
పోలీస్ మిస్సింగ్..!
- Writer Desk

- 3 days ago
- 2 min read
హెడ్ కానిస్టేబుల్ అదృశ్యం..!
డీసీపీ గన్ మెన్ తిట్టడం వల్ల మనస్థాపం..!
ఫిర్యాదు చేసినా పట్టించుకొని అధికారులు..!
మనస్థాపంతో ఉద్యోగానికి రాజీనామా..!
శనివారం సాయంత్రం నడుచుకుంటూ వెళ్ళిపోయిన సురేష్..!
ఇంటికి రాకపోవడంతో భార్య ఆందోళన..!
మిస్సింగ్ కేసు.. తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు..!
••••••
హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ షీ-టీమ్స్ విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సురేష్ నిన్న సాయంత్రం నాలుగు గంటలనుండి కనిపించకుండా పోయాడు..
విధి నిర్వహణలో కార్యాలయంలో ఉన్న సమయంలోనే శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన బైక్ తాళం చెవి కూడా తన టేబుల్ పై పెట్టి అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు..
రాత్రి ఇంటికి చేరకపోవడంతో సురేష్ భార్య అధికారులకు. ఫోన్ చేసి అడగడంతో విషయం బయటకు వచ్చింది.. అధికారులు వెంటనే కార్యాలయం బయట ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు.. అందులో అతను ట్యాంక్ బండ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా కనిపించింది... అలాగే ట్యాంక్ బండ్ దాటి హైడ్రా కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఫుటేజ్ లో కనిపించాయి..

మధ్యలో రెండు చోట్ల ట్యాంక్ బండ్ రైలింగ్ ఎక్కి అటూ ఇటూ ఎవరైనా వస్తున్నారా అని చూసి మళ్ళీ రైలింగ్ దిగి వెళ్ళిపోవడం కనిపించింది..
హైడ్రా ఆఫీసు దాటిన తర్వాత సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల అక్కడి నుండి ఆయన ఎక్కడికి వెళ్లింది కనిపించలేదు..!
సురేష్ భార్య ఫిర్యాదుతో లేక్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసి వెతుకుతున్నట్టు తెలిసింది..!
అతను తన బైక్ వదిలిపెట్టి..ఇంటిదగ్గర నుండి తెచ్చుకునే లంచ్ బాక్స్.. కీస్ టేబుల్ పైన వదిలేసి.. ఒంటరిగా బయటకు నడుచుకుంటూ వెళ్ళడం..మరోవైపు ట్యాంక్ బండ్ పై వెళ్తూ రెండు సార్లు రైలింగ్ ఎక్కి అనుమానాస్పదంగా వ్యవహరించడం సీసీ ఫుటేజ్ లో చూసిన అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది...!
డీసీపీ గన్ మెన్ వల్లే తీవ్ర మనస్థాపం..!
సురేష్ తీవ్ర మనస్థాపానికి గురికావడం వెనుక బలమైన కారణం ఉందని తెలిసింది..! ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ వద్ద గన్ మెన్ గా పనిచేస్తున్న వ్యక్తి సురేష్ ను నీతిమాలిన పని చేయమని అడగడమే కాకుండా అందరిముందు సురేష్ ను తీవ్ర పదజాలంతో దూషించినట్లు తెలిసింది.. అంతే కాదు.. సురేష్ కుటుంబ సభ్యులను కూడా అతడు దూషించినట్లు తెలిసింది..! ఒక యువతి ఫోన్ నెంబర్ డేటా.. వివరాలు ఇవ్వాలని గన్ మెన్.. సురేష్ ను అడిగినట్లు తెలిసింది.. అయితే అనధికారికంగా అలా ఇవ్వడం కుదరదని సురేష్ చెప్పడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన గన్ మెన్ తీవ్రంగా దూషించినట్లు సమాచారం..!
ఈ విషయంలో గన్ మెన్ పై ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏసీపీ.. డీసీపీలకు లిఖిత పూర్వకంగా సురేష్ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.. అయితే రోజులు గడుస్తున్నా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా..కనీసం అధికారులు అతన్ని పిలిచి మందలించలేదని తెలిసింది..
చట్ట విరుద్ధంగా వ్యవహరించిన గన్ మెన్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల సురేష్ మనస్థాపానికి గురైనట్లు తెలిసింది..!
విధి నిర్వహణలో చాలా సిన్సియర్ గా నిక్కచ్చిగా వ్యవహరిస్తాడనే పేరున్న సురేష్.. గన్ మెన్ తీరు.. అధికారుల తీరుతో తీవ్ర మనస్థాపానికి గురై తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు.. రాజీనామా లేఖ కూడా అధికారులకు ఇచ్చినట్లు తెలిసింది..
అయినప్పటికీ అధికారులు ఏ మాత్రం స్పందించకపోవడంతో నిన్న అలా బయటికి వెళ్లిపోయాడని తెలిసింది..!
సురేష్ మిస్సింగ్ మిస్టరీపై ఉత్కంఠ నెలకొంది.. అతని ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం..!




Comments