదు కాపీలో రమావత్ మధు పేరే లేదు..!



న్యూ - సెన్స్ ప్రత్యేకంగా ఫిర్యాదు కాపీని తెప్పించుకుని పరిశీలించగా ఈ విషయం బయటపడింది..!

అసలు స్కామ్ అంతా మధు చేసినట్లు బాధితులు అంతా చెబుతుండగా.. ఫిర్యాదు కూడా చేయగా మంగ్లీ మాత్రం అతని పై ఫిర్యాదు చేయడానికి ఎందుకు భయపడుతున్నారో తెలియాల్సి ఉంది...!

ఫిర్యాదు చేయకపోవడం వేరు విషయం.. మీడియా ముందు తాను మదుపై ఫిర్యాదు చేసినట్లుగా స్పష్టం వేయడం అనుమానాలకు తావిస్తోంది..!

.......

.....


Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page