top of page

సీఎం సీరియస్..! సిట్ దర్యాప్తుకు ఆదేశం..!

Writer: Writer Desk
Writer Desk
Mar 17
2 min read


డ్రగ్స్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్..!


డ్రగ్స్ సోర్స్ కు చెక్ పెట్టే దిశగా చర్యలు..!


పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ లో జరిగిన ఘటనపై లోతుగా దర్యాప్తుకు ఆదేశం..!


డీసీపీ యోగేష్ గౌతం నేతృత్వంలో సిట్ ఏర్పాటు..!


ఫామ్ హౌజ్ కేంద్రంగా కొనసాగిన డ్రగ్స్ దందాపై పూర్తి స్థాయిలో విచారణ జరపనున్న సిట్..!


గతంలో ఫామ్ హౌజ్ కేంద్రంగా చోటుచేసుకున్న ఘటనలపై కూడా వివరాలు సేకరించనున్న సిట్..!


డ్రగ్స్ పార్టీ నిర్వహించడమే కాకుండా ఏకంగా పోలీసులపై కాల్పులు జరపడంపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం..!


సిట్ దర్యాప్తుతో రోహిత్ అక్రమ దందాలు డ్రగ్స్ బిజినెస్ వ్యవహారాల గుట్టు మొత్తంగా బయటకు వచ్చే అవకాశం..!


రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోమ్ శాఖ వ్యవహారాలు కూడా చూస్తున్నారు..! ఫామ్ హౌజ్ డ్రగ్స్ వ్యవహారం ప్రభుత్వాన్నిఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది .!


నిజానికి ఈ వ్యవహారం బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌజ్ లో కాకుండా ఇంకో చోట జరిగి ఉంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ నానా యాగి చేసి ఉండేది.. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాకుండా నగర శివార్లలో ఔటర్ కు దగ్గరలో ఉన్న ఫామ్ హౌజ్ లో ఇంత పెద్ద వ్యవహారం నడుస్తున్న వైనం నిజంగానే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే వ్యవహారమే..! అయితే తాజా వ్యవహారంలో గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే అటు ఆంధ్రాలో అధికారంలో ఉన్న టీడీపీ ఎంపీ కూడా దొరికిపోవడంతో రాజకీయంగా గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితి..!


అసెంబ్లీ సమావేశాలకు ముందు రోజు ఈ వ్యవహారం బయటికి రావడంతో ఒకవిధంగా బీఆర్ఎస్ పార్టీ కాస్త డిఫెన్స్ లో పడిపోయింది..!


రాజకీయాల మాట ఎలా ఉన్నా.. ప్రస్థుత పరిస్థితుల్లో సిట్ ఏర్పాటుతో నగరంలో రాష్ట్రంలో డ్రగ్స్ మూలాలపై లోతైన దర్యాప్తు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న వైనం శుభ పరిణామమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు..!



• వదిలించుకోక తప్పదా..!

మరోవైపు అటు టీడీపీ ఇటు బీఆర్ఎస్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన తమ నాయకులను వదిలించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది..!

డ్రగ్స్ లో ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడిన విషయం తెలిసిన వెంటనే చర్యలకు ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు.. మహేష్ కు షోకాజ్ నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలని పార్టీ కార్యక్రమాలకు అధికార కార్యక్రమాలకు దూరంగా ఉండేలా నోటీస్ ఇవ్వాలని ఆదేశించడంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు మహేష్ కు షోకాజ్ నోటీస్ ఇచ్చారు...


ఇటు బీఆర్ఎస్ కూడా కాస్త ఆలస్యంగా అదే తరహాలో స్పందించింది.. పైలెట్ రోహిత్ రెడ్డి కి షోకాజ్ నోటీస్ ఇచ్చింది.. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది..!


డ్రగ్స్ పార్టీ నిర్వహించింది రోహిత్ కాబట్టి.. అది కూడా ఆయన సొంత ఫామ్ హౌజ్ లో కాబట్టి రోహిత్ వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారింది..! షోకాజ్ నోటీస్ విషయంలో జాప్యం చేయడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..!


మొత్తంగా రెండు పార్టీల నేతలు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే అటు ఎంపీ పుట్టా మహేష్.. ఇటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ లను పార్టీల నుండి సస్పెండ్ చేసే అవకాశం ఉంది..!


•••••••••

A Report by

ShyamaSundar Akula

9010746999



Comments


© Copyrights Reserved 2026 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page