top of page

ఏపీ వైపు మావోయిస్టుల పయనం..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • Nov 18, 2025
  • 1 min read

విజయవాడలో మావోయిస్టుల షెల్టర్ జోన్..!


కృష్ణా జిల్లా పెనమలూరు హాట్ టాపిక్ గా మారింది..!


మావోయిస్టుల షెల్టర్ జోన్ గా పెనుమలూరు లోని ఓ భవనాన్ని ఎంచుకుని కొంతకాలంగా ఇక్కడ నివాసముండటమే ఇందుకు కారణం..!


ఒకవైపు రాష్ట్రంలోని అల్లూరి జిల్లాలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గెరిల్లా యుద్ధ వ్యూహాల నిపుణుడు హిడ్మా సహా ఆరుగురి ఎన్కౌంటర్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సమయంలో అదే ఏపీ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో మావోయిస్టు షెల్టర్ జోన్ బయటపడటం ప్రకంపనలు సృష్టిస్తోంది..

భవనంలో ఏకంగా 32 మంది మావోయిస్టులు.. అందులో నలుగురు కీలక నేతలు ఉన్నట్లు షెల్టర్ పొందుతున్నట్లు బయటపడటం విస్మయ పరుస్తోంది..

మొత్తం 21 మంది మహిళలు, మిగతా 11 మంది పురుషులు పట్టుబడినట్లు తెలిసింది..!


హిడ్మా డైరీలో వివరాల ఆధారంగా..!

అయితే వీరి ఆచూకీ వివరాలన్నీ ఎన్కౌంటర్ లో మృతి చెందిన హిడ్మా ఉపయోగిస్తున్న డైరీ లో రాసి ఉందని.. అందులో ఉన్న వివరాల ఆధారంగానే ఏపీ గ్రేహౌండ్స్ ఆక్టోపస్ పోలీసులు పెనుమలూరులోని భవనంపై మెరుపు దాడి చేసి మావోయిస్టులను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది..!

ఉదయం ఏడు గంటల సమయంలో అల్లూరి జిల్లాలో ఎన్కౌంటర్ జరిగిన వెంటనే.. గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బృందాలు పెనుమలూరులో మావోయిస్టులు షెల్టర్ పొందుతున్న భవనాన్ని చుట్టుముట్టినట్లుగా తెలుస్తోంది..!


వారంతా ఛత్తీస్ ఘడ్ కు చెందినవాళ్లే..!


విజయవాడ పెనమలూరు లోని భవనంలో షెల్టర్ పొందుతున్న మావోయిస్టులందరూ ఛత్తీస్ ఘడ్ కు చెందినవల్లేనని పోలీసుకు తెలిపారు. వారి పూర్తి వివరాలు ఇంకా సేకరించాల్సి ఉందని చెప్పారు. ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టుల కదలికలపై నిఘా పెరగడంతో.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారని.. ఈ క్రమంలోనే ఇక్కడ కూడా షెల్టర్ ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోందని మరో అధికారి తెలిపారు. పెనుమలూరు మావోయిస్టు షెల్టర్ జోన్ కు సంబంధించిన సమాచారం ఒక మహిళా మావోయిస్టు ద్వారా తెలిసిందని కూడా సమాచారం వస్తోంది.. పట్టుబడిన మావోయిస్టు మహిళా సభ్యురాలు విజయవాడ లో మావోయిస్టుల కదలికలు షెల్టర్ జోన్ పొందుతున్న చిరునామాలపై ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది..!

తాజాగా ఏలూరు కాకినాడ తదితర ప్రాంతాల్లో పలువురు మావోయిస్టు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది.!

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page