
క్రికెటర్ షమీ విడిపోయిన భార్యకు ఆ.. పిచ్చి..!
- Writer Desk

- 40 minutes ago
- 2 min read
ప్రేమించింది..పెళ్లి చేసుకుంది..
బిడ్డ పుట్టేవరకు ప్రేమ నటించింది.. తర్వాత అసలు రంగు చూపించింది..!
ఆమెకు మనిషికంటే డబ్బే ముఖ్యం..!
కోట్లు సంపాదిస్తున్నాడని పక్కా ప్లాన్ చేసి జీవితంలోకి ఎంటర్ అయ్యింది.!
బిడ్డపడితేనే తన ప్లాన్ సక్సెస్ అవుతుంది అనుకున్నట్లుంది..!
అనుకున్నట్లే ఆమె ప్లాన్ సక్సెస్ అయింది..!
బిడ్డ పుట్టిన తర్వాత భర్తతో సహా అతని కుటుంబంపై వేధింపుల కేసు పెట్టింది..!
తాను విడిపోతాననని నెలకు నాలుగు లక్షలు తనకు, బిడ్డకు కలిపి నిర్వహణ ఖర్చులు చెల్లించాలని కోర్టులో పిటిషన్ వేసి నెలకు నాలుగు లక్షలు ఇచ్చేలా కోర్టు నుండి ఆదేశాలు తెప్పించుకోగలిగింది..!
ఇపుడేమో నెలకి నాలుగు లక్షలు భరణం సరిపోవట్లేదు.. పదిలక్షలు ఇవ్వాలంటూ మరోసారి అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది...!
పైగా..ఆయన సంపాదనకు ఇది ఒక లెక్క కాదని.. లక్జరీ లైఫ్ కోసం కోట్లు ఖర్చు చేయొచ్చు కానీ మాకు పదిలక్షలు ఇవ్వలేడా..? అని లెక్కలు వేసుకుంటూ ప్రశ్నలు కూడా వేస్తోంది..!
••••••

భారత క్రికెటర్ మహమ్మద్ షమీ విడిపోయిన భార్య హసీనా జహాన్ వ్యవహారమిది..!
ఆమెకు నెలసరి ఖర్చుల కోసం రెండున్నర లక్షలు.. పదేళ్లు కూడా లేని చిన్నారి నెలసరి ఖర్చుల కోసం లక్షన్నర ప్రత్యేకంగా ఇస్తున్నా..ఇంకా సరిపోవట్లేదు అంటూ కోర్టు మెట్లెక్కడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి...
షమీని చూసి కాదని.. అతని సంపాదన చూసి పెళ్ళిచేసుకుని ఇలా డబ్బుల కోసం.వేషాలు వేస్తోంది అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..!
2014లో ఇస్లామిక్ సంప్రదాయంలో వివాహం..
మహమ్మద్ షమీ - హసిన్ జహాన్ లది ప్రేమ వివాహం..!
ఇస్లామిక్ ఆచారాలు సంప్రదాయాలను అనుసరించి ఏప్రిల్ 7, 2014న వివాహం చేసుకున్నారు.
ఈ దంపతులకు జూలై 17, 2015న ఒక కుమార్తె జన్మించింది. బిడ్డ పుట్టిన తర్వాత కొన్నాళ్ళు సజావుగానే ఉన్న జహానా 2018 లో కోర్టుకు వెళ్ళింది..,!షమీ సహా అతని కుటుంబ సభ్యులు మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారని.. తన బిడ్డ ను కూడా వేధింపులకు గురిచేస్తున్నారని కోర్టు లో పిటిషన్ వేసింది.. గృహహింస చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరింది.. మహిళల రక్షణ చట్టం, 2005లోని సెక్షన్ 12 కింద కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించడంతో.. మార్చి 8, 2018న ఐపీసీ సెక్షన్లు 498A, 328, 307, 376, 325 మరియు 34 కింద జాదవ్‌పూర్ పిఎస్ లో షమీ సహా కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.. గృహహింస ఫిర్యాదుతో పాటు తాను వేరుగా ఉండేందుకు అనుమతి ఇస్తూ తనకు బిడ్డకు నెలసరి నిర్వహణ ఖర్చులు ఇప్పించాలని కోరుతూ జహానా
సీఆర్పీసీ సెక్షన్ 125 కింద భరణం పిటిషన్ కూడా దాఖలు చేసింది.
ఆగస్టు 2019లో, అలిపోర్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ షమి మరియు అతని బంధువులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. తరువాత సెషన్స్ కోర్టు ఈ చర్యలను నిలిపివేసింది. నాలుగేళ్లు వర్తించేలా స్టే ఇచ్చింది..దీంతో జహానా హైకోర్టులో ఈ ఉత్తర్వును సవాలు చేసింది. అయితే ఆమె పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది..! దీంతో ఆమె గడువు స్టే ఎత్తివేయని కోరుతూ సుప్రీమ్ కోర్టు ను ఆశ్రయించింది..,!

