ఆత్మహత్య అందుకేనా..!
- Writer Desk
- 10 hours ago
- 2 min read
నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన ఇద్దరు పిల్లలతో సహా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది.. బోడుప్పల్ హరిత హారం కాలనీలో వీరు నివాసముంటున్నారు
పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పిన్నింటి సురేందర్ రెడ్డి విజయశాంతి రెడ్డి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు..
సురేందర్ రెడ్డి దుబాయ్ కు వెళ్లి అక్కడే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.. విజయశాంతి రెడ్డి సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు..

కుమారుడు విశాల్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరం.. కుమార్తె చైతన్య రెడ్డి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.. పరీక్షలు సమీపిస్తుండటంతో ఇద్దరు పిల్లలు కాలేజీ ట్యూషన్ కు వెళుతూ బిజీగానే ఉండేవారు.. విజయశాంతి రెడ్డి కూడా ఉద్యోగం కోసం వెళ్ళడం రావడం.. ఎక్కువగా బిజీగానే కనిపిస్తుండేవారని.. అపుడపుడు వర్క్ ఫ్రం చేస్తున్నప్పటికీ.. ఎక్కువగా ఇరుగు పొరుగు మహిళలతో కలిసే సమయం ఉండేది కాదని తెలుస్తోంది...
ఆర్థికంగా బలంగానే ఉన్నప్పటికీ.. ఆత్మహత్యకు చేసుకోవడానికి గల కారణం ఏంటనేది ఎవరికీ అంతుపట్టడం లేదు..
వారు వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటూ ఎప్పుడూ సంతోషంగానే ఉన్నట్లు కనిపించేవారని.. సడన్ గా ఏమయింది.. ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చింది అనేది తెలియడంలేదు వారు నివసించే విధిలో ఉండేవారు చెబుతున్నారు.. గత ఎనిమిదేళ్లుగా వాళ్ళు ఇక్కడ ఉంటున్నట్లు కాలనీ అధ్యక్షుడు తెలిపారు. వారి కుటుంబంలో ఎలాంటి గొడవలు ఉన్నాయో మాకు తెలియదని.. మృతురాలి సోదరుడు ఫోన్ చేసినా కూడా కారణం తెలియదు అంటున్నారని చెప్పారు..

మొత్తంగా ఉన్న ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు కాబట్టి.. సురేందర్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాతనే అసలు కారణం ఏంటనేది బయటకు తెలిసే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు..
ముగ్గురి ఫోన్లు ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు ముందు ఎంజరిగింది అనే విషయాలపై ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు..
పూర్తి వివరాలు.. ఆత్మహత్యకు కారణాలు తెలియడానికి చాలా సమయం పట్టే పరిస్థితి ఉంది..
దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు..!
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వారు రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది..
రైల్వే పోలీసులు అధికారికంగా అందించిన సమాచారం ప్రకారం....
శనివారం ఉదయం సుమారు 2.30 గంటల సమయంలో చర్లపల్లి సెక్షన్ పరిధిలోని కిలోమీటర్ నంబర్ 206/48 వద్ద గూడ్స్ రైలు లోకో పైలట్ వాకీటాకీ ద్వారా సమాచారం అందించారు. రైల్వే పట్టాలపై ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు రైలు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఐపీఎఫ్, చర్లపల్లి, ఏఎస్‌ఐపీఎఫ్ బిఎస్.రావు, జీఆర్‌పీ సిబ్బంది శ్రీ సాయి ఈశ్వర్ గౌడ్, మాదవ్ (ఎస్‌ఐ) ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. రైల్వే పట్టాల మధ్యలో మూడు మృతదేహాలు తీవ్ర గాయాలతో పడి ఉన్నట్లు గుర్తించారు. మృతులను బోడుప్పల్, హరితహరణం కాలనీకి చెందిన వారుగా గుర్తించారు. గూడ్స్ రైలు లోకో పైలట్ సమాచారం ప్రకారం ఇది ఆత్మహత్య ఘటనగా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే వారి వద్ద ఎలాంటి రైలు టికెట్ లు కనిపించలేదు కాబట్టి కేవలం ఆత్మహత్య చేసుకోవడానికి మాత్రమే రైల్వే ట్రాక్ పైకి వచ్చినట్లుగా భావిస్తున్నారు..! మృతదేహాలను గాంధీహాస్పిటల్ కు తరలించారు..
క్రైమ్ నెంబర్ 57/2026 బీఎన్ఎస్ సెక్షన్ 194 ప్రకారం కేసు నమోదు చేస్తున్నట్లు సికింద్రాబాద్ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) తెలిపారు..
A Report by
ShyamaSundar Akula
9010746999
7382281818 (WhatsApp)
.......





