
వ్యసనాల బారినపడి భర్తను చంపేసింది..!
- Writer Desk

- Jan 20
- 1 min read
జల్సాలకు అలవాటు పడిన మహిళ.. పైగా అక్రమ సంబంధాలు.. తన వెదవ్వేశాలకు అడ్డు చెబుతున్నాడని భర్తపైనే కక్ష కట్టింది... చివరికి కడతేర్చింది..!
కూకట్ పల్లి లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.! కూకట్ పల్లి వివి నగర్ లోని ఈనాడు హైట్స్ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో నివసించే జగ్గవరపు సుధీర్ రెడ్డి ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్య ప్రసన్నతో ఆయనకు కొంత కాలంగా గొడవలు నడుస్తున్నాయి.. రెండు దశాబ్దాల క్రితం 2004 లో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ భార్య బయట జల్సాలకు వ్యసనాలకు అలవాటుకావడం.. అక్రమ సంబంధాలతో పరువు తీస్తున్న వైనంపై సుధీర్ రెడ్డి మందలించాడు.

అయితే భర్తతో గొడవపడుతూ అతనిపై జులుం ప్రదర్శించిన ప్రసన్న మరింత రెచ్చిపోయి బాహాటంగానే ఇతర మగవాళ్ళతో తిరగడం ప్రారంభించింది. దీంతో ఇద్దరిమధ్య వివాదం మరింత ముదిరింది. భర్త తన కార్యకలాపాలకు అడ్డుగా ఉన్నాడని భావించిన ప్రసన్న అతన్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని కుట్ర చేసింది. పక్కా ప్లాన్ తో నెలరోజుల క్రితం గతేడాది డిసెంబర్ 24న ఇంట్లో పడుకుని ఉన్న భర్త గొంతుకు చున్నీ బిగించి హత్య చేసింది.. ఏమీ ఎరగనట్లు విజయవాడలో ఉండే మృతుడి సోదరి సునీతకు ఫోన్ చేసి మీ తమ్ముడు బెడ్ నుండి కిందపడి చనిపోయాడు అని నమ్మబలికింది.. వారు వెంటనే విజయవాడ నుండి వచ్చి ఏం జరిగిందని మరోదారి ప్రసన్నను ప్రశ్నించగా తనకు తెలియదని.. నిద్రలోనే ఉంది బెడ్ పైనుండి కింద పడిపోయాడని తను లేపే ప్రయత్నం చేశానని అయితే అప్పటికే ఆయన మరణించాడని చెప్పింది..!

ప్రసన్న వ్యవహారాలన్నీ తెలిసిన సునీత తన తమ్ముడి చావుకు ప్రసన్ననే కారణమని కేసు దర్యాప్తు చేసి న్యాయం చేయాలని పోలీసు స్టేషన్ లో ఫిర్యాది చేసింది..

కేసు నమోదు చేసిన పోలీసుకు సుధీర్ రెడ్డిని ఆయన భార్యనే చున్నీతో బిగించి హత్యచేసినట్లుగా తేల్చారు.. జల్సాలకు వ్యసనాలకు అలవాటుపడిన ప్రసన్న.. అడ్డుగా ఉన్నాడని భర్తను అంతమొందించిందని తెలిపారు...

ఇదిలా ఉండగా వారం రోజుల క్రితమే మృతుడు తన భార్య వల్ల ప్రాణ హాని ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది..
వ్యసనాలతో పతనమైన మహిళా.. ఇలా సొంత భర్తనే హత్య చేసి కటకటాలపాలు కావడమే కాకుండా.. తన ఇద్దరు పిల్లలకు భవిష్యత్తులేకుండా చేసింది..
••••
A Report by
ShyamaSundar Akula
9010746999
.....









Comments