top of page

అలలతో ఆటలు వద్దు..!జలపాతంలో కొట్టుకుపోయిన యూట్యూబర్..!

  • Writer: Writer Desk
    Writer Desk
  • Aug 24, 2025
  • 1 min read

హైదరాబాద్ : అలలతో ఆటలు ప్రాణాలకే ముప్పుతెచ్చాయి...!

యూట్యూబ్ వీడియో కోసం జలపాతం మధ్యన నిలబడ్డాడు...!.


కెరటంలా విరుచుపడిన అలలు... తమలో కలిపేసుకుని తీసుకువెళ్ళాయి..!


కళ్ళముందే స్నేహితుడు కొట్టుకుపోతుంటే... ఏమీ చేయలేక అతని స్నేహితులు రోదించారు..!

......

జలపాతంలో యూట్యూబర్ గల్లంతు..!


ఒడిశా కోరాపుట్ జిల్లాలోని డుడుమ జలపాతంలో ఘటన..!


స్థానికంగా పాపులర్ అయిన యూట్యూబర్ సాగర్ తుడు వరదనీటి ఉదృతిలో కొట్టుకుపోయాడు..!


సాగర్ తుడు ఒడిశా లోని బెర్హంపూర్ కు చెందిన యువకుడు..!


స్థానిక అంశాలపై, నెటిజన్లను ఆకర్షించే అంశాలపై యూట్యూబ్ వీడియోలు చేస్తూ.. కాస్త పాపులారిటీ సంపాదించాడు.

ఇదే క్రమంలో ఇటీవలి వర్షాల వల్ల జలపాతాలన్నీ కళకళలాడుతూ ఆకట్టుకుంటున్న వేళ.. ఒక వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాలని ప్లాన్ చేసుకున్నాడు.


ఒడిశాలోని అత్యంత పెద్దదైన డుడుమ జలపాతం వద్ద నీటి మధ్యలో నిలబడి వీడియో షూట్ చేయాలనేది ప్లాన్..! అనుకున్నట్లుగానే శనివారం స్నేహితులతో కలిసి సాగర్ జలపాతం వద్దకు చేరుకున్నాడు. అప్పటికే పర్యాటకులు పెద్దసంఖ్యలో వాటర్ ఫాల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు..! సాగర్ జలపాతం మధ్యలోకి వెళ్ళి ఒక బండరాయిపై నిలుచున్నాడు. తాడు సహాయంతో అతను కిందపడకుండా స్నేహితులు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే అతను నిలబడిన క్షణాల్లోనే వరద ఉదృతి పెరిగింది.. అతను నిలబడిన చోట బుజాల వరకు నీటి ఉదృతి పెరుగుతూ వచ్చింది.. నీటి ఉదృతి గమనించిన స్నేహితులు అతన్ని కాపాడటానికి అనుసంధానంగా ఉన్న తాడును గట్టిగా పట్టుకోవాలని సూచిస్తూనే ఉన్నారు. అయితే పరిస్థితి అప్పటికే చేయిదాటిపోయింది. నీటి ప్రవాహ వేగానికి కాళ్ళు కదిలిపోయి అమాంతం ప్రవాహంలోకి జారిపోయాడు.. అలాగే ప్రవాహంలో కొట్టుకుపోయాడు

కళ్ళముందే స్నేహితుడు జలపాతంలో కొట్టుకుపోతుంటే.. ఏమీ చేయలేని స్థితిలో అతని స్నేహితులు రోధించిన తీరు పర్యాటకులందరినీ చలింపచేసింది..

అతని స్నేహితులు ఇతర పర్యాటకులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.


ఇప్పటివరకైతే సాగర్ ఆచూకీ ఇంకా లభించలేదని సమాచారం.!

వీడియోల కోసం ఇలాంటి ప్రమాదకరమైన రిస్కులు చేయొద్దని నెటిజన్లు..పోలీసులు సూచిస్తున్నారు.

...

Comments


© Copyrights Reserved 2024 By NewSense News | Designed & Developed by Panchayithi.com 

bottom of page