top of page

కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ లో ఏముందంటే..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • Feb 28
  • 1 min read

కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య..!

సూసైడ్ నోట్ లభ్యం..!


వికారాబాద్ లో విషాదం నెలకొంది. పట్టణంలోని గంగారాం సాయి బాబా కాలనీలో మహిళా కానిస్టేబుల్ బలిజ దివ్య ఆత్మహత్య చేసుకుంది.


బలిజ దివ్య కోటపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది. ధరూర్ సీఐ కార్యాలయానికి ఆమె అటాచ్ గా పనిచేస్తోంది. శనివారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



మానసిక ఒత్తిడే కారణమా..?

అయితే ఆత్మహత్యకు ముందు దివ్య సూసైడ్ లెటర్ రాసిపెట్టింది.. అందులో నా చావుకు ఎవరు కారణం కాదు. మెంటల్ స్ట్రెస్ తట్టుకోలేకనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రాసుకొచ్చింది. నాన్న ఉంటే బాగుండు అమ్మ..! నాన్న లేనందుకే నాకు ఇన్ని కష్టాలు. అమ్మ నేను నీకు భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించు అమ్మ అంటూ దివ్య రాసిన లెటర్ కన్నీళ్లు పెట్టిస్తోంది. కష్టపడి చదివి ఉద్యోగం సాధించి అర్థాంతరంగా తనువు చాలించడంతో మహిళా కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

...........


Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page