2023లో, షమీ మరియు అతని బంధువులపై వారెంట్లకు సంబంధించిన చర్యలను ఒక నెలలోపు పరిష్కరించాలని సెషన్స్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
దీంతో కలకత్తా హైకోర్టు కేసును విచారించి నెలకు నాలుగు లక్షలు నిర్వహణ ఖర్చుల కింద ప్రతీ నెలా పంపించాలని.. ఇందులో రెండున్నర లక్షలు భార్య జహానా ఖర్చుల కోసం.. లక్షన్నర కుమార్తె నిర్వహణ కోసం చెల్లించేలా షమీ ని ఆదేశిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది..అప్పటి నుండి షమీ నెలకు నాలుగు లక్షలు చెల్లిస్తున్నాడు..
కేసు ను ఢిల్లీకి బదిలీ చేయాలని జహనా కోర్టు ను కోరింది.. షమీ కుటుంబం ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లో నివసిస్తున్నందున ఆయన సులువుగా డిల్లీ కి వచ్చి వెళ్లగలుగుతాడని.. విచారణలో ఉన్న గృహహింస కేసు.. భరణం కేసులను కలకత్తా నుండి డిల్లీ కి మార్చాలని ఆమె తాజా పిటిషన్ లో కోరింది.. డిల్లీ లో ఖర్చులు పెరిగిపోయాయని.. కుమార్తె కూడా ఎదుగుతున్నందున ఆమె ఖర్చులు కూడా పెరిగిపోయాయని.. అందువల్ల తన ఖర్చులకు ఏడు లక్షలు... కుమార్తె ఖర్చులకు మూడు లక్షలు.. మొత్తం పది లక్షలు నెలసరి భరణం ఇప్పించాలని ఆమె తాజా పిటిషన్ లో కోరారు.. విచారణ చేపట్టిన సుప్రీమ్ కోర్టు షమీకి నోటీసులు జారీ చేసింది..
అమెతీరు వివాదాస్పదం..!
జహానా వ్యవహార శైలిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.. తాను నివసించే చోట.. పెళ్ళికి ముందు కూడా ఆమె అందరితో గొడవలు పడటం.. చీటికి మాటికి ఎదుటివాళ్లపై గొడవలకు వెళ్ళడం చేసేదని తెలుస్తోంది..! అంతే కాదు...! జల్సాలకు అలవాటుపడిన జహానా.. కేవలం తన సరదాలు తీర్చుకోవడం కోసమే షమీ ని పెళ్లిచేసుకుందని.. ఆమెకు ఉన్న డబ్బు పిచ్చి. విలాసవంతమైన జీవితం గడపాలనే కోరికల వల్లే షమీ పరువును బజారున పెట్టి వేరుగా ఉంటూ డబ్బులు డిమాండ్ చేస్తోందని విమర్శలు చేస్తున్నారు..!
•••••
A Rrport By
ShyamaSundar Akula
9010746999
••••••









Comments