top of page

ఎంపీ అడ్డంగా బుక్కయ్యాడా..!?ఫామ్ హౌజ్ పెర్మనెంట్ గా సీజ్ చేస్తారా..!?

Writer: Writer Desk
Writer Desk
Mar 15
1 min read

పొలిటికల్ డ్రగ్స్ పార్టీ. !


మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది..!


ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమిలోని టీడీపీకి చెందిన ఓ ఎంపీ ఈ కేసులో పట్టుబడడమే ఇందుకు కారణం..!


ఇంతకీ ఎంపీ డ్రగ్స్ తీసుకున్నారా. ?

డ్రగ్స్ టెస్ట్ లో ఆయనకు నెగెటివ్ వచ్చిందని ఈగల్ అధికారులు చెప్పింది నిజమేనా. !


మొయినాబాద్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్. చోటుచేసుకుంది..!


ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎంపీ కి నిర్వహించిన డ్రగ్స్ కేసులో నెగిటివ్ వచ్చిందని వార్తలు వచ్చాయి..!



అయితే అది సరికాదని.. ఆయన కూడా డ్రగ్స్ తీసుకున్నట్లుగా తాజాగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఎస్పీ బయట పెట్టారు..!


ఎస్పీ గిరిధర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా ఈగల్ ఫోర్స్ నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్ లో ఏలూరు ఎంపీ మహేష్ కు నెగెటివ్ వచ్చిన విషయం వాస్తవమే అన్నారు.. అయితే మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహా ఇతరులకు నిర్వహించిన టెస్ట్ లో వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలిందని.. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణలో భాగంగా ఎర్రగడ్డ హాస్పిటల్ లో మరోసారి అందరికీ డ్రగ్స్ పరీక్షలు చేయగా అందులో ఎంపీ మహేష్ కు పాజిటివ్ వచ్చిందని... హాస్పిటల్ లో నిర్వహించే డ్రగ్స్ టెస్ట్ ను అధీకృతంగా భావించాల్సి ఉంటుందని.. దీని ప్రకారం ఎంపీ గుత్తా మహేష్ డ్రగ్స్ సేవించినట్లుగా నిర్ధారించామని గిరిధర్ తెలిపారు..!


దీంతో ఇప్పటివరకు ఎంపీ డ్రగ్స్ తీసుకోలేదని.. ఒక కాంట్రాక్ట్ పనిమీద హైదరాబాద్ వచ్చిన ఆయన కేవలం రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో నిర్వహించిన కీలకమైన సమావేశానికి మాత్రమే హాజరయ్యారంటూ కూటమి నేతలు చెబుతున్నది అబద్ధమని తేలిపోయింది..!


ఏపీలో రాజకీయ ప్రకంపనలు..!

ఏలూరు నుండి ఎంపీగా తొలిసారి ఎన్నికైన టీడీపీ ఎంపీ గుత్తా మహేష్ కుమార్ ఇలా తెలంగాణ లో డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోవడం ఒక్కసారిగా కూటమి నేతలను కుదిపేసింది..!


రాజకీయంగా అలజడి రేపుతోంది.. టీడీపీ ఎంపీ డ్రగ్స్ సేవించి దొరికిపోవడంపై ప్రతిపక్ష వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.. రేపిస్టులు కిల్లర్లు డ్రగిస్టులు కూటమి పార్టీల్లో ఉన్నారని తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతోంది..



ఫామ్ హౌస్ సీజ్..!

అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ ను పూర్తిగా సీజ్ చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది..! నిన్నటి ఘటనపై సీపీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి.. ఫామ్ హౌజ్ ను సీజ్ చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది..!



......


....

Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page