top of page

కన్నతల్లి కళ్ళముందే ప్రాణాలు విడిచిన చిన్నారి..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • Jan 21
  • 1 min read

సికింద్రాబాద్.. తిరుమలగిరి పరిధిలోని ఆర్మీస్కూల్ వద్ద ప్రమాదం జరిగింది

కుమారుడిని తల్లి స్కూల్‌కు తీసుకెళ్తుండగా స్కూటీ అదుపుతప్పడంతో ఇద్దరు కిందపడిపోయారు.. అదే సమయంలో వెనుక వస్తున్న ఆర్మీ వాహనం ఎడమవైపు ముందు టైర్ బాలుడి శరీరంపైనుండి వెళ్లడంతో బాలుడు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాడు.బాలుడి తల్లికి కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.

ఆర్మీ స్కూల్ లో ఒకటో తరగతి చదువుతున్న కుమారుడిని స్కూల్ లో దింపడానికి తీసుకు వస్తున్న క్రమంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

ఘటన స్థానికంగా.. ఆర్మీ స్కూల్ లో తీవ్ర విషాదాన్ని నింపింది..



గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలిన చిన్నారి..!


బుధవారం నగరంలో చోటుచేసుకున్నఅత్యంత విషాద ఘటన ఇది..

స్కూల్ కు తొందరగా వెళ్ళాలనే ఆతృతతో ఆర్మీ వాహనం పక్కనుండి ఓవర్ టేక్ చేయబోయినట్లుగా అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను బట్టి అనిపిస్తోంది..!

ఓవర్ టేక్ చేస్తూన్న సమయంలో పొరపాటున ఆర్మీ వాహనం తగిలి కింద పడిపోయారా? లేక.. రోడ్డు పక్కన ఉన్న ఇసుక మట్టిలో స్కూటీ టైర్లు జారడంతో అదుపుతప్పి కిందపడిపోయారా..? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది..


రోడ్డు కు ఇవతలి వైపు సీసీ కెమెరాలు ఉన్నందున.. ఘటన ఎలా జరిగింది అనే విషయంపై స్పష్టత రావడం లేదు.. వాళ్ళు కిందపడిన క్షణంలోనే ఆర్మీ ట్రక్ టైర్ బాలుడి శరీరం పైనుండి వెళ్లడంతో.. రెండు మూడు క్షణాల్లోనే ఘోరం జరిగిపోయినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన మహిళను హాస్పిటల్ కు తరలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. ఆర్మీ వాహనం నడుపుతున్న డ్రైవర్ ను విచారిస్తున్నట్లు సమాచారం..!


చిన్నపిల్లాడు.. టైర్ శరీరం పైనుండి వెళ్ళాక క్షణాలపాటు గిల గిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచిన దృశ్యం హృదయవిదారకంగా ఉంది...


చూసేవాళ్లకు ఇలా ఉంటే...

పాపం ఆ తల్లి మానసికంగా ఎంత విలవిలలాడిందో...


కన్న కొడుకును తన చేతులారా కోల్పోయినట్లు అయింది...


Report by

ShyamaSundar Akula

9010746999


Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page