
గిదేంది తమ్మీ..ఇరికించేసావా..!
- Writer Desk

- 6 days ago
- 2 min read
సింగర్ గా తక్కువ కాలంలోనే పాపులారిటీ సంపాదించి సినిమాల్లో కూడా నటించి మెప్పించిన మంగ్లీ పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోతున్నారా..!?
ప్రస్తుత పరిణామాలు అలాగే కనిపిస్తున్నాయి..!
మైక్రో ఫైనాన్స్ చీటింగ్ వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు మంగ్లీకి ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తోంది..!
సంచలనం సృష్టించిన మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో మంగ్లీ సోదరుడు శివ చౌహాన్ పాత్ర నిర్ధారణ అవుతున్నట్లు తెలుస్తోంది..!
స్కామ్ సూత్రధారి.. గతంలో కూడా పలు చీటింగ్ కార్యకలాపాలకు పాల్పడిన మధు రమావత్ బ్యాంక్ ఖాతా నుండి శివ చౌహాన్ బ్యాంక్ ఖాతాకు మూడు సార్లు నగదు ట్రాన్స్ ఫర్ అయినట్లు దర్యాప్తులో గుర్తించిన పోలీసులు..!

ఇప్పటికే మధు ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు మధుకు చెందిన అన్ని బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయించారు.. తాజాగా అతని బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించారు..! మైక్రో ఫైనాన్స్ పేరుతో వసూల్ చేసిన డబ్బును ఎవరెవరికి పంపించాడు అనే విషయంపై పరిశీలన చేయగా.. అందులో మూడు సార్లు మధు ఖాతా నుండి మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ బ్యాంక్ అకౌంట్ కు పెద్దమొత్తంలో నగదు ట్రాన్స్ ఫర్ అయినట్లుగా ఉంది.. దీంతో శివ చౌహాన్ బ్యాంక్ అకౌంట్ వివరాలు స్టేట్మెంట్లు ఇవ్వాలని సంబంధిత బ్యాంక్ అధికారులను పోలీసులు కోరినట్లు తెలుస్తోంది..! ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హిమాకాంత్ రెడ్డి సహా మిగతా నిందితులు, మధు ఖాతాల నుండి డబ్బులు ట్రాన్స్ ఫర్ అయిన వారి ఖాతాల వివరాలను పోలీసులు తెప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది..!
మైక్రో ఫైనాన్స్ సహా ఇతరత్రా లాభసాటి వ్యాపారాల ఆశ చూపి ప్రజల నుండి మధు రమావత్, అతని అనుచరులు మొత్తం నూటయాభై కోట్ల వరకు వసూలు చేసినట్లుగా సమాచారం..!
ఇటీవల సుబ్బారావు అనే న్యాయవాది ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది..! ఈ చీటింగ్ వ్యవహారంలో మంగ్లీ సహా ఆమె సోదరుడి ప్రమేయముందని పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సుబ్బారావు కొంతమంది బాధితులు తనను కలిసి సహాయం చేయాల్సిందిగా కోరారని.. అందువల్లే వారి తరపున తాను ఫిర్యాదు చేస్తున్నట్లు పోలీసులకు సుబ్బారావు తెలిపాడు..

తర్వాత సుబ్బారావు పై నార్సింగ్ పీఎస్, పంజాగుట్ట పీఎస్, నగర్ కమిషనర్, డీజీపీ కి ఫిర్యాదు చేసిన మంగ్లీ..! తనను బద్నాం చేయడమే లక్ష్యంగా సుబ్బారావు ,హిమాకాంత్ రెడ్డి తదితరులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంగ్లీ మండిపడ్డారు..! పలు మార్లు ఆమె మీడియా ముందు మాట్లాడిన మంగ్లీ తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని... తన తమ్ముడికి కూడా ఎలాంటి సంబంధం లేదని చెప్పుకున్నారు..! మరోవైపు ప్రధాన నిందితుడు మధు రమావత్ కూడా పోలీసులు అరెస్ట్ చేయడానికి ముందు రెండు వేరు వేరు వీడియోలు విడుదల చేశాడు.. మంగ్లీ కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు..! ఈలోగా మధును పోలీసులు అరెస్ట్ చేయడం.. అతని వ్యవహారాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టడంతో ఒకటొకటిగా కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి..!
రెండు రోజుల క్రితం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన మంగ్లీ సోదరుడు
ఇన్నాళ్లు తనకూ తన సోదరుడికి ఈ స్కామ్ తో సంబంధం లేదని వాదిస్తున్న మంగ్లీకి తాజా పరిణామం పెద్ద షాక్ ఇచ్చినట్లే భావించాలి..! మొత్తంగా ఈ వ్యవహారం మంగ్లీ మెడకు చుట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది..!
•••••••
A Report By
ShyamaSundar Akula
9010746999
•••••••




Comments