top of page

మా ఇద్దరిని స్కూల్ బస్సు చంపేసింది..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • 1 day ago
  • 2 min read

పొద్దున్నే నాన్నతో కలిసి స్కూటర్ మీద వెళ్ళి ఇంటిదగ్గడ ఉండే షాప్ లో పాలు తీసుకురావడానికి ఉత్సాహపడిన రెండేళ్ల చిన్నారి వర్ష.. తన అత్త కూతురు నాలుగేళ్ల చిన్నారి భాను ను కూడా తనవెంట రావాలని మారం చేసింది.. దీంతో వర్ష తండ్రి నాగన గౌడ వీరిద్దరిని తన స్కూటర్ పై కూర్చోబెట్టుకుని మిల్క్ షాప్ కు వెళ్లేందుకు బయలుదేరాడు. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు నాగన గౌడ..!


అప్పటికీ సమయం ఎనమిది కావొస్తోంది..!


బైక్ పై వీరు వెళ్తుండగా చౌరస్తాలా ఉన్న వీధి మలుపులో ఎడమవైపు రోడ్డు నుండి ఒక ప్రైవేట్ స్కూల్.బస్సు వస్తుండడంతో నాగన్ గౌడ తన స్కూటర్ ను ఆపాడు...


అయితే పూర్తిగా నిర్లక్ష్యంగా బస్సును డ్రైవర్ ఒక్కసారిగా వీరి స్కూటర్ ఉన్నవైపు మలుపు తిప్పడంతో మలుపులో ఆగి ఉన్న వీరి స్కూటర్ ను బస్సు సైడ్ నుండి ఢీకొట్టింది.. దీంతో స్కూటర్ ఒక్క కుదుపుతో కిందపడిపోగా.. ఇద్దరు చిన్నారులు బస్సు వెనుక చక్రాల కిందకి వెళ్లిపోయారు. చక్రాలు వారి శరీరంపైనుండి వెళ్లిపోవడంతో పూర్తిగా చిద్రమైపోయి అక్కడికక్కడే చిన్నారులు ప్రాణాలు విడిచారు...!



క్షణాల్లోనే ఇదంతా జరిగిపోయింది...


అప్పటిదాక తనతో పాటు సరదాగా స్కూటర్ పై మాట్లాడుతూ సరదాగా ఏవో మాట్లాడుతూ వచ్చిన చిన్నారులు కళ్ళముందే ప్రాణాలు కోల్పోయి విగత జీవులుగా పడి ఉండటం చూసి నాగన గౌడ తీవ్ర షాక్ కు గురయ్యాడు.. ఆయన ఇప్పటికీ కోలుకోలేదని.. షాక్ నుండి తేరుకోలేకపోతున్నారని వైద్యులు తెలిపారు...


పొద్దున పొద్దున్నే.. చలి చలి వాతావరణంలో ప్రశాంతంగా ఉన్న కాలనీలో అత్యంత విషాదకరంగా ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా అందరినీ తీవ్రంగా కలిచి వేసింది...

పోలీసు క్వార్టర్స్ కావడంతో అందరూ నాగన గౌడ కు తెలిసిన స్నేహితులు మిత్రులు తెలిసిన వారే అక్కడ నివసిస్తున్నారు...


వారంతా విధులకు వెళ్లకుండా నాగన గౌడ కుటుంబానికి బాసటగా నిలిచారు...



నాగన గౌడకు ఉంది ఇన్నోవా లాంటి స్కూటర్ కావడంతో ఇద్దరు పిల్లలను సీటు హ్యాండిల్ కు మద్యలో ఉండే ఖాళీ ప్రదేశంలో నిలబెట్టుకున్నాడు.. ప్రమాదం జరిగిన సమయంలో వీరు ముందు భాగంలో ఉన్నారు కాబట్టి క్రిందపడుతూనే బస్సు వెనుక చక్రాల కిందకి వెళ్ళిపోయారు..


జరిగిన ఘటనపై నాగన గౌడ కుటుంబసభ్యులు స్నేహితులు ఫిర్యాదు చేశారు..


పూర్తిగా బస్సు డ్రైవర్ నిర్లక్షం.వల్లే ఈ విషాదం.చోటుచేసుకోవడంతో బస్సు డ్రైవర్ సహా అలాంటి డ్రైవర్లను నియమించి స్కూల్ బస్సులు అప్పగించిన స్కూల్ యాజమాన్యంపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు..


బెంగుళూరు నార్త్ ఈస్టర్న్ లో ఉన్న ఆర్కే హెగ్డే నగర్ పోలీస్ క్వార్టర్స్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది...


హెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రాంతం ఉంది.. బస్సు డ్రైవర్ మారెప్ప ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు...


•••••••

A Report By

ShyamaSundar Akula

9010746999

•••••••


....

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